AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jagdeep Dhankhar: గాంధీ మహా పురుషుడైతే.. మోదీ యుగ పురుషుడు.. ఉపరాష్ట్రపతి ధన్కర్ కీలక వ్యాఖ్యలు..

భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహత్మా గాంధీ మహా పురుషుడైతే.. ప్రధాని నరేంద్ర మోదీ యుగ పురుషుడు అంటూ అభివర్ణించారు. ముంబాయిలో జరిగిన జైన ఆధ్యాత్మిక వేత్త, తత్వవేత్త శ్రీమద్‌ రాజ్‌చంద్రాజీ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Jagdeep Dhankhar: గాంధీ మహా పురుషుడైతే.. మోదీ యుగ పురుషుడు.. ఉపరాష్ట్రపతి ధన్కర్ కీలక వ్యాఖ్యలు..
Mahatma Gandhi PM Narendra Modi
Shaik Madar Saheb
|

Updated on: Nov 28, 2023 | 9:47 AM

Share

భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహత్మా గాంధీ మహా పురుషుడైతే.. ప్రధాని నరేంద్ర మోదీ యుగ పురుషుడు అంటూ అభివర్ణించారు. ముంబాయిలో జరిగిన జైన ఆధ్యాత్మిక వేత్త, తత్వవేత్త శ్రీమద్‌ రాజ్‌చంద్రాజీ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా జగదీప్ ధన్కర్ ప్రసంగిస్తూ.. భారత జాతిపిత మహత్మా గాంధీ గత శతాబ్దంలో మహా పురుషుడు అయితే, ఈ శతాబ్దంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యుగ పురుషుడు అంటూ వ్యాఖ్యానించారు. సత్యాగ్రహం, అహింస ద్వారా మహాత్మా గాంధీ బ్రిటిష్‌ పాలకుల బానిసత్వం నుంచి విముక్తుల్ని చేశారని.. అయితే.. మనం ఏ మార్గంలో నడవాలని కోరుకుంటామో ప్రధాని నరేంద్ర మోదీ మనల్ని అదే మార్గంలోకి తీసుకెళ్లారంటూ ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ పలు విషయాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా మహాత్మాగాంధీ, నరేంద్ర మోదీ గురించి మాట్లాడారు.

వీడియో చూడండి..

‘‘మీకో విషయం చెప్పాలనుకుంటున్నాను. గత శతాబ్దపు మహా పురుషుడు మహాత్మా గాంధీ అయితే ఈ శతాబ్దపు యుగ పురుషుడు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ ఇద్దరి మధ్య ఒక సారూప్యత కనిపిస్తుంది. ఈ ఇద్దరూ శ్రీమద్‌ రాజ్‌చంద్రాజీని ఎంతో గౌరవిస్తారు.. జాతి, దేశ ఎదుగుదలను వ్యతిరేకించే శక్తులు ఏకం అవుతున్నాయి. దేశంలో ఏదైనా మంచి జరిగితే ఆ శక్తులు వ్యతిరేకంగా పయనిస్తున్నాయి. ఇలాంటిది ఇక జరగకూడదు. మన చుట్టూ ఉన్న దేశాల చరిత్ర చాలా చిన్నది. మూడు వందలో, ఐదు వందలో లేదా ఏడు వందల ఏళ్ల చరిత్ర వాళ్లది. కానీ మనది 5000 ఏళ్ల నాటి చరిత్ర’’ అంటూ ఉపరాష్ట్ర ధన్కర్ పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..