AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: ప్రధాని మోదీని తలపాగాతో సత్కరించిన సిక్కు ప్రతినిధులు.. ఢిల్లీలోని గురుద్వారాలో ‘అఖండ పథం’..

Prime Minister Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ఢిల్లీలోని గురుద్వారా శ్రీ బాలా సాహిబ్ జీ 'అఖండ పథం' నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతినిధుల బృందం మోదీని ప్రత్యేకంగా కలిశారు..

PM Modi: ప్రధాని మోదీని తలపాగాతో సత్కరించిన సిక్కు ప్రతినిధులు.. ఢిల్లీలోని గురుద్వారాలో 'అఖండ పథం'..
Prime Minister Modi
Sanjay Kasula
|

Updated on: Sep 19, 2022 | 3:40 PM

Share

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ఢిల్లీలోని గురుద్వారా శ్రీ బాలా సాహిబ్ జీ ‘అఖండ పథం’ నిర్వహించారు. ఈ ‘అఖండ పథం’లో వేలాది మంది సిక్కులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గురుద్వారా సాహిబ్‌ ఆధ్వర్యంలో లంగర్‌, ఆరోగ్య శిబిరం, రక్తదాన శిబిరం కూడా నిర్వహించారు. గురుద్వారా కమిటీ ప్రతినిధి బృందం ఈరోజు 7 లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని ఆయన నివాసంలో ప్రధానిని కలిసారు. అనంతరం ఆయనకు ప్రసాదం, ఆశీస్సులు అందించారు. సిక్కు ప్రతినిధి బృందం ప్రధానమంత్రిని తలపాగాతో అలంకరించి సత్కరించారు. ప్రధానమంత్రి దీర్ఘాయుష్షు, మంచి ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేశారు.

సిక్కు ప్ర‌తినిధులు తనను క‌ల‌సినందుకు ప్ర‌ధాన మంత్రి సంతోషాన్ని వ్య‌క్తం చేశారు. వారి క్షేమం కోసం వారికి ధ‌న్య‌వాదాలు తెలిపారు. సిక్కు కమ్యూనిటీ సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు.

అనంతరం డిసెంబరు 26ని ‘వీర్ బాల్ దివస్’గా ప్రకటించాలని ప్రధాని మోదీని ప్రతినిధి బృందం కోరింది. కర్తార్‌పూర్ సాహిబ్ కారిడార్‌ను పునఃప్రారంభించడం. గురుద్వారాల ద్వారా నడిచే లంగర్‌లపై జీఎస్‌టీని తొలగించడం. గురుగ్రంథ సాహిబ్ కాపీలు ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారత్‌కు చేరేలా చూడాలని వారు ప్రధానమంత్రి మోదీకి విజ్ఞప్తి చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం

పర్వతం అంచున భీముని రాయి.. గాలికి కదులుతున్నా పడిపోని అద్భుతం..
పర్వతం అంచున భీముని రాయి.. గాలికి కదులుతున్నా పడిపోని అద్భుతం..
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!