Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crocodile Terror: విశ్వాసంలో కుక్కకు ఎవరు సాటి.. తన యజమానిని మొసలి నుంచి రక్షించిన కుక్క.. ఎక్కడంటే..

అర్థరాత్రి ఒక పెద్ద మొసలి నివాస ప్రాంతంలోకి ప్రవేశించింది. ఓం ప్రకాష్ రజక్ ఇంటి దగ్గర ఉన్న మొసలిని చూడలేదు. ఇంటి పెరట్లో ఉన్న మొసలి.. కొంచెం ఆలస్యమైతే ఇంట్లోకి ప్రవేశించి ఎవరిపైన అయినా దాడి చేసి ఉండేది. అప్పుడు ఇంట్లోని పెంపుడు కుక్క మొసలిని గమనించింది పెంపుడు కుక్క చేసిన ఈ సాహసం ఇప్పుడు ప్రస్తుతం నగరమంతా చర్చనీయాంశమైంది. కుక్క తన యజమానిని  పెను ప్రమాదం నుంచి తప్పించింది.

Crocodile Terror: విశ్వాసంలో కుక్కకు ఎవరు సాటి.. తన యజమానిని మొసలి నుంచి రక్షించిన కుక్క.. ఎక్కడంటే..
Pet Dog Caught Crocodile
Follow us
Surya Kala

|

Updated on: Jul 30, 2023 | 12:03 PM

అతి పురాతన కాలం నుంచి మూగజీవులకు మధ్య మంచి స్నేహం సంబంధాలున్నాయి. కుక్క, పిల్లి వంటి జంతువులను మచ్చిక చేసుకుని తన సహాయకారిగా చేసుకున్నారు. ముఖ్యంగా కుక్క మనిషికి అత్యంత విశ్వాసం గల జంతువు. తన యజమాని కోసం కుక్క ఎంతటి త్యాగం అయినా చేస్తుంది. కుక్క విశ్వాసానికి సంబంధించిన అనేక వార్తలను తరచుగా వింటూనే ఉన్నాం.. తాజాగా ఓ కుక్క తన యజమానిని మొసలి నుంచి ప్రాణాపాయం నుంచి కాపాడింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

మధ్యప్రదేశ్‌లోని శివపురిలో మొసలి నుండి పెంపుడు కుక్క తన యజమాని ప్రాణాలను కాపాడింది. పెంపుడు కుక్క చేసిన ఈ సాహసం ఇప్పుడు ప్రస్తుతం నగరమంతా చర్చనీయాంశమైంది. కుక్క తన యజమానిని  పెను ప్రమాదం నుంచి తప్పించింది.

నిజానికి మధ్యప్రదేశ్‌లోని శివపురిలో మొసళ్ళు రాత్రిపూట తిరగడం సర్వసాధారణమైంది. దీంతో నగర ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లో మొసళ్ల బెడద పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ ఘటన శివపురి నగరంలోని బంగంగా ప్రాంతంలో జరిగింది. అర్థరాత్రి ఒక పెద్ద మొసలి నివాస ప్రాంతంలోకి ప్రవేశించింది. ఓం ప్రకాష్ రజక్ ఇంటి దగ్గర ఉన్న మొసలిని చూడలేదు. ఇంటి పెరట్లో ఉన్న మొసలి.. కొంచెం ఆలస్యమైతే ఇంట్లోకి ప్రవేశించి ఎవరిపైన అయినా దాడి చేసి ఉండేది. అప్పుడు ఇంట్లోని పెంపుడు కుక్క మొసలిని గమనించింది. వెంటనే ఆ కుక్క అందరిని అలెర్ట్ చేయడానికి బిగ్గరగా అరవడం ప్రారంభించింది.

యజమాని తన పెంపుడు కుక్కను బిగ్గరగా అరవడం వింతగా భావించాడు. అంతేకాదు తమ కాలనీలోకి లేదా ఇంట్లోకి ఎవరో దొంగ ప్రవేశించాడని అనుకున్నాడు. దీంతో అతను కుక్క వెంట వెళ్ళాడు. ఆ కుక్క తన యజమానిని మొసలి ఉన్న ప్రదేశానికి చూడమంటూ తీసుకుని వెళ్ళింది. అక్కడ ఉన్న మొసలిని చూసి ఇంటి యజమాని ఓం ప్రకాష్ షాక్ తిన్నాడు. వెంటనే నేషనల్ పార్క్ రెస్క్యూ టీమ్‌కి సమాచారం అందించాడు.

మొసలిని తీసుకెళ్లిన రెస్క్యూ టీమ్

అయితే ఓం ప్రకాష్ ఇంటికి రెస్క్యూ టీమ్ రావడానికి కొంత సమయం పట్టింది. దీంతో ఓంప్రకాష్ తన కుటుంబ సభ్యులతో కలిసి మొసలిని పట్టుకోవడం ప్రారంభించారు. సుమారు గంటన్నరపాటు శ్రమించి తాడుతో మొసలిని పట్టుకుని, గోనె సంచిలో వేసి ఖాళీ వాటర్ ట్యాంక్‌లో మొసలిని బంధించారు.

రాత్రంతా ట్యాంక్ ముందు కూర్చున్న జనం రెస్క్యూ టీం కోసం ఎదురుచూశారు. ఉదయం నేషనల్ పార్క్ రెస్క్యూ టీమ్ రాగానే ఓంప్రకాష్ మొసలిని అటవీ అధికారులకు అప్పగించాడు. ఓంప్రకాష్‌ మాట్లాడుతూ – తన పెంపుడు కుక్క మొసలిని చూడకపోతే ఎవరికైనా హాని చేసేదని చెప్పారు. రెస్క్యూ టీం మొసలిని పట్టుకుని తమ వెంట తీసుకెళ్లింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..