IRCTC: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇక టికెట్ బుక్కింగ్ చాలా ఈజీ.. ఆ రూల్‌ను మార్చిన ఐఆర్సీటీసీ..
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా రైలు టిక్కెట్లను బుక్ చేసేటప్పుడు IRCTC వెబ్‌సైట్, యాప్‌లో గమ్యస్థాన చిరునామాను పూరించడం తప్పనిసరి చేసింది భారతీయ రైల్వే. అయితే..
మీరు IRCTC వెబ్‌సైట్, యాప్ నుంచి టిక్కెట్‌లను బుక్ చేస్తున్నట్లయితే.. ఈ వార్త మీకోసమే. ఎందుకంటే.. టిక్కెట్‌లను బుక్ చేస్తున్నప్పుడు.. మీరు మీ గమ్యస్థాన చిరునామాను పూరించాలి. కానీ ఇప్పుడు మీరు పూరించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భారతీయ రైల్వే తన కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇకముందు టిక్కెట్లను బుక్ చేసుకునే సమయంలో తాము వెళ్లాలనుకుంటున్న ప్రదేశానికి సంబంధించిన చిరునామాను నింపాల్సిన అవసరం లేదని రైల్వే తన కొత్త మార్గదర్శకాల్లో పేర్కొంది. దీంతో టిక్కెట్లు బుక్ చేసుకునే వారికి ఉపశమనం కలుగుతుంది. ఎందుకంటే టికెట్ బుకింగ్ సమయంలో మీరు చిరునామాను పూరించే సమయంలో టికెట్ బుక్ చేసుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీంతో కొంత మంది సీటును అనుకున్న సమయానికి కన్ఫర్మ్ చేయలేరు. ఇప్పుడు ప్రజలు సులభంగా టిక్కెట్లు బుక్ చేసుకోగలుగుతారు. దీంతో ప్రయాణికులకు బుక్కింగ్ సమయం కూడా ఆదా అవుతుంది.
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా.. రైలు టిక్కెట్లను బుక్ చేసేటప్పుడు IRCTC వెబ్‌సైట్, యాప్‌లో గమ్యస్థాన చిరునామాను పూరించడం తప్పనిసారి చేసింది. టికెట్ నింపకుండా బుక్ చేసుకోలేకపోయారు. దీంతో ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే.. దీంతో ఇప్పుడు ప్రయాణికులకు ఊరట లభించనుంది.
కరోనా కారణంగా అడ్రస్ ఫిల్లింగ్..
మహమ్మారి వ్యాప్తి సమయంలో COVID ఉన్నవారిని గుర్తించడంలో వారు వెళ్తున్న అడ్రస్ వివరాలు నమోదు చేయడం వల్ల ప్రభుత్వానికి బాగా సహాయపడింది. కరోనా ప్రారంభమైనప్పుడు.. దానిని ఆపడానికి అనేక నిర్ణయాలు తీసుకుంది ప్రభుత్వం. ఆపై రైల్వేలు కూడా చాలా ఆంక్షలు విధించింది. వాటిలో ఇది కూడా ఒకటి. కొన్ని రోజుల పాటు రైళ్లను రైల్వే మూసివేసింది. దీని తర్వాత, రైళ్లను తిరిగి ప్రారంభించినప్పటికీ.. అనేక నిబంధనలు అమలులో ఉన్నాయి. అదేవిధంగా, ఇటీవల రైల్వే మరోసారి దిండు-దుప్పటిని తిరిగి ఇవ్వడం మొదలు పెట్టింది. ఇప్పుడు ప్రయాణికులు రాత్రిపూట నిద్రించడానికి వివిధ రైళ్లలో దిండ్లు, దుప్పట్లు అందిస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం