Uttar Pradesh: పొలం అమ్మి మరీ భార్యను చదివించిన రైతు.. అకౌంటెంట్‌ అయ్యాక విడాకులు కోరుతున్న భార్య..

వాస్తవానికి ఈ వ్యవహారం బారాబంకిలోని సత్రిఖ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మొహమ్మద్‌పూర్ మజ్రే గల్‌మౌ గ్రామానికి చోటు చేసుకుంది. జైద్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యాకుత్‌గంజ్ గ్రామానికి చెందిన రామ్‌చరణ్ కుమార్తె దీపికతో అమ్రీష్ కుమార్‌కు ఫిబ్రవరి 20, 2009న వివాహం జరిగింది. వివాహం తర్వాత దీపిక గ్రాడ్యుయేషన్  భార్య ప్రోత్సాహంతో పూర్తి చేసుకుంది. భర్తకు చదువుపై ఉన్న ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని భర్త ఆమెను ఎంఏ, బీఈడీ వరకూ చదివించాడు. ఆ తర్వాత పోటీ పరీక్షల ప్రిపరేషన్‌ కోసం కోచింగ్‌లో చేరింది.

Uttar Pradesh: పొలం అమ్మి మరీ భార్యను చదివించిన రైతు.. అకౌంటెంట్‌ అయ్యాక విడాకులు కోరుతున్న భార్య..
Up Barabanki Farmer
Follow us
Surya Kala

|

Updated on: Jul 31, 2023 | 8:18 AM

ప్రతి పురుషుడు విజయం వెనుక స్త్రీ ఉంటుందని పెద్దల ఉవాచ. అయితే కాలక్రమంలో వచ్చిన మార్పుల్లో భాగంగా పురుషుడి ఆలోచనల్లో కూడా మార్పులు వచ్చాయి. పెళ్లి చేసుకుని తమ ఇంటికి వచ్చిన భార్య మనసు తెలుసుకుని ఆమె కోరికను తీర్చడానికి చాలామంది మగాళ్లు కృషి చేస్తున్నారు. అయితే తమ ఉన్నతి కోసం అహర్నిశలు కష్టపడిన భర్త పట్ల ప్రేమ, విశ్వరం కంబరిచేవారు కొందరు అయితే.. తాము ఉన్నత స్థితికి చేరుకున్న తర్వాత భర్తవద్దు అంటూ విడాకులను తీసుకోవాలని భావిస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఇప్పటికే పలు వెలుగులోకి వచ్చింది. ఉత్తర ప్రదేశ్ లో బారాబంకి జిల్లాకు చెందిన ఓ యువతి పెళ్లయ్యాక.. చదువుకుని అకౌంటెంట్‌గా మారింది. తన రైతు భర్త వేధింపులకు పాల్పడుతున్నాడని ఆరోపించింది. దీంతో పాటు భార్య కోర్టులో విడాకులను కోరుతూ కేసు వేసింది. అయితే ఈ కేసును విచారించిన ఫ్యామిలీ కోర్టు ప్రధాన న్యాయమూర్తి.. భార్య వేసిన విడాకుల దావా నిరాధారమని కొట్టివేసింది. వివరాల్లోకి వెళ్తే..

భర్త చెప్పిన ప్రకారం.. పెళ్లి అయిన తర్వాత తన భార్యకు చదువుపై ఉన్న ఆసక్తిని చూసి.. తన భార్యను ఉన్నత చదువులు చదవమని ప్రోత్సహించాడు. తన భార్య చదువుకోసం ఏకంగా తనకున్న భూమిని కూడా అమ్మేశాడు. ఉన్నత చదువులు చదివిన భార్య లేఖపాల్ మంచి ఉద్యోగాన్ని సంపాదించింది. కొద్ది రోజులకే తన భర్త వేధింపులకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ విడాకులను కోరుతూ కోర్టులో కేసు వేసింది. అయితే లేఖపాల్ డైవర్స్ ను కోర్టు తిరస్కరించింది.

వాస్తవానికి ఈ వ్యవహారం బారాబంకిలోని సత్రిఖ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మొహమ్మద్‌పూర్ మజ్రే గల్‌మౌ గ్రామానికి చోటు చేసుకుంది. జైద్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యాకుత్‌గంజ్ గ్రామానికి చెందిన రామ్‌చరణ్ కుమార్తె దీపికతో అమ్రీష్ కుమార్‌కు ఫిబ్రవరి 20, 2009న వివాహం జరిగింది. వివాహం తర్వాత దీపిక గ్రాడ్యుయేషన్  భార్య ప్రోత్సాహంతో పూర్తి చేసుకుంది. భర్తకు చదువుపై ఉన్న ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని భర్త ఆమెను ఎంఏ, బీఈడీ వరకూ చదివించాడు. ఆ తర్వాత పోటీ పరీక్షల ప్రిపరేషన్‌ కోసం కోచింగ్‌లో చేరింది. భర్త అమ్రీష్ తన భార్య దీపికను కోచింగ్‌కి తీసుకుని తీసుకొస్తూ ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకున్నాడు. అయితే అమ్రిష్ తల్లి 2011లోనే మరణించింది.

ఇవి కూడా చదవండి

భార్యకు చదువు కోసం పొలం అమ్మకం  భార్యను చదివించడానికి అమ్రీష్ఆ ర్థిక సమస్యలను కూడా ఎదుర్కోవలసి వచ్చింది.  అప్పుడు పొలం అమ్మేశాడు. 2018లో భార్య దీపిక లేఖపాల్ మంచి ఉద్యోగాన్ని సంపాదించింది. కొన్ని నెలల తర్వాత, ఆమె తన ఎనిమిదేళ్ల కుమార్తెతో తన పుట్టింటికి వెళ్లింది. అక్కడ నుంచి తన భర్తను వేధిస్తున్నాడని ఆరోపిస్తూ విడాకుల కేసు వేసింది. కుటుంబ న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి దుర్గ్ నారాయణ్ సింగ్ కేసును విచారిస్తూ భార్య దాఖలు చేసిన విడాకుల దావా నిరాధారమని కొట్టివేసింది.

తన కూతురిని కూడా కలవడానికి కూడా తన భార్య అనుమతించలేదంటూ అమ్రిష్ వాపోతున్నాడు.

అయితే ఈ విషయంలో భార్య దీపికా వెర్షన్ డిఫరెంట్ గా ఉంది. అమ్రీష్ భార్య దీపిక తనను.. భర్త అమ్రీష్, అతని కుటుంబ సభ్యులు తనను చాలా హింసించేవారని దీపిక తెలిపింది. ఓ వైపు ఇంటి పనులు చేస్తూ.. మరోవైపు ప్రైవేట్ స్కూల్స్‌లో ఉద్యోగం చేస్తూ ఇంటి ఖర్చులు చూసుకునేదానిని చెప్పింది. ఎంత చేసినా తిన్నాను తనను వారు హింసించేవారంటూ ఆరోపించింది.  అందుకనే తాను తన కూతురుని తీసుకుని పుట్టింటికి వెళ్లినట్లు పేర్కొంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..