Uttarkashi Tunnel: 17వ రోజుకు ఉత్తర కాశి సొరంగం సహాయక పనులు.. ప్రత్యక్షంగా పర్యవేక్షించిన ప్రధాని సలహాదారు
ప్రధాని కార్యాలయ సలహాదారు, ప్రధాని ప్రిన్సిపల్ సెక్రటరీ PK మిశ్రా సిల్క్‌యారా ఉత్తరకాశీలోని సిల్క్‌యారా టన్నెల్‌లోకి వెళ్లారు. లోపల చిక్కుకున్న కార్మికులతో మాట్లాడారు. అలాగే వారి కుటుంబ సభ్యులతోనూ మాట్లాడారు. అక్కడ జరుగుతున్న సహాయ కార్యక్రమాలను మిశ్రా పరిశీలించారు. టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులను కాపాడడానికి అనేక పద్దతులను ఉపయోగిస్తున్నారు
ఉత్తరాఖండ్ సొరంగంలో 16 రోజులుగా చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు రెండురకాలుగా డ్రిల్లింగ్ చేస్తున్నారు. అమెరికా ఆగర్ మిషన్ పాడైపోవడంతో, మ్యాన్యువల్ డ్రిల్లింగ్ ప్రారంభించారు. అలాగే టన్నెల్ పైభాగం నుంచి వెర్టికల్ డ్రిల్లింగ్ చేపడుతున్నారు. ఆగర్ యంత్రం 46 మీటర్లు తవ్వింది. మిగిలిన మరో 14 మీటర్లను తవ్వడానికి ఢిల్లీ నుంచి 11 మంది నిపుణుల బృందం టన్నెల్‌కు చేరుకుంది. ప్రధాని కార్యాలయ సలహాదారు, ప్రధాని ప్రిన్సిపల్ సెక్రటరీ PK మిశ్రా సిల్క్‌యారా ఉత్తరకాశీలోని సిల్క్‌యారా టన్నెల్‌లోకి వెళ్లారు. లోపల చిక్కుకున్న కార్మికులతో మాట్లాడారు. అలాగే వారి కుటుంబ సభ్యులతోనూ మాట్లాడారు. అక్కడ జరుగుతున్న సహాయ కార్యక్రమాలను మిశ్రా పరిశీలించారు. టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులను కాపాడడానికి అనేక పద్దతులను ఉపయోగిస్తున్నారు. 16 రోజులుగా టన్నెల్‌లో చిక్కుకుపోవడంతో కార్మికుల మానసిక పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అమెరికా నుంచి తెప్పించిన అగర్ డ్రిల్లింగ్ మిషన్‌తో 46 మీటర్ల వరకు తవ్వారు. అయితే . అగర్ మిషన్ బ్లేడ్లు శిథిలాల్లో చిక్కుకుపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. మాన్యువల్ డ్రిల్లింగ్‌తో పాటు వర్టికల్ డ్రిల్లింగ్‌తో కార్మికులను కాపాడే ప్రయత్నాలు చేస్తున్నారు.
కార్మికులు తమ కుటుంబసభ్యులతో మాట్లాడడానికి ల్యాండ్‌లైన్ ఫోన్ సౌకర్యాన్ని కల్పించారు. సెల్‌ఫోన్లను టన్నెల్ లోకి పంపించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. టన్నెల్ దగ్గర ఉష్ణోగ్రతల పడిపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఉత్తరాఖండ్ టన్నెల్ దగ్గర సహాయక చర్యలు చురుగ్గా కొనసాగుతున్నాయి. రెండు రకాలులుగా టన్నెల్ దగ్గర డ్రిల్లింగ్ చేస్తున్నారు. ప్రధాని సలహాదారు పీకే మిశ్రా సహాయక చర్యలను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. 17వ రోజుకు రెస్క్యూ పనులు చేరుకున్నాయి.
50 మీటర్లు దాటి..
Uttarakhand tunnel rescue: Manual drilling underway, 50 metres crossed so far in total
Read @ANI | https://t.co/lxj1V81GC3#UttarakhandTunnelRescue #Uttarakhand #Uttarkashi pic.twitter.com/jrjNyUjce0
— ANI Digital (@ani_digital) November 28, 2023
చురుగ్గా సహాయక పనులు..
#WATCH | Uttarkashi (Uttarakhand) tunnel rescue | Visuals from the Silkyara tunnel where the operation to rescue 41 workers is ongoing.
Manual drilling is going on inside the rescue tunnel and auger machine is being used for pushing the pipe. As per the last update, about 2… pic.twitter.com/26hw32fChI
— ANI (@ANI) November 28, 2023
उत्तरकाशी की टनल में 17 दिनों से फंसे हमारे 41 जवानों को निकालने के लिए बचाव अभियान युद्ध स्तर पर जारी है। रेस्क्यू ऑपरेशन की पूरी टीम हर स्तर पर प्रयास कर रही है।
महादेव अपनी कृपा कीजिये जिससे मजदूर भाई जल्द से जल्द सुरक्षित बाहर आ जाएँ। #UttarakhandTunnelRescue… pic.twitter.com/eVPbgzHskf
— Ashish Kaushik.🇮🇳 (@AshishK_IND) November 28, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.