Maharashtra: ఆహారం రుచిగా వండలేదనీ.. తల్లిని హత్య చేసిన కొడుకు!
వంట రుచిగా లేదని తల్లిని హత్య చేశాడు ఓ కొడుకు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని థానే జిల్లా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని థానే జిల్లా ముర్బాద్ తాలూకాలోని వేలు గ్రామానికి చెందిన ఓ యువకుడు తల్లతో నిత్యం గొడవపడేవాడు. ఇంట్లోని పలు సమస్యలపై తల్లీ కుమారుల మధ్య గొడవలు జరిగేవి. ఈక్రమంలో ఆదివారం సాయంత్రం ఇంటికి వచ్చిన కుమారుడికి తల్లి ఆహారం వడ్డించింది. అది తిన్న కుమారుడు వంటలు రుచిగా లేవని తల్లితో గొడవ..

థానే, నవంబర్ 28: వంట రుచిగా లేదని తల్లిని హత్య చేశాడు ఓ కొడుకు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని థానే జిల్లా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని థానే జిల్లా ముర్బాద్ తాలూకాలోని వేలు గ్రామానికి చెందిన ఓ యువకుడు తల్లతో నిత్యం గొడవపడేవాడు. ఇంట్లోని పలు సమస్యలపై తల్లీ కుమారుల మధ్య గొడవలు జరిగేవి. ఈక్రమంలో ఆదివారం సాయంత్రం ఇంటికి వచ్చిన కుమారుడికి తల్లి ఆహారం వడ్డించింది. అది తిన్న కుమారుడు వంటలు రుచిగా లేవని తల్లితో గొడవ పడ్డాడు. కోపంతో రగిలిపోయిన కుమారుడు తల్లి మెడపై కొడవిలతో దాడి చేశాడు.
తీవ్ర రక్తస్రావంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఇరుకుపొరుగు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటన జరిగిన తర్వాత నిందితుడు నిద్రమాత్రలు అధిక మోతాదులో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో అతని సమీప బంధువులు ఆసుపత్రిలో చేర్చారు. దీంతో నిందితుడిని ఇంకా అరెస్టు చేయలేదని అధికారి తెలిపారు. నిందితుడిపై భారత శిక్షాస్మృతి సెక్షన్ 302 (హత్య) కింద సోమవారం కేసు నమోదు చేసినట్లు థానే రూరల్ పోలీస్ కంట్రోల్ రూమ్ అధికారి మంగళవారం (నవంబర్ 28) మీడియాకు తెలిపారు.
ఆటో డ్రైవర్‌పై దాడి, ఇద్దరు AIMIM మద్దతుదారులు అరెస్ట్
హైదరాబాద్‌లోని ఆటో డ్రైవర్‌పై దాడి చేసిన ఘటనలో ఇద్దరు ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) మద్దతుదారులను పోలీసులు నవంబర్ 27(సోమవారం) అరెస్టు చేశారు. పోలీసు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితుడు మహ్మద్ సలీమ్ (33) సింగరేణి కాలనీలో ఉన్న తమ ఇంటికి తిరిగి వస్తుండగా, నలుగురు వ్యక్తులు అతనిపై దాడి చేశారు. తన ఆటోపై మజ్లిస్ బచావో తెహ్రీక్ (ఎంబిటి) పార్టీ జెండా ఉంచినందుకు తనను కొట్టారని సలీమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతను తప్పించుకోవడానికి ప్రయత్నించగా హనాఫియా మసీదు వద్ద పట్టుబడ్డాడని, దాడి చేసినవారు అతనిని తీవ్రంగా కొట్టినట్లు తెలిపారు. ఈ ఘటనలో మొహమ్మద్ రిజ్వాన్ (34), మొహమ్మద్ ఖదీరుద్దీన్ (23) అనే ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మిగిలిన ఇద్దరు పరారీలో ఉన్నట్లు పోలీసు తెలిపారు. ఖదీరుద్దీన్ నుంచి పోలీసులు మోటారు బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.