Mission 90: బీజేపీ ఏదో పెద్ద ప్లానే చేస్తోంది.. ఈటల రాజేందర్‌తో అమిత్ షా 20 నిమిషాల ఏకాంత సమావేశం అందుకేనా..
Minister Amit Shah: అంత వరకు ఓకే.. కానీ ఆ తర్వాతే.. అమిత్ షాతో ఈటల రాజేందర్ దాదాపు 20 నిమిషాలు ఏకాంతంగా మాట్లాడారు.. అప్పుడే.. ఆ 20 నిమిషాల్లోనే ఏదో జరిగిందని తెలంగాణ మొత్తం చర్చ..
తెలంగాణలో బీజేపీ ఏదో పెద్ద ప్లానే చేస్తోంది. లేకపోతే.. సెప్టెంబర్ 17న అమిత్ షా టూర్ షెడ్యూల్ చివరిక్షణంలో సడెన్‌గా మారడమేంటి.. షెడ్యూల్‌లో లేని ప్రోగ్రామ్ ఫిక్స్ చేయడమేంటి.. అసలేం జరుగుతోంది. సెప్టెంబర్ 17న పెరేడ్ గ్రౌండ్‌లో ప్రోగ్రామ్ ముగిశాక.. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇంటికి.. వెళ్లాలని అమిత్ షా అకస్మాత్తుగా నిర్ణయం తీసుకున్నారట. అంతకుముందు తెలంగాణ బీజేపీ ప్రత్యేక ఇంఛార్జ్ సునీల్ బన్సల్.. ఈటల రాజేందర్ ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. ఆ తర్వాత అమిత్ షా.. ఈటల రాజేందర్ ఇంటికి వెళ్లనున్నట్లు షెడ్యూల్ ప్రకటించారు. ఈటల తండ్రి మల్లయ్య మరణించిన నేపథ్యంలో కుటుంబసభ్యులను పరామర్శించారు కేంద్ర హోంమంత్రి. అంత వరకు ఓకే.. కానీ ఆ తర్వాతే.. అమిత్ షాతో ఈటల రాజేందర్ దాదాపు 20 నిమిషాలు ఏకాంతంగా మాట్లాడారు.. అప్పుడే.. ఆ 20 నిమిషాల్లోనే ఏదో జరిగిందని తెలంగాణ మొత్తం చర్చ జరుగుతోంది.
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే అవసరమైన కార్యచరణ నివేదికను అమిత్ షా చేతికి అందించారు ఎమ్మెల్యే ఈటల రాజేందర్. 90 సీట్లు గెలవడమే లక్ష్యంగా మిషన్ 90 రిపోర్ట్ లో కీలక అంశాలను పొందుపరిచారట. ఆ రిపోర్ట్‌లో పార్టీ బలంగా ఉండి బలహీనమైన అభ్యర్థులు ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు, పార్టీ బలహీనంగా ఉండి బలమైన అభ్యర్థులు ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్ల వివరాలు రిపోర్ట్‌లో క్షుణ్ణంగా వివరించారట.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లేందుకు అవసరమైన వ్యూహాలు, ప్రణాళికలు, ప్రత్యర్థి పార్టీల బలహీనతలు, విధాన పరమైన హామీల్లాంటివన్నీ అందులో చెప్పారట.
ఈ ప్రశ్నలన్నీ రాష్ట్ర కమలనాథులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. అమిత్ షాకు ఇచ్చిన రిపోర్ట్‌లో ఇతర అంశాలు ఏమైనా ఉన్నాయా ? పార్టీ నేతల మధ్య సమన్వయంపై ఏమైనా ఫిర్యాదులు చేశారా? అన్నదానిపైనా కొంత ఉత్కంఠ నెలకొంది. ఈటల రాజేందర్ మాత్రం అమిత్ షాతో మాట్లాడిన విషయాలపై నోరు మెదపకపోవడం ఆసక్తితో పాటు.. టెన్షన్ కూడా పెడుతోందట.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం