AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: రాబందు జంటను పూజించే అద్భుత దేవాలయం.. కోరిన కోర్కెలు తీర్చే దేవుడు.. బారులు తీరిన భక్తులు..

సతీ దేవాలయం ఇప్పుడు విశ్వాసానికి కేంద్రంగా మారింది. నేపాల్ దేశం నుండి కూడా ప్రజలు ఈ జాతరకు వస్తుంటారు. విశేషమేమిటంటే ఈ ఆలయానికి ఆదివారం ఎక్కువ మంది భక్తులు వస్తుంటారు.

Viral News: రాబందు జంటను పూజించే అద్భుత దేవాలయం.. కోరిన కోర్కెలు తీర్చే దేవుడు.. బారులు తీరిన భక్తులు..
Vulture Couple
Jyothi Gadda
|

Updated on: Sep 19, 2022 | 3:38 PM

Share

Uttar pradesh: ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలో ఓ అరుదైన దేవాలయం ఉంది. ఇక్కడి ఆలయంలో విచిత్ర విగ్రహాలు ప్రతిష్టించబడ్డాయి. కానీ, అవి ఏ దేవతలకు సంబంధించినవి కావు.. అవి అంతరించిపోయిన రాబందు జంట. ఈ ప్రత్యేకమైన ఆలయం రాబందు జంట ప్రేమ కథను వర్ణిస్తుంది. ప్రజలు ఈ ఆలయాన్ని రాబందు సతీ దేవాలయం అని పిలుస్తారు. ప్రతిరోజూ ప్రజలు ఇక్కడకు వచ్చి ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేస్తుంటారు. కోర్కెలు కోరుకుని మొక్కులు చెల్లించుకుంటారు. ఇక్కడ పూజలు చేసే ప్రజలు తమ ప్రతి కోరిక ఇక్కడికి వస్తే నెరవేరుతుందని చెబుతారు. ఆలయ ప్రాంగణంలో ప్రతి సంవత్సరం కూడా నెల రోజుల పాటు జాతర జరుగుతుంది. ఇందులో పొరుగు దేశం నేపాల్ నుండి కూడా ప్రజలు తరలి వస్తారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

లఖింపూర్ ఖేరీ జిల్లాలోని సదర్ తహసీల్ ప్రాంతంలోని కోతిల గ్రామ పంచాయితీలో లఖింపూర్ నుండి పొరుగు దేశం నేపాల్ సరిహద్దుకు వెళ్లే రహదారి వెంట ఒక గొప్ప ఆలయం నిర్మించబడింది. ఈ ఆలయంలో రెండు విగ్రహాలు ప్రతిష్టించబడ్డాయి. అయితే ఈ విగ్రహాలు ఏ దేవతలవి కావు..రాబందు జంట విగ్రహాలు. ఈ విగ్రహాల వెనుక ఓ కథ ఉందని చెబుతున్నారు అక్కడి స్థానికులు. సుమారు 65 ఏళ్ల క్రితం 1962 జూలై నెలలో గ్రామానికి కొంత దూరంలో ఉన్న కాలువ ఒడ్డున ఓ జంతువు చనిపోయిందని, దానిని తినేందుకు రాబందుల మంద ఇక్కడికి వచ్చింది. జంతువు మాంసం తిన్న తర్వాత రాబందులు అన్నీ ఎగిరిపోయాయి.. కానీ, అందులో ఒక మగ రాబందు అక్కడే చనిపోయిందట..ఆ తర్వాత మరో ఆడ రాబందు తిరిగి ప్రత్యక్షమైందని ప్రచారం జరుగుతోంది. తోటి రాబందు చనిపోవడంతో రెండో ఆడ రాబందు చాలా రోజుల పాటు ఆహారం తినడం, నీళ్లు తాగడం మానేసింది. పైగా ఆ చనిపోయిన రాబందు మృతకళేబరం మీదే కూర్చుని ఉండేదని చెబుతున్నారు. ఇదంతా రోజుల తరబడి అక్కడి జనం చూస్తుండేవారు..ఎవరైనా దానిని గదమాయించి తిండి, నీళ్లు ఇచ్చినా తినేదికాదట..కానీ, అక్కడికి కొద్ది దూరంలో ఉన్న కాలువలో స్నానం చేసి మళ్లీ ఆ చచ్చిన రాబందు కళేబరం వద్దకే వచ్చేదని చెబుతున్నారు. ఇలా దాదాపు 10 రోజుల తర్వాత రెండో రాబందు కూడా తన తోటి రాబందు చనిపోయిన చోటే ప్రాణాలు విడిచింది. ఈ జంట రాబందు ప్రేమకథ ఈ ప్రాంతంలోని ప్రతి ఒక్కరి నాలుకపై చెక్కబడిందంటారు.

తోటి రాబందు చనిపోవడంతో ఆడ రాబందు కూడా అక్కడే ప్రాణాలు వదులుకుందని గ్రామ పెద్ద రమాకాంత్ వర్మ సహా పలువురు గ్రామస్తులు చెబుతున్నారు. దీని కారణంగా ఆడ రాబందు మగ రాబందును విడిచి ఉండలేక తన జీవితాన్ని త్యాగం చేసి సతిగా మారిందని నమ్ముతారు. దీని తరువాత చనిపోయిన రాబందులు రెండింటి మృతదేహాలను గ్రామస్థులు గ్రామ సమీపంలోనే దహనం చేశారు. దీంతో పాటు అక్కడే చిన్న ఆలయాన్ని కూడా నిర్మించారు. ఇందులో రెండు రాబందుల విగ్రహాలను ఏర్పాటు చేశారు. తరువాత, చాలా మంది భక్తితో ఇక్కడికి రావడం ప్రారంభించారు. పూజలు ప్రారంభించారు. అలా కాల క్రమేణా గ్రామస్తులు మరో భారీ ఆలయాన్ని పునర్‌ నిర్మించారు. అందులో రెండు రాబందుల విగ్రహాలను ప్రతిష్టించారు.

ఇవి కూడా చదవండి

సతీ దేవాలయం ఇప్పుడు విశ్వాసానికి కేంద్రంగా మారింది. సతీ మేళా కమిటీ అధ్యక్షుడు రంజిత్ కుమార్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సతీదేవి ఆలయంలో జాతర జరుగుతుందన్నారు. ఈ జాతర నెల రోజుల పాటు సాగుతుంది. ఇందులో సుదూర ప్రాంతాల ప్రజలు పాల్గొంటారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. దీనితో పాటు భండారా మొదలైన వాటిని కూడా నిర్వహిస్తారు. నేపాల్ దేశం నుండి కూడా ప్రజలు ఈ జాతరకు వస్తుంటారు. విశేషమేమిటంటే ఈ ఆలయానికి ఆదివారం ఎక్కువ మంది భక్తులు వస్తుంటారు. ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు..ప్రమాణాలు చేస్తారు. ఇక్కడ తమ కోర్కెలు నెరవేరాయని పలువురు భక్తులు విశ్వంగా చెబుతున్నారు. ఈ ప్రాంతంలోని విద్యార్థులు పరీక్షల సమయంలో ఈ ఆలయానికి వచ్చి పరీక్షలో బాగా రాణించాలని వారి ఆశీస్సులు కోరుతారని ఓ యువకుడు పేర్కొన్నాడు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి