Marriage: నవ వధువును కిడ్నాప్‌ చేసిన ఆమె తల్లిదండ్రులు.. పోలీసులకు భర్త ఫిర్యాదు

ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. నెలన్నర రోజుల క్రితం వివాహం జరిగిన నూతన వధువును ఆమె సొంత కుటుంబ సభ్యులే కిడ్నాప్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఈ విషయమై మహిళ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన అత్తమామల నుంచి తనకు, తన భార్యకు ప్రాణహాని ఉందని, తన భార్యను రక్షించవల్సిందిగా పోలీసులను కోరాడు. పోలీసులు సీసీటీవీ..

Marriage: నవ వధువును కిడ్నాప్‌ చేసిన ఆమె తల్లిదండ్రులు.. పోలీసులకు భర్త ఫిర్యాదు
Newly Married Bride Kidnapped By Her Parents
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 27, 2023 | 8:13 AM

బరేలీ, నవంబర్ 27: ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. నెలన్నర రోజుల క్రితం వివాహం జరిగిన నూతన వధువును ఆమె సొంత కుటుంబ సభ్యులే కిడ్నాప్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఈ విషయమై మహిళ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన అత్తమామల నుంచి తనకు, తన భార్యకు ప్రాణహాని ఉందని, తన భార్యను రక్షించవల్సిందిగా పోలీసులను కోరాడు. పోలీసులు సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు. అసలేం జరిగిందంటే..

ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలోని భాదోహికి చెందిన ఖుష్బూ బానో భదోహి అనే యువతి స్వచ్ఛందంగా ఇస్లాం మతాన్ని త్యజించి సనాతన ధర్మాన్ని స్వీకరించింది. అనంతరం హిందూ సంప్రదాయం ప్రకారం విశాల్‌ అనే యువకుడిని పెళ్లి చేసుకుంది. వీరి వివాహం ఆగస్ట్ నెలలో ముని ఆశ్రమంలో పండిట్ కెకె శంఖ్‌ధర్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఖుష్బూ-విశాల్‌ ఫేస్‌బుక్‌ ద్వారా స్నేహితులయ్యారు. అనంతరం వారి స్నేహం ప్రేమగా మారింది. ఈ క్రమంలో విశాల్‌ను కలిసేందుకు ఖుష్బూ అక్టోబర్ నెలలో బరేలీకి వచ్చి్ంది. అతనితో కలిసి ఆగస్ట్ నెలలో ముని ఆశ్రమానికి వెళ్లి పండిట్ కెకె శంఖ్‌ధర్ ముందు మతం మార్చుకుంది. అనంతరం వారిద్దరూ అక్కడే పెళ్లి చేసుకున్నారు.

సననత్ ధర్మాన్ని అంగీకరించిన తర్వాత ఖుష్బూ బానో తన పేరును ఖుష్బూ సక్సేనాగా మార్చుకుంది. తన మిగతా జీవితాన్ని హిందూగా జీవిస్తానని చెప్పింది. తనకు చిన్నప్పటి నుంచి హిందూ మతంపై నమ్మకం ఉందని, అయితే కొన్ని ఒత్తిళ్ల వల్ల మతం మారలేకపోయానని మత మార్పిడి సమయంలో చెప్పుకొచ్చింది. హిందూ మతాన్ని స్వీకరించిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ట్రిపుల్ తలాక్, హలాలా వంటి దురాచారాల నుంచి విముక్తి పొందానని ఖుష్బూ చెప్పింది. వారి పెళ్లి జరిగిన నెలన్నర లోపు ఆమెను ఆమె కుటుంబ సభ్యులు కిడ్నాప్‌ చేశారు. ఖుష్బూ కిడ్నాప్‌కు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. సదరు వీడియోలో ఖుష్బూ కుటుంబ సభ్యులు ఆమె ఇంట్లోకి ప్రవేశించి బలవంతంగా ఆటోలో తీసుకెళ్లడం కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

దీంతో ఆమె భర్త విశాల్ పోలీసులను ఆశ్రయించాడు. తన భార్యను ఆమె కుటుంబ సభ్యుల కిడ్నాప్‌ చేశారని, ఆమెను రక్షించి తనకు అప్పగించాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు. విశాల్ సీసీటీవీ ఫుటేజీని ఎస్పీ దేహత్‌కు అందజేసి చర్యలు తీసుకోవాలని కోరాడు. ఘటన జరిగిన సమయంలో తాను పని నిమిత్తం బయటకు వెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. అదే సమయంలో అతని తల్లిదండ్రులు కూడా ఏదో పని నిమిత్తం ఇంటి నుంచి బయటకు వెళ్లారు. సరిగ్గా ఇదే సమయంలో ఖుష్బూ తల్లిదండ్రులు ఆమెను కిడ్నాప్ చేసి తీసుకెళ్లినట్లు పోలీసులకు తెలిపాడు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.