Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: బ్రెయిన్ డెడ్‌తో సచివాలయం ఉద్యోగిని మృతి.. తాను చనిపోతూ నలుగురికి అవయవదానం!

శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని నానుబాలు వీధిలో గల సచివాలయంలో వీఆర్వోగా విధులు నిర్వహిస్తోన్న 23 ఏళ్ల బి మౌనిక నాలుగు రోజుల కిందట ఘోర రోడ్డు ప్రమాదానికి గురయింది. భోజన విరామ సమయంలో సచివాలయం నుంచి బయటకు వచ్చిన ఆమె శ్రీకాకుళం డే అండ్‌ నైట్ జంక్షన్ సమీపంలోని వినాయక ఆలయం వద్ద తన స్కూటిపై రోడ్డును దాటుతుoడగా అతివేగంగా వచ్చిన వేరొక బైక్ అడ్డంగా ఢీ కొట్టిoది. అంతే బైక్ వేగానికి స్కూటీపై వెళుతున్న మౌనిక ఎగిరి రోడ్డుపై పడింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా..

Andhra Pradesh: బ్రెయిన్ డెడ్‌తో సచివాలయం ఉద్యోగిని మృతి.. తాను చనిపోతూ నలుగురికి అవయవదానం!
Secretariat Employee B Mounika
Follow us
S Srinivasa Rao

| Edited By: Srilakshmi C

Updated on: Nov 27, 2023 | 6:51 AM

శ్రీకాకుళం, నవంబర్‌ 27: శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని నానుబాలు వీధిలో గల సచివాలయంలో వీఆర్వోగా విధులు నిర్వహిస్తోన్న 23 ఏళ్ల బి మౌనిక నాలుగు రోజుల కిందట ఘోర రోడ్డు ప్రమాదానికి గురయింది. భోజన విరామ సమయంలో సచివాలయం నుంచి బయటకు వచ్చిన ఆమె శ్రీకాకుళం డే అండ్‌ నైట్ జంక్షన్ సమీపంలోని వినాయక ఆలయం వద్ద తన స్కూటిపై రోడ్డును దాటుతుoడగా అతివేగంగా వచ్చిన వేరొక బైక్ అడ్డంగా ఢీ కొట్టిoది. అంతే బైక్ వేగానికి స్కూటీపై వెళుతున్న మౌనిక ఎగిరి రోడ్డుపై పడింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది మౌనిక. ఈ ప్రమాదం రోడ్డు పక్కన ఉన్న సీసీ కెమెరాలో కూడా స్పష్టంగా రికార్డ్ అయింది.

మౌనిక తలకు బలమైన గాయం అవ్వడంతో తొలిత శ్రీకాకుళం లోని రిమ్స్ ఆసుపత్రికి ఆమెను తరలించారు. అక్కడ వైద్యం చేసిన వైద్యులు పరిస్థితి విషమంగా వుందని చెప్పడంతో శ్రీకాకుళంలోని ఓ కార్పొరేట్ హాస్పిటల్ కి తరలించారు. అక్కడ వైద్యులు కూడా కండిషన్ సీరియస్ గా వుందని చెప్పడంతో విశాఖలోని మరో కార్పొరేట్ హాస్పిటల్ కి తరలించారు. వారు కూడా చేతులు ఎత్తేయడంతో చివరికి చేసేది లేక తల్లిదండ్రులు శ్రీకాకుళం జెమ్స్ ఆసుపత్రిలో అడ్మిట్ చేసారు. అయితే బ్రెయిన్ డెడ్ కావడంతో జీవచ్ఛవంలా ఉన్న మౌనిక పరిస్థితిని చూసిన వైద్యులు అవయవ దానంపై తల్లిదండ్రులను సంప్రదించగా, దానికి సమ్మతించి వారు ముందుకు వచ్చారు. ఆసుపత్రి యాజమాన్యం జీవన్ ధాన్ కి అనుమతి కోసం కోరగా వెనువెంటనే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో ఆమె అవయవాల్లో గుండె, రెండు మూత్ర పిండాలు, రెండు కళ్లు మాత్రమే అవయవ దానం కోసం పని చేస్తాయని వైద్యులు ధృవీకరించి వాటిని సేకరించారు.

గుండెను జెమ్స్ హాస్పిటల్ నుండి తిరుపతి లోని సుస్మిత అనే పేషెంట్ కోసం గ్రీన్ ఛానల్ ద్వారా తరలించారు. శ్రీకాకుళం జెమ్స్ హాస్పిటల్ నుంచి అంబులెన్స్ లో ఆగ మేఘాల మీద విశాఖ ఎయిర్పోర్ట్ కు తరలించి అక్కడ నుంచి చార్టెడ్ ఫ్లైట్లో రేణిగుంట విమానాశ్రయానికి తరలించారు. అవయవాలు తరలిస్తున్న క్రమంలో జెమ్స్ హాస్పిటల్ ప్రాంగణంలో హాస్పిటల్ సిబ్బంది, మౌనిక స్నేహితులు పూలు జల్లుతూ క్యాండిల్స్ తో జోహార్లు పలికారు. మౌనిక గుండెను తిరుపతి స్విమ్స్ ఆసుపత్రికి ఒక మూత్రపిండం వైజాగ్ కు, మరొకటి జెమ్స్ ఆసుపత్రికి, రెండు కళ్లను రెడ్ క్రాస్ వారికి అప్పజెప్పారు. మౌనిక స్వస్థలం శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల మండలం కొత్తపేట గ్రామం. పేద కుటుంబమే అయిన మౌనిక అవయవ దానానికి అంగీకరించి ముందుకు వచ్చారు ఆమె తల్లిదండ్రులు. అవయవదానం ద్వారా మౌనిక జీవించే ఉంటుందన్న నమ్మకంతో ఆర్గాన్స్ డొనేషన్ కి అంగీకరించామని మౌనిక తల్లి ఉమాదేవి తెలిపారు.మౌనిక తల్లిదండ్రులను అందరూ కొనియాడారు. ఓవైపు తమ బిడ్డ తాను చనిపోతూ నలుగురికి వెలుగుని అందిస్తుందన్న వాస్తవంతో పాటు మరో వైపు భౌతికంగా తమ మధ్య లేదని తెలిసి ఆమె తల్లిదండ్రులు కన్నీరు మున్నిరవుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.