ఒడిశా రాజకీయాల్లో కీలక పరిణామం.. నవీన్ పట్నాయక్ వారసుడిగా ఐఏఎస్ అధికారి వీకే పాండియన్
ఒడిశా రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం నవీన్ పట్నాయక్ రాజకీయ వారసుడిగా ఆయన వ్యక్తిగత కార్యదర్శి వీకే పాండ్యన్ అధికార బీజేడీ పార్టీలో చేరారు. స్వచ్ఛంద పదవీ విరమణ పొందిన మరుసటి రోజే ఈ మాజీ IAS అధికారి VK పాండియన్ నవీన్ ఆధ్వర్యంలో బీజేడీలో చేరారు. 5T ఐదు ట్రాన్స్ఫర్మేషన్ కార్యక్రమాలతో పాటు ప్రభుత్వ ఫ్లాగ్ షిప్ ప్రోగ్రామ్ నబిన్ ఒడిశాకు చైర్మన్‌గా నియమితులయ్యారు.

ఒడిశా రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం నవీన్ పట్నాయక్ రాజకీయ వారసుడిగా ఆయన వ్యక్తిగత కార్యదర్శి వీకే పాండ్యన్ అధికార బీజేడీ పార్టీలో చేరారు. స్వచ్ఛంద పదవీ విరమణ పొందిన మరుసటి రోజే ఈ మాజీ IAS అధికారి VK పాండియన్ నవీన్ ఆధ్వర్యంలో బీజేడీలో చేరారు. 5T ఐదు ట్రాన్స్ఫర్మేషన్ కార్యక్రమాలతో పాటు ప్రభుత్వ ఫ్లాగ్ షిప్ ప్రోగ్రామ్ నబిన్ ఒడిశాకు చైర్మన్‌గా నియమితులయ్యారు. ఆయనకు కేబినెట్ మంత్రి హోదా కూడా కల్పించారు. పాండియన్ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో పని చేస్తారని అని జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకునే ముందు, 2000-బ్యాచ్ కు చెందిన ఈ మాజీ ఐఎఎస్ అధికారి 5T ఇనిషియేటివ్‌ల సెక్రటరీగా ఉన్నారు. ఇంకా సిఎం కార్యాలయంలో చీఫ్ సెక్రటరీ తర్వాత బ్యూరోక్రాటిక్ హెడ్‌గా పని చేశారు.
వీకే పాండియన్ ఎవరు?
ఒడిశా కేడర్‌కు చెందిన 2000 బ్యాచ్ IAS అధికారి వీకే పాండ్యన్.. తమిళనాడుకు చెందిన పాండియన్ 2002లో కలహండి జిల్లాలోని ధర్మగర్ సబ్-కలెక్టర్‌గా నియమితులయ్యారు. రైతులకు హక్కులను అందివ్వడంలో చురుగ్గా పాలుపంచుకున్నారు. ఇంకా వరి సేకరణను క్రమబద్ధీకరించి వార్తల్లో నిలిచారు. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్స్ (పిడబ్ల్యుడి) కమిషనర్ గా పనిచేసిన సమయంలో భారత రాష్ట్రపతి నుంచి జాతీయ అవార్డును అందుకున్నారు. అప్పుడే వీ కే పాండ్యన్ అమలు చేసిన విధానాలతో పీడబ్ల్యూడీల సాధికారత కోసం సింగిల్ విండో విధానాన్ని జాతీయ మోడల్‌గా తీసుకుని దేశవ్యాప్తంగా అమలు చేశారు.
వీడియో చూడండి..
Glad to welcome Shri VK Pandian to @bjd_odisha. He has been working very hard for several years for the people of #Odisha and earned their respect & trust. I am sure Shri Pandian will continue to do so in the future as a member of the party. Wish him all the very best. pic.twitter.com/Aoj49FXyTp
— Naveen Patnaik (@Naveen_Odisha) November 27, 2023
అనేక సందర్భాల్లో, పాండియన్‌ను లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడెమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ యాజమాన్యం పిలిచి పలు కేటగిరీల అధికారులకు పలు శిక్షణా తరగతులు ఇచ్చే అవకాశం సైతం కల్పించారు. 2005లో పాండ్యన్ మయూర్‌భంజ్ జిల్లా కలెక్టర్‌గా నియమితుడయ్యారు. అక్కడ నక్సలిజం వ్యాప్తిని తగ్గించడానికి పాండ్యన్ అనుసరించిన విధానాలను పలు రాష్ట్రాల్లో అమలు చేశారు.
2007లో పాండియన్ గంజాం కలెక్టర్‌గా తనదైన ముద్ర వేశారు. అంతకుముందు ఆయన పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లో ప్రభావ వంతంగా పనిచేసినందుకు ‘హెలెన్ కెల్లర్ అవార్డు’ దక్కించుకున్నారు. దేశంలోనే ఉత్తమ జిల్లాగా రెండుసార్లు NREGS కోసం జాతీయ అవార్డును అందుకున్నారు.పాండియన్ నాయకత్వంలో ఎన్‌ఆర్‌ఇజిఎస్‌లో వేతనాల చెల్లింపు బ్యాంక్ ద్వారా చేయడం మొదట గంజాం జిల్లాలో చేపట్టారు. దీని తరువాత కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేసింది.
గంజాంలో కలెక్టర్ గా పనిచేసిన సమయంలో పాండియన్ ముఖ్యమంత్రి పట్నాయక్‌కు సన్నిహితంగా మారారని, దాని తర్వాత 2011 నుండి అతని ప్రైవేట్ సెక్రటరీగా పనిచేశారని నివేదికలు చెబుతున్నాయి. 2019లో పట్నాయక్ ఐదవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత, ప్రభుత్వ శాఖలలో కొన్ని పరివర్తన కార్యక్రమాలను అమలు చేయడానికి పాండియన్‌కు ‘5T సెక్రటరీ’ అదనపు బాధ్యతను అప్పగించారు.
రాజకీయ ప్రయోజనాల కోసం ఆయన తన పదవిని దుర్వినియోగం చేస్తున్నారని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించడంతో ఆయన తరచూ వివాదాల్లో చిక్కుకున్నారు. ఇటీవల, పాండియన్ రాష్ట్ర ఛాపర్‌ని ఉపయోగించి అనేక జిల్లాల పర్యటనకు వెళ్లడంతో ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి.
ముసుగు తీసేసారంటున్న ప్రతిపక్షాలు..
ఆయన బహిరంగంగా రాజకీయాలు చేయడం మంచిది. ప్రజాస్వామ్య వ్యవస్థలో అందరూ రాజకీయాలు చేయగలరు.. రాజకీయాల్లోకి రావడం మాకు ఏ విధంగానూ సవాలు కాదు. రాజకీయాలను చూస్తూనే ఉన్నామని.. బీజేపీ ఒడిశా రాష్ట్ర అధ్యక్షుడు సామల్ కామెంట్ చేశారు. పాండియన్ బీజేడీలో చేరడంలో కొత్తేమీ లేదని కాంగ్రెస్ సీనియర్ నేత బిజయ్ పట్నాయక్ అన్నారు.. ఈ విషయాన్ని అంతకుముందే చూశామంటూ పేర్కొన్నారు. ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ నేతల ప్రకటనలపై బీజేడీ నేత సమీర్ దాష్ స్పందిస్తూ.. పాండ్యన్ వ్యూహాలతో పార్టీ 130 సంఖ్యను సాధించి బలోపేతం కావడానికి దోహదపడతాయన్నారు. బీజేడీ వ్యవస్థీకృత పార్టీ అని ఇక్కడ అందరికీ పాండ్యన్ పై విశ్వాసం ఉందని పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




