Telangana: గుట్టపై గుట్టుగా క్షుద్రపూజలు.. అర్థరాత్రి వేళ నల్ల పందులు కోళ్లతో ఏం చేశారంటే?..

క్షుద్ర పూజల పేరుతో ఏకంగా నరబలి ఇవ్వడానికి కూడా సిద్ధమైపోతున్నారు..గుప్తనిధులు, క్షుద్రపూజల పేరిట చిత్ర విచిత్ర పూజలు చేస్తూ ప్రజల్ని భయబ్రాంతులకు గురిచేస్తున్నారు.

Telangana: గుట్టపై గుట్టుగా క్షుద్రపూజలు.. అర్థరాత్రి వేళ నల్ల పందులు కోళ్లతో ఏం చేశారంటే?..
Occult Worship
Follow us

|

Updated on: Sep 19, 2022 | 6:19 PM

Telangana: దేశం మొత్తం టెక్నాలజీ వెంట పరుగులు పెడుతున్న సమయంలో కొంతమంది మాత్రం మూఢనమ్మకాల ముసుగులోనే మగ్గుతున్నారు. మంత్రాలకు చింతకాయలు రాలుతాయని నమ్మేవారు చాలా మందే ఉన్నారు. ఈ క్రమంలోనే మూఢనమ్మకాల నేపథ్యంలో ఎన్నో దారుణాలకు కూడా పాల్పడుతుంటారు. క్షుద్ర పూజల పేరుతో ఏకంగా నరబలి ఇవ్వడానికి కూడా సిద్ధమైపోతున్నారు..గుప్తనిధులు, క్షుద్రపూజల పేరిట చిత్ర విచిత్ర పూజలు చేస్తూ ప్రజల్ని భయబ్రాంతులకు గురిచేస్తున్నారు.

కరీంనగర్ జిల్లాలో క్షుద్రపూజలు కలకలం సృష్టించాయి. కరీంనగర్‌ జిల్లాలోని హుజురాబాద్ పట్టణ శివారులో ఆదివారం రాత్రి క్షుద్రపూజలు జరిపించారు గుర్తు తెలియని వ్యక్తులు. సోమవారం ఉదయం దర్శనమిచ్చిన విచిత్ర పూజల ఆనవాళ్లు స్థానికుల్ని భయబ్రాంతులకు గురిచేశాయి. రాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు పసుపు, కుంకుమ నైవేద్యాలతో క్షుద్ర పూజలు చేశారు. మర్నాడు ఉదయం ఇదంతా చూసిన ప్రజలు హడలెత్తిపోయారు. అసలేం జరుగుతందో తెలియక భయభ్రాంతులకు గురవుతున్నారు.

ఇలాంటి పూజలు ఎవరు చేస్తూన్నారో తెలియడం లేదంటూ వాపోతున్నారు. హుజురాబాద్ పట్టణం రంగనాయకుల గుట్ట వద్ద క్షుద్ర పూజలు జరిపించారంటే.. గుప్తనిధుల కోసమేనంటూ కొందరు స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి