Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price: ఆ దేశంలో బంగారం ధర తక్కువ.. భారతీయులకు పన్ను మినహాయింపు.. దుబాయ్‌కు బదులు క్యూలు కడుతున్న పసిడి ప్రియులు..

భారతీయులకు బంగారం స్టేటస్ సింబల్ మాత్రమే కాదు.. ఎప్పుడైనా కష్టాలు ఎదురైతే ఆదుకునే గొప్ప సాధనం. అందుకనే ఎక్కువమంది తమ కష్టార్జితాన్ని శక్తిమేరకు బంగారు ఆభరణాల కొనుగోలకు ఉపయోగిస్తారు. ఈ నేపథ్యంలో  ఎక్కడ తక్కువ ధరకు బంగారం దొరికితే అక్కడ కొనుగోలు చేయడానికి ఆసక్తిని చూస్తారు. భారతదేశం తన బంగారం అవసరాలను తీర్చుకోవడానికి 90 శాతం దిగుమతుల ద్వారా తీర్చుకుంటుంది. 2022లోనే విదేశాల నుంచి 706 టన్నుల బంగారం దిగుమతి అయింది.

Gold Price:  ఆ దేశంలో బంగారం ధర తక్కువ.. భారతీయులకు పన్ను మినహాయింపు..  దుబాయ్‌కు బదులు క్యూలు కడుతున్న పసిడి ప్రియులు..
Gold Price
Follow us
Surya Kala

| Edited By: Ravi Kiran

Updated on: Aug 01, 2023 | 1:54 PM

భారతీయులు బంగార ప్రియులు.. అయితే రోజు రోజుకీ బంగారం ధర చుక్కలను తాకుతుంది. ఈ నేపథ్యంలో బంగారం ధర ఎప్పుడు తగ్గుతుందా.. ఎప్పుడు నగలు కొనుగోలు చేద్దామని ఆసక్తిగా మహిళలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో తక్కువ ధరలో బంగారాన్ని కొనుగోలు చేయాలనుకుంటే.. భూటాన్‌కు వెళ్లండి. ప్రస్తుతం భూటాన్ లోని బంగారం ధరపై సర్వత్రా చర్చ జరుగుతోంది. అంతేకాదు బంగారం నిజంగా చౌకగా ఉందా అని అందరూ అడుగుతున్నారు. ఈ ప్రశ్న తలెత్తడానికి చాలా కారణాలు ఉన్నాయి. భారతీయులకు బంగారం స్టేటస్ సింబల్ మాత్రమే కాదు.. ఎప్పుడైనా కష్టాలు ఎదురైతే ఆదుకునే గొప్ప సాధనం. అందుకనే ఎక్కువమంది తమ కష్టార్జితాన్ని శక్తిమేరకు బంగారు ఆభరణాల కొనుగోలకు ఉపయోగిస్తారు. ఈ నేపథ్యంలో  ఎక్కడ తక్కువ ధరకు బంగారం దొరికితే అక్కడ కొనుగోలు చేయడానికి ఆసక్తిని చూస్తారు.

భారతదేశం తన బంగారం అవసరాలను తీర్చుకోవడానికి 90 శాతం దిగుమతుల ద్వారా తీర్చుకుంటుంది. 2022లోనే విదేశాల నుంచి 706 టన్నుల బంగారం దిగుమతి అయింది. బంగారం కొనుగోలు కోసం 2022లో భారత్ 36 బిలియన్ డాలర్లు వెచ్చించింది. ఈ లెక్కలు చాలు బంగారంపై భారతీయులకు ఎంత క్రేజ్ ఉందో తెలియడానికి.

భూటాన్‌లో నిజంగా చౌక బంగారం దొరుకుతుందో లేదో ఇప్పుడు తెలుసుకుందాం

భూటాన్‌లో తక్కువ ధరకే బంగారం లభిస్తుందన్న మాట పూర్తిగా నిజం. ఈ విషయం నమ్మాలంటే కొన్ని నెలలు వెనక్కి వెళ్లాల్సి ఉంది. ఫిబ్రవరి 21న పన్ను రహిత బంగారాన్ని ఇక నుంచి దేశంలో విక్రయించనున్నామని భూటాన్ ప్రకటించింది. దీంతో భారతీయులతో పాటు ఇతర దేశాల పర్యాటకులు కూడా ప్రయోజనం పొందనున్నారు. ఇంతవరకు తక్కువ ధరకే బంగారం కొనుక్కోవడానికి దుబాయ్ వెళ్లిన భారతీయులు ఇప్పుడు భూటాన్‌కు వెళ్లడానికి కారణం ఇదే.

ఇవి కూడా చదవండి

భూటాన్‌లో బంగారం ఎంత చౌకగా లభిస్తుందంటే?

ఈ దేశంలో బంగారం చౌకగా ఉండదని కారణం తెలుసుకోవాలంటే.. ముందుగా భారతీయ, భూటాన్ కరెన్సీ విలువను అర్థం చేసుకోవాలి. భారత రూపాయి..  భూటానీస్ గుల్ ట్రమ్ ఒకే విలువను కలిగి ఉన్నాయి. అంటే ఒక రూపాయి ఒక గుల్ ట్రమ్ కు సమానం. జూలై 31, 2023 నాటికి భూటాన్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.43,473.84, భారతదేశంలో రూ.60,280. అంటే భారత్‌, భూటాన్‌ దేశాల్లోని 10 గ్రాముల బంగారం ధరలో 17 వేల రూపాయల వ్యత్యాసం ఉంది.

ఎంత బంగారం కొనుగోలుకు అనుమతి ఉంది?

ఎవరైనా భూటాన్‌ను సందర్శించి.. ఆ దేశంలో బంగారం కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లయితే.. ముందుగా ఎంత బంగారం మన దేశానికి తీసుకుని రావొచ్చో తెలుసుకోవాల్సి ఉంది. భూటాన్ నుండి భారతదేశానికి బంగారం తీసుకుని రావడానికి స్త్రీ, పురుషులకు తేడా ఉంది. వాస్తవానికి, ‘సెంట్రల్ బోర్డ్ ఆఫ్ పరోక్ష పన్నులు అండ్ కస్టమ్స్’ నిబంధనల ప్రకారం భారతీయ పురుషుడు రూ. 50,000 (సుమారు 20 గ్రాములు) విలువైన బంగారాన్ని తీసుకురావచ్చు.. అదే విధంగా స్త్రీ రూ. 1 లక్ష విలువయిన అంటే (సుమారు 40 గ్రాములు) విలువైన బంగారాన్ని తీసుకురావచ్చు. నిబంధనలు మేరకు బంగారం తీసుకుని వస్తే.. ఆ బంగారానికి ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..