Health: ఏదీ వృధా కాదండోయ్.. బియ్యం కడిగిన నీటితో మెరిసే చర్మం మీ సొంతం.. ఆ మచ్చలను కూడా..

చాలా మంది బియ్యం (Rice Water) కడిగిన నీళ్లను పాడేస్తుంటారు. లేదా పశువులకు తాగించేందుకు వాడుతుంటారు. అయితే ఈ నీళ్లతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. పురాతన...

Health: ఏదీ వృధా కాదండోయ్.. బియ్యం కడిగిన నీటితో మెరిసే చర్మం మీ సొంతం.. ఆ మచ్చలను కూడా..
Face Washing
Follow us
Ganesh Mudavath

|

Updated on: Sep 19, 2022 | 3:11 PM

చాలా మంది బియ్యం (Rice Water) కడిగిన నీళ్లను పాడేస్తుంటారు. లేదా పశువులకు తాగించేందుకు వాడుతుంటారు. అయితే ఈ నీళ్లతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. పురాతన కాలం నుంచి బియ్యం నీటిని చర్మ సౌందర్యం కోసం ఉపయోగించుకుంటున్నారు. అంతేకాకుండా బియ్యం కడిగిన నీళ్లు వయసు వల్ల ఏర్పడే ముడతలు, మచ్చల్ని పోగొడుతుంది. బియ్యం నీరు చర్మం మంచి మాయిశ్చరైజ్ గా పని చేస్తుంది. చర్మాన్ని మృదువుగా చేసి, ప్రకాశవంతంగా మారుస్తుంది. సాధారణంగా వివిధ రకాల సౌందర్య సాధనాలను ఉపయోగిస్తుంటారు. ఇవి కొందరికి దుష్ప్రభావం కలిగిస్తాయి. వాటి తాలూకు గుర్తులు అలాగే ఉండిపోతాయి. అలాంటి సమస్యలను తగ్గించేందుకు బియ్యం కడిగిన నీళ్లు అద్భుతంగా పని చేస్తాయి. అన్నం వండే సమయంలో బియ్యాన్ని ముందుగా కాసేపు నీటిలో నానబెట్టి కడుగుతాం. ఈ నీటిలో అనేక విటమిన్లు, పోషకాలు, ఆరోగ్యాన్ని కలిగించే ఎన్నో ఖనిజాలు ఉంటాయి. ఇందులో ఉండే యాంటీ యాక్సిడెంట్లు చర్మానికి జీవం ఇవ్వడానికి సహాయపడతాయి. నీరు నానబెట్టిన బియ్యం నీటిని సిద్ధం చేసుకోవడం ఎంతో తేలిక. అర కప్పు బియ్యం తీసుకుని అందులో వ్యర్థ పదార్థాలను తొలగించాలి. కాసిన్ని నీరు పోసి కడగాలి. ఆ తర్వాత రెండు కప్పుల నీరు పోసి, 30 నిమిషాల పాటు నానబెట్టండి. ఆ తర్వాత బియ్యాన్ని తీసేసి, నీటిని వడగట్టుకోవాలి.

గంజి నీరు కావాలనుకుంటే ముందుగా ఒక కప్పు బియ్యాన్ని తీసుకోవాలి. రైస్ ను శుభ్రం చేసుకుని, అందులో నాలుగు కప్పుల వాటర్ పోయాలి. ఈ మిశ్రమాన్ని స్టవ్ పై ఉంచి వేడి చేయాలి. అన్నం ఉడుకుతున్న సమయంలో నీటిని ప్లేట్ గానీ, జల్లెడతో గానీ వార్చుకోవాలి. వార్చుకున్న నీటిని గది ఉష్ణోగ్రతలో చల్లబరచాలి. ఈ నీటిని ఫ్రిజ్ లో నిల్వ చేసుకుని దాదాపు వారం రోజులు ఉపయోగించుకోవచ్చు. పులియబెట్టిన నీటి కోసం నానబెట్టిన బియ్యం నీటిని తీసుకోవాలి. వాటిని ఫ్రిడ్జ్‌లో ఉంచకుండా బయటే ఉంచాలి. అలా రెండు రోజులు వదిలేయాలి. అప్పుడు అవి కలర్ చేంజ్ తో పాటు స్మెల్ కూడా చేంజ్ అవుతుంది. దీనిని నార్మల్ వాటర్ తో కలిపి..ముఖానికి, చర్మానికి ఉపయోగించొచ్చు.

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించేముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి