Bharat Jodo Yatra: 200 కిలోమీటర్ల మైలురాయి దాటిన భారత్ జోడో యాత్ర.. చిన్నారికి చెప్పు తొడిగిన రాహుల్..
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కేరళలో ఉత్సాహంగా కొనసాగుతోంది. రాహుల్.. చిన్నా పెద్దా తేడా లేకుండా జనంతో మమేకమవతూ తన యాత్రను కొనసాగిస్తున్నారు.
Rahul Gandhi Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కేరళలో ఉత్సాహంగా కొనసాగుతోంది. రాహుల్.. చిన్నా పెద్దా తేడా లేకుండా జనంతో మమేకమవతూ తన యాత్రను కొనసాగిస్తున్నారు. భారత్ జోడో యాత్ర 11 వ రోజు 200 కిలోమీటర్ల మైలురాయిని దాటింది. తన పాదయాత్రలో సామాన్యులతో మమేకం అవుతూ ముందుకు కదులుతున్నారు. కేరళలోని హరిపాడులో ఆదివారం ఉదయం 6.30 గంటలకు పాదయాత్రను ప్రారంభించిన రాహుల్ పురకాడు వరకు కొనసాగించారు. అయితే.. పాదయాత్రలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసకుంది. పాదయాత్రలో ఓ చిన్నారి చెప్పు ఊడిపోవడంతో ఇబ్బంది పడుతుంది. ఈ సమయంలో చిన్నారి ఇబ్బందిని గమనించిన రాహుల్ గాంధీ స్వయంగా చెప్పు స్ట్రాప్‌ను సరిచేయడం అందరి దృష్టిని ఆకర్షించింది.
చిన్నారులపై రాహుల్‌కు ఉన్న అప్యాయత, అనురాగం ఈ ఘటన నిరూపించిందని కాంగ్రెస్ నేతలు ప్రశంసిస్తున్నారు. సోషల్‌మీడియాలో రాహుల్‌పై ప్రశంసలు వెలువెత్తాయి. అనంతరం రాహుల్ గాంధీ కుట్టనాడులో రైతులతో సమావేశమయ్యారు. ఈ యాత్రలో అగ్రనేతలతోపాటు కేరళ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు కూడా పాల్గొంటున్నారు.
Ek Tera Kadam, Ek Mera Kadam..
Let’s get the little one #BharatJodoYatra ready! 🙂 pic.twitter.com/Uj0VHWpPQN
— Bharat Jodo (@bharatjodo) September 18, 2022
భారత్ జోడో యాత్రలో భాగంగా ఆదివారం రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. పాదయాత్రలో సామాన్యుల బాధలు తనకు తెలుస్తున్నాయని పేర్కొన్నారు. కేంద్రం సామాన్యులను పట్టించుకోవడం లేదని విమర్శించారు.
सादगी और प्रेमभाव ?
देश को एकजुट रखने के लिये दोनों चाहिए। #BharatJodoYatra ?? pic.twitter.com/txkM2AQNYU
— Netta D’Souza (@dnetta) September 18, 2022
ఇదిలాఉంటే.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పగ్గాలను రాహుల్ చేపట్టాలని రాజస్థాన్, చత్తీస్‌ఘడ్ కాంగ్రెస్ కమిటీలు ఏకగ్రీవ తీర్మానాన్ని చేశాయి. కాంగ్రెస్ అథ్యక్ష ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన వేళ రాహుల్ పార్టీ పగ్గాలు చేపట్టాలని అటు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, చత్తీస్‌ఘడ్ సీఎం భూపేష్ బాగేల్ విజ్ఞప్తి చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..