Olectra Greentech: ఒలెక్ట్రా గ్రీన్ టెక్‌కు మరో ఆర్టీసీ నుంచి భారీ ఆర్డర్.. దాని విలువ రూ. 185 కోట్లు.. ఎక్కడంటే..
ఇప్పటికే పూణె, ముంబై,నాగ్‌పూర్‌లలో ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతున్నట్టుగా వివరించారు. ఒక్క మహారాష్ట్రలోనే ఒలెక్ట్రా ఈ-బస్సులు మూడు కోట్ల కిలోమీటర్లకు పైగా ప్రయాణించి కర్బన ఉద్గారాలను గణనీయంగా తగ్గించాయి.
Olectra Greentech: ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్ (OLECTRA) మరియు ఈవీ ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (EVEY)ల కన్సార్టియం మరో ఆర్టీసీ నుండి ఆర్డర్ అందుకుంది. థానే మున్సిపల్ ట్రాన్స్‌పోర్ట్ అండర్‌టేకింగ్ నుండి123 ఎలక్ట్రిక్ బస్సులకు ఆర్డర్ లభించింది. మొత్తం ఆర్డర్ విలువ రూ. 185 కోట్లు అని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆర్డర్ ప్రకారం EVEY ట్రాన్స్ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ నుండి ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేసి తొమ్మిది నెలల్లో డెలివరీ చేస్తుంది. అయితే, ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ 15 సంవత్సరాల కాంట్రాక్ట్ వ్యవధిలో బస్సులను నిర్వహిస్తుంది. ఈ 123 ఈ-బస్సులలో 55 (45 ఎయిర్ కండిషన్డ్ మరియు 10 నాన్-ఏసీ) 12 మీటర్ల బస్సులు. ఇతర 68 ఈ-బస్సులు (26 ఎయిర్ కండిషన్డ్, 42 నాన్-ఎసి) -9-మీటర్లు. 12 మీటర్ల బస్సులు 200 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటాయి. వీటిలో డ్రైవర్‌తో పాటు 39 మంది సీటింగ్ కెపాసిటీని కలిగి ఉంటాయి. 9 మీటర్ల బస్సులు 160 కిలోమీటర్లు మరియు 31 సీటింగ్ కెపాసిటీతో పాటు డ్రైవర్‌తో ఉంటాయి. ఈ లిథియం-అయాన్ బ్యాటరీ కలిగి ఉన్న ఈ బస్సులను నాలుగు గంటల్లోగా పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు.
ఈ మేరకు..కన్సార్టియం చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కెవి ప్రదీప్ మాట్లాడుతూ.. మహారాష్ట్ర రాష్ట్ర నుండి మరో ఆర్డర్ రావడం సంతోషంగా ఉందన్నారు. దీంతో తమ ఉనికి మరో నగరం థానేకి విస్తరించిందన్నారు. ఇప్పటికే పూణె, ముంబై,నాగ్‌పూర్‌లలో ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతున్నట్టుగా వివరించారు. ఒక్క మహారాష్ట్రలోనే ఒలెక్ట్రా ఈ-బస్సులు మూడు కోట్ల కిలోమీటర్లకు పైగా ప్రయాణించి కర్బన ఉద్గారాలను గణనీయంగా తగ్గించాయి. మా ఈ-బస్సులు భారతదేశంలోని నలుమూలలా తిరుగుతున్నాయి. ఒలెక్ట్రా ఈ-బస్సులు దేశంలో ఏడు కోట్ల కిలోమీటర్లకు పైగా ప్రయాణించాయని వెల్లడించారు.