Meet IPS Prabhakar Chaudhary: ఎంత కష్టమైన పనినైనా పరిష్కరించే IPS ఆఫీసర్.. నిజాయతీకి బహుమతి.. 13 ఏళ్ల సర్వీసులో 21 సార్లు బదిలీ

తిరిగి ప్రభాకర్ ఉత్తర్ ప్రదేశ్ కు విధుల నిమిత్తం వెళ్లారు. అక్కడ ASP గా ఆగ్రాలో మొదటిసారిగా పోస్టింగ్ ను తీసుకున్నారు. ఆ తర్వాత జాన్‌పూర్, వారణాసి, కనుపర్ లో పనిచేశారు. 2015 జనవరిలో కొత్త సంవత్సరం ప్రారంభం కాగానే ప్రభాకర్ చౌదరికి కూడా కొత్త సంవత్సరం కొత్త ఆనందాన్ని తీసుకొచ్చింది. తొలిసారిగా ఆయన జిల్లాకు బాధ్యతలు చేపట్టారు. కాన్పూర్ ఎస్పీ సిటీ నుంచి నేరుగా లలిత్ పూర్ ఎస్పీగా నియమింపబడ్డారు. సుమారు 11 నెలల పాటు లలిత్‌పూర్‌లో ఉన్నారు.

Meet IPS Prabhakar Chaudhary: ఎంత కష్టమైన పనినైనా పరిష్కరించే IPS ఆఫీసర్.. నిజాయతీకి బహుమతి.. 13 ఏళ్ల సర్వీసులో 21 సార్లు బదిలీ
Ips Prabhakar Chaudhary
Follow us
Surya Kala

| Edited By: Ravi Kiran

Updated on: Aug 01, 2023 | 1:53 PM

ఐపీఎస్ ప్రభాకర్ చౌదరి ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రముఖ వార్తగా నిలిచారు. దీనికి కారణం ఆయన బదిలీ.  ప్రభాకర్ చౌదరి తన 13 ఏళ్ల సర్వీసులో ఇప్పటి వరకు 21 సార్లు బదిలీ అయ్యారు. మీరట్‌ మినహా మరెక్కడా పదవీ కాలాన్ని ఒక్క ఏడాది కూడా పూర్తి చేయలేకపోయారు. గత ఆదివారం రాత్రి ప్రభాకర్ బరేలీ SSP పదవి నుంచి 32వ కార్ప్స్, PAC, లక్నో ఆర్మీ కమాండర్ పదవికి బదిలీ అయ్యారు. నాలుగైదు నెలలు మాత్రమే బరేలీలో ఉన్నారు. ఐపీఎస్ ప్రభాకర్ చౌదరి ఇంతకు ముందు ఏయే జిల్లాలల్లో తన విధులను నిర్వహించారో తెల్సుకుందాం..

వాస్తవానికి ఉత్తర్ ప్రదేశ్ లోని అంబేద్కర్ నగర్ జిల్లాకు చెందిన ప్రభాకర్ చౌదరి 2010లో సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఐపీఎస్ అయ్యారు. హైదరాబాద్‌లో ప్రాథమిక శిక్షణ పూర్తి చేసిన తర్వాత గౌతమ్ బుద్ధ నగర్ (నోయిడా)లో ఎస్పీ సిటీలో అండర్ ట్రైనీగా చేరారు. ఫీల్డ్ ట్రైనింగ్ పూర్తి చేసిన తర్వాత.. ప్రభాకర్ తిరిగి హైదరాబాద్ వచ్చి తన ప్రాథమిక శిక్షణను పూర్తి చేశారు.

తిరిగి ప్రభాకర్ ఉత్తర్ ప్రదేశ్ కు విధుల నిమిత్తం వెళ్లారు. అక్కడ ASP గా ఆగ్రాలో మొదటిసారిగా పోస్టింగ్ ను తీసుకున్నారు. ఆ తర్వాత జాన్‌పూర్, వారణాసి, కనుపర్ లో పనిచేశారు. 2015 జనవరిలో కొత్త సంవత్సరం ప్రారంభం కాగానే ప్రభాకర్ చౌదరికి కూడా కొత్త సంవత్సరం కొత్త ఆనందాన్ని తీసుకొచ్చింది. తొలిసారిగా ఆయన జిల్లాకు బాధ్యతలు చేపట్టారు. కాన్పూర్ ఎస్పీ సిటీ నుంచి నేరుగా లలిత్ పూర్ ఎస్పీగా నియమింపబడ్డారు. సుమారు 11 నెలల పాటు లలిత్‌పూర్‌లో ఉన్నారు. అనంతరం డిసెంబర్ నెలలోనే లక్నోలోని ఇంటెలిజెన్స్ కార్యాలయానికి బదిలీ అయ్యారు.

ఇవి కూడా చదవండి

అయితే, ఆయన ఇంటలిజెన్స్ ఆఫీసు లో కూడా ఎక్కువ కాలం ఉండలేదు. 13 జనవరి 2016న డియోరియా జిల్లా ఎస్పీగా నియమితులయ్యారు.. ఇక్కడ కూడా ఆగస్టు వరకు మాత్రమే ఉన్నారు. మళ్ళీ డియోరియా నుండి బల్లియా ఎస్పీగా పంపబడ్డారు. బల్లియాలో ఎస్పీగా విధుల్లో చేరిన రెండు నెలలకే మళ్లీ బదిలీ అయ్యారు. బల్లియా నుండి.. ప్రభాకర్ కాన్పూర్ దేహత్ ఎస్పీగా నియమించబడ్డారు ప్రభాకర్ సామాన్య పౌరుడిగా బస్సును పట్టుకుని కాన్పూర్ గ్రామీణ ప్రాంతానికి చేరుకున్నప్పుడు.. సోషల్ మీడియాలో బాగా పరిచయం అయ్యారు.

ప్రభాకర్ కేవలం ఐదు నెలలు మాత్రమే కాన్పూర్ దేహత్‌లో ఉన్నారు. 2017లో UPలో అధికార మార్పిడి జరిగింది.. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి.. సీఎం గా యోగి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే, ప్రభాకర్ చౌదరిని కాన్పూర్ దేహత్ నుండి తొలగించి UP ATSకి పంపారు. ఇక్కడ కూడా ఐదు నెలలు మాత్రమే ఉన్నారు. సెప్టెంబరు 2017లో బిజ్నోర్ జిల్లాకు బాధ్యతలు అప్పగిస్తూ బదిలీ చేశారు. బిజ్నోర్‌లో కూడా ఆరు నెలల పదవీకాలం పూర్తి చేయలేకపోయారు.

నేరుగా బిజ్నోర్ నుండి మధుర జిల్లాకు SSPగా నియమించబడ్డారు. మథురలో చేరిన వెంటనే అక్రమ వ్యాపారం చేస్తున్న పలువురు వ్యాపారులను టార్గెట్ చేస్తూ విధులను నిర్వహించారు. ఎస్‌ఎస్పీ చర్యలను నిరసించిన వ్యాపారస్తులు స్థానిక నాయకులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం లక్నోకు చేరింది. అప్పుడు  మూడు నెలల్లోనే మధుర ఎస్ఎస్పీ.. నేరుగా సీతాపూర్ ఎస్పీగా మారారు.

తన బ్యాక్‌ప్యాక్‌ను ఎప్పుడూ సిద్ధంగా ఉంచుకునే IPS ప్రభాకర్ చౌదరి

30 జూన్ 2018న సీతాపూర్ ఎస్పీగా నియమితులయ్యారు. కానీ ఇక్కడ కూడా ఆరు నెలల పదవీకాలం పూర్తి చేయలేకపోయారు. డిసెంబర్ 8న బులంద్‌షహర్ ఎస్‌ఎస్‌పీగా బదిలీ అయ్యారు. బులంద్‌షహర్‌ ఎస్‌ఎస్పీగా పనిచేసి రెండు నెలలు కూడా కాలేదు.. మళ్లీ బదిలీ అయ్యారు. అతన్ని జీఆర్పీ ఝాన్సీ పోస్టుకు పంపారు. తనకు వచ్చే బదిలీల గురించి ప్రభాకర్ చౌదరిని కూడా ఆశ్చర్యపడుతూ ఉంటారు. అందుకనే ప్రభాకర్ తన వెంట ఒక బ్యాక్‌ప్యాక్ ను ఎప్పుడూ రెడీగా ఉంచుకుంటారు.

ప్రభాకర్ చౌదరి వారణాసి ఎస్‌ఎస్పీగా కూడా ఉన్నారు

ఝాన్సీ జీఆర్పీలో ప్రభాకర్ చౌదరి ఎస్పీగా ఉన్నప్పుడు ఒక ఘటన చోటు చేసుకుంది. హడావుడిగా ప్రభాకర్ చౌదరిని సోంభద్రకు పంపారు. అక్కడ అతను తన అనుభవాన్నిఉపయోగించి తద్వారా పరిస్థితిని వెంటనే అదుపులోకి తెచ్చారు. ప్రభాకర్ చౌదరి పనికి ముగ్ధుడైన యోగీ ప్రభుత్వం నాలుగు నెలల్లోనే నేరుగా సోనభద్ర ఎస్పీ పదవి నుండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసికి SSPగా నియమించింది.

అక్కడ కూడా కేవలం 4న్నర నెలలు మాత్రమే ఉన్నారు. అనంతరం ప్రభాకర్  మొరాదాబాద్, మీరట్, ఆగ్రా వంటి జిల్లాలలో SSPగా నియమించబడ్డారు. అయితే ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం పోలీసు ఆఫీసర్ గా విధులను నిర్వహించిన ఏకైక జిల్లా మీరట్. ఆగ్రా నుంచి సీతాపూర్ ఎస్పీగా నియమితులయ్యారు. ఈ ఏడాది మార్చి 12న సీతాపూర్‌ నుంచి బరేలీ ఎస్‌ఎస్‌పీగా బదిలీ చేశారు. అయితే నాలుగైదు నెలల తర్వాత ఆయనను ఇక్కడ నుంచి బదిలీ చేశారు. ఈ సారి బరేలీలో కన్వారియాలపై రాళ్ల దాడి, లాఠీచార్జి బదిలీకి కారణం.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే