Instagram: సోషల్ మీడియాతో టైమ్ వేస్ట్ అనుకుంటే పొరపాటే.. బగ్ కనిపెట్టి.. రూ.38 లక్షల రివార్డ్ కొట్టేసిన స్టూడెంట్

సోషల్ మీడియా.. చిన్నా పెద్దా ఆడా మగా అనే తేడా లేకుండా అందరినీ తనకు బానిసలుగా మార్చుకుంటుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు ప్రతి...

Instagram: సోషల్ మీడియాతో టైమ్ వేస్ట్ అనుకుంటే పొరపాటే.. బగ్ కనిపెట్టి.. రూ.38 లక్షల రివార్డ్ కొట్టేసిన స్టూడెంట్
Instagram
Follow us

|

Updated on: Sep 19, 2022 | 6:42 PM

సోషల్ మీడియా.. చిన్నా పెద్దా ఆడా మగా అనే తేడా లేకుండా అందరినీ తనకు బానిసలుగా మార్చుకుంటుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు ప్రతి ఒక్కరూ ఇంటర్నెట్ లోనే గడిపేస్తున్నారు. వీటి ధ్యాసలో పడి కనీసం కడుపు నిండా తిండి కూడా తినడం లేదు. మానవ జీవితంలో ఇంతగా పెనవేసుకుపోవడానికి కారణాలెన్నో. అయితే సోషల్ మీడియాలో ప్రస్తుతం ఇన్ స్టా గ్రామ్ హవా నడుస్తోంది. సెల్ఫీ దిగడం, అప్ లోడ్ చేయడం, ఎన్ని లైక్స్, కామెంట్స్ వచ్చాయో చూసుకోవడం ఇదే పని. ఇక రీల్స్ చేసే వారి గురుంచి చెప్పనక్కర్లేదు. అయితే సామాజిక మాధ్యమాలు ఎంత అప్డేట్ లో ఉన్నా.. వాటిలోనూ కొన్ని బగ్స్ ఉంటాయి. వాటిని కనిపెట్టిన వారికి సదరు కంపెనీలు భారీ మొత్తాన్ని చెల్లిస్తాయి. తాజాగా రాజస్థాన్​కు చెందిన ఓ విద్యార్థి.. కోట్లాది మంది యూజర్లు ఉపయోగించే సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఇన్​స్టాగ్రామ్ ఖాతాలను హ్యాక్​ అవ్వకుండా కాపాడాడు. అందుకు గానూ భారీగా రివార్డునూ అందుకున్నాడు. రాజస్థాన్​లోని జైపుర్​కు చెందిన నీరజ్​ శర్మ చదువుకుంటున్నాడు. ఖాళీ సమయాల్లో ఇన్​స్టాగ్రామ్​ వాడుతుంటాడు. అందులో ఉండే రీల్స్, ఫొటోలను చూసి ఆనందించేవాడు.

ఈ క్రమంలో గతేడాది డిసెంబర్​లో రీల్స్ సెగ్మెంట్​లో బగ్​ఉందని గుర్తించాడు. దానిని నిరూపించేందుకు నెల రోజుల పాటు కష్టపడ్డాడు. చివరికి లక్ష్యాన్ని సాధించాడు. మనం చేసిన రీల్స్​కు పెట్టిన థంబ్​నెయిల్​ను పాస్​వర్డ్​అవసరం లేకుండా హ్యాకర్లు ఈజీగా ఈ బగ్ ద్వారా మార్చేయవచ్చు. ఆ బగ్​ను గుర్తించిన నీరజ్​శర్మ వెంటనే ఫేస్​బుక్​, ఇన్​స్టాగ్రామ్​కు సమాచారం అందించాడు. ఈ బగ్ నిజమేనని నిర్ధరించిన ఫేస్​బుక్ డెమో షేర్​ చేయమని అడిగింది. వెంటనే నీరజ్ ఓ రీల్​థంబ్​నెయిల్​ను ఐదు నిమిషాల్లో మార్చి వారికి చూపించాడు.

Bug In Instagram

Bug In Instagram

కొన్ని రోజుల తర్వాత నీరజ్​కు ఫేస్​బుక్ అధికారిక మెయిల్ ఐడీ నుంచి ఓ మెయిల్​ వచ్చింది. బగ్ గుర్తించినందుకు గానూ అతనికి $45,000 (సుమారు రూ. 35 లక్షలు) రివార్డు ఇవ్వనున్నట్లు తెలిపింది. అంతే కాకుండా మరో $4500(సుమారు రూ.3 లక్షలు) బోనస్​కూడా ఇచ్చింది. సరదాగా కాలక్షేపం కోసం ఉపయోగించిన ఇన్ స్టా గ్రామ్ తనకు లక్షల రూపాయలు తెచ్చి పెట్టడంతో నీరజ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం