Telangana: దారుణం.. వ్యభిచారులంటూ ఇద్దరు మహిళలను చెట్టుకు కట్టేసి శిరోముండనం..!

ఇది తమ గ్రామ ఆచారామంటూ తండావాసులు పోలీసులను వెనక్కి పంపించేసినట్టుగా తెలిసింది. ఇదిలా ఉంటే, యువకుడు మృతితో తమకు ఎలాంటి సంబంధం లేదని బాధిత మహిళ వాపోతోంది.

Telangana: దారుణం.. వ్యభిచారులంటూ ఇద్దరు మహిళలను చెట్టుకు కట్టేసి శిరోముండనం..!
Darunam
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 19, 2022 | 5:22 PM

Telangana: నల్లగొండ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. నల్లగొండ జిల్లా కొండముల్లేపల్లి మండలం రాముగుండ్ల తండాలో ఓ యువకుడి ఆత్మహత్యకు కారణమంటూ ఇద్దరు మహిళలకు శిరోముండనం చేయించిన ఘటన చోటు చేసుకుంది. తండాకు చెందిన 17ఏళ్ల యువకుడు ఈ నెల 14న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు యువకుడి అంత్యక్రియలు పూర్తి చేసిన అనంతరం అతడి సెల్‌ఫోన్‌ చెక్‌ చేయగా షాకింగ్‌ విషయాలు బయటడ్డాయని చెబుతున్నారు. తండాకు చెందిన ఇద్దరు మహిళలతో అతను ఫోన్‌లో మాట్లాడినట్టుగా తెలిసింది. దీంతో తమ కుమారుడి మృతికి కారణం ఆ ఇద్దరు మహిళలేనని ఆరోపిస్తూ తండా పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టారు. ఇద్దరినీ ఇంట్లోంచి ఈడ్చుకెళ్లి చెట్టుకు కట్టేసి కొట్టారని తెలిసింది. గ్రామ సర్పంచ్‌, పంచాయతీ పెద్దల సమక్షంలో వారిని వ్యభిచారులని నిందిస్తూ శిరోముండనం చేశారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే కుల బహిష్కరణ చేస్తామని హెచ్చరించారు.

విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. సమాచారం మేరకు దేవరకొండ డివిజన్‌ పోలీసులు తండాకు చేరుకున్నారు. కాగా, ఇది తమ గ్రామ ఆచారామంటూ తండావాసులు పోలీసులను వెనక్కి పంపించేసినట్టుగా తెలిసింది. ఇదిలా ఉంటే, యువకుడు మృతితో తమకు ఎలాంటి సంబంధం లేదని బాధిత మహిళ వాపోతోంది. ఇంట్లో ఉన్న తనతోపాటు మరో మహిళను కూడా ఈడ్చుకెళ్లి చెట్టుకు కట్టేసి తండా పెద్దలు, తండావాసులు కొట్టారని చెబుతోంది. తనకు న్యాయం చేయాలంటూ వేడుకుంటోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి