Vande Bharat Express: వందేభారత్ రైళ్ల వేగం పెంచే దిశగా అడుగులు.. గంటకు 220 కి.మీ
దేశంలో వందేభారత్ రైళ్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. చాలా మంది ఈ రైళ్లపై ప్రయాణించేందుకు మొగ్గు చూపుతున్నారు. వెళ్లాలనుకునే గమ్యానికి తొందరగా చేరుకొవచ్చని వీటిపై ఆధారపడుతున్నారు. అయితే ప్రస్తుతం వందేభారత్ రైళ్లు ట్రాక్ సామర్థాన్ని బట్టి గంటకు 60 కిలో మీటర్ల నుంచి 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాయి.
దేశంలో వందేభారత్ రైళ్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. చాలా మంది ఈ రైళ్లపై ప్రయాణించేందుకు మొగ్గు చూపుతున్నారు. వెళ్లాలనుకునే గమ్యానికి తొందరగా చేరుకొవచ్చని వీటిపై ఆధారపడుతున్నారు. అయితే ప్రస్తుతం వందేభారత్ రైళ్లు ట్రాక్ సామర్థాన్ని బట్టి గంటకు 60 కిలో మీటర్ల నుంచి 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాయి. అయితే భవిష్యత్తులో మరిన్ని వందే భారత్ రెళ్లు రావడం, అలాగే ప్రయాణికులు కూడా ఎక్కువగా వీటిలో ప్రయాణించేందుకు మొగ్గు చూపడంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకోనున్నారు. నగర మధ్య ప్రయాణ దూరాన్ని తగ్గించాలనే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం చెన్నైలోని ఇంటిగ్రల్ కోట్ ఫ్యాక్టరీలో ప్లానింగ్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ వందే భారత్ రైళ్ల వేగాన్ని గంటకు 200 నుంచి 220 కిలోమీటర్లకు పెంచాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు.
ఇందుకోసం రైల్వే బోర్డుతో కూడా సంప్రదింపు చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ఈ రైళ్లలో అంత వేగాన్ని అందుకోవాలంటే అందులో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వందేభారత్ రైళ్లకు స్టెయిన్‌లెస్ స్టీల్ అనే లోహాన్ని వినియోగిస్తున్నారు. అత్యధిక వేగాన్ని అందుకోవాలంటే మాత్రం అల్యూమినియం లోహంతో వీటిని తయారుచేయాల్సి ఉంటుంది. అయితే ఇందంతా జరగడానికి ప్రోటోటైప్ రైళ్లు సిద్దం కావడానికి మరో రెండు సంవత్సరాలు సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత వాటిని ప్రయోగాత్మకంగా కొన్ని రూట్లలో నడిపించే అవకాశాలున్నాయి. అలాగే వీటికి తగ్గట్లుగానే సిగ్నలింగ్ వ్యవస్థలో కూడా సాంకేతికంగా మార్పులు రానున్నాయి. రాబోయే రోజుల్లో గంటకు 245 కిలోమీటర్ల వేగంతో రైళ్లు నడిచేలా ఈ వందేభారత్ రైళ్ల డిజైనింగ్‌లో మార్పులు చేయాలని అధికారులు భావిస్తున్నారు. అయితే పట్టాలపై మాత్రం వీటి వేగం గంటకు 220 కిలోమీటర్ల మించకుండా చేసే అవకాశం ఉందని అంటున్నారు.