Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heart Stroke: షాకింగ్‌ ఘటన.. ఆరేళ్ల చిన్నారి గుండెపోటుతో మృతి!

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ప్రాంతంలో నివాసం ఉంటోన్న వ్యాపారవేత్త రాహుల్ జైన్ ఏకైక కుమారుడు విహాన్ జైన్ (6 ఏళ్ల). ఇండోర్‌లోని డెయిలీ కాలేజీ స్కూల్‌లో ఒకటో తరగతి చదువుతున్న వెహాన్ జైన్ ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. గత రెండు రోజులుగా చిన్నారి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. బాలుడి శరీరం అధికంగా వేడిగా ఉండటంతో బాలుడికి జ్వరం వచ్చి ఉంటుందని కుటుంబ సభ్యులు తొలుత భావించారు. దీంతో ఇంట్లో ఉన్న థర్మామీటర్‌తో జ్వరం తనిఖీ చేశారు. అయితే బాలుడికి జ్వరం ఉన్నట్లు థర్మామీటర్‌లో టెంపరేచర్‌ చూపలేదు. శరీరం మాత్రం కాలిపోతుండటంతో..

Heart Stroke: షాకింగ్‌ ఘటన.. ఆరేళ్ల చిన్నారి గుండెపోటుతో మృతి!
Six Year Old Boy Dies Of Cardiac Arrest
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 28, 2023 | 9:19 AM

ఇండోర్, నవంబర్‌ 28: ఒకప్పుడు గుండె పోటు.. అరవై యేళ్లు, 70 యేళ్లు దాటిన వారికి మత్రమే వచ్చేవి. కానీ నేటి కాలంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ గుండెపోటు సమస్య హతలెత్తిస్తోంది. తాజాగా ఆరేళ్ల చిన్నారి గుండెపోటుతో మృతి చెందిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. దీంతో దేశ వ్యాప్తగా గుండెపోటు సమస్య మరోమారు చర్యణీయాంశమైంది.

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ప్రాంతంలో నివాసం ఉంటోన్న వ్యాపారవేత్త రాహుల్ జైన్ ఏకైక కుమారుడు విహాన్ జైన్ (6 ఏళ్ల). ఇండోర్‌లోని డెయిలీ కాలేజీ స్కూల్‌లో ఒకటో తరగతి చదువుతున్న వెహాన్ జైన్ ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. గత రెండు రోజులుగా చిన్నారి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. బాలుడి శరీరం అధికంగా వేడిగా ఉండటంతో బాలుడికి జ్వరం వచ్చి ఉంటుందని కుటుంబ సభ్యులు తొలుత భావించారు. దీంతో ఇంట్లో ఉన్న థర్మామీటర్‌తో జ్వరం తనిఖీ చేశారు. అయితే బాలుడికి జ్వరం ఉన్నట్లు థర్మామీటర్‌లో టెంపరేచర్‌ చూపలేదు. శరీరం మాత్రం కాలిపోతుండటంతో బాలుడి తల్లిదండ్రులు ఇండోర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందించిన తర్వాత చికిత్స బాలుడి పరిస్థితి మెరుగుపడింది.

ఆ తర్వాత ఏదో కార్యక్రమం నిమిత్తం కుటుంబ సభ్యులు ఢిల్లీ వెళ్లాల్సి వచ్చింది. అక్కడ చిన్నారి విహాన్ ఆరోగ్యం మరోసారి క్షీణించింది. దీంతో కుటుంబ సభ్యులు ఢిల్లీలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. చికిత్స అందిస్తుండగా శనివారం (నవంబర్‌ 27) చిన్నారి గుండె ఒక్కసారిగా ఆగిపోయింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా వైద్యులు చిన్నారిని రక్షించలేకపోయారు. బాలుడికి గుండెపోటు వచ్చినట్లు వైద్యులు తెలిపారు. చిన్నారి రక్తపరీక్షలో మయోకార్డిటిస్ అనే వైరస్ గుర్తించినట్లు వైద్యులు తెలిపారు. ఈ వైరస్ గుండెపై ప్రభావం చూపుతుందన్నారు. ఈ వైరస్ గుండె కండరాలలో వాపుకు కారణమవుతుందని, రక్తాన్ని పంప్ చేసే దాని సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుందని వైద్యులు తెలిపారు. ఆరేళ్ల చిన్నారి గుండెపోటుతో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

ఇవి కూడా చదవండి

ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఎడి భట్నాగర్ ఫ్రీ ప్రెస్‌తో మాట్లాడుతూ.. మయోకార్డిటిస్ అనేది గుండె కండరాల (మయోకార్డియం) వాపుకు సంబంధించిన వ్యాధి. మంట మయోకార్డిటిస్ ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వేగవంతమైన లేదా క్రమరహిత గుండె లయలకు (అరిథ్మియాస్) కారణమవుతుంది. వైరస్‌ వల్ల మయోకార్డిటిస్‌ సోకుతుంది. కొన్నిసార్లు మందుల రియాక్షన్‌ వల్ల కూడా మయోకార్డిటిస్‌ వస్తుంది. తీవ్రమైన మయోకార్డిటిస్ గుండెను బలహీనపరుస్తుంది, తద్వారా శరీరంలోని మిగిలిన భాగాలకు తగినంత రక్తం సరఫరా కాదు. గుండెలో గడ్డలు ఏర్పడి, స్ట్రోక్ లేదా గుండెపోటుకు దారితీస్తుంది. కొన్ని నెలల చికిత్స తర్వాత రోగి కోలుకోవడం జరుగుతుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.