AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భర్త నల్లగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భార్య జంప్.. నెలన్నర కూతురు తల్లికోసం ఏడుపు

భర్త నచ్చలేదు సరే.. కనీసం తన ప్రేగు తెంచుకుని పుట్టిన తన నెలన్నర కుమార్తెపై కనికరం కూడా చూపలేదు ఆ స్త్రీ. తల్లి ప్రేమ కోసం ఏడుస్తున్నా సరే ఆ చిన్నారిని వదిలేసి తన జీవితాన్ని తాను ఎంచుకుంది. ఇప్పుడు ఆ మహిళ భర్త విశాల్ తనకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాడు. మరోవైపు నెలన్నర వయసున్న కూతురు తల్లి కోసం ఏడుస్తూనే ఉంది. గురువారం ఎస్పీ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం జరుగుతోంది. విశాల్ మోగియా అనే యువకుడు తన ఏడాదిన్నర కుమార్తె, తల్లిదండ్రులతో కలిసి అక్కడికి రావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

భర్త నల్లగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భార్య జంప్.. నెలన్నర కూతురు తల్లికోసం ఏడుపు
Wife Left Husband Alone
Surya Kala
|

Updated on: Jul 12, 2024 | 11:00 AM

Share

భారతీయ సాంప్రదాయంలో వివాహానికి ముఖ్య స్థానం ఉంది. పెళ్లి అనేది హృదయాల కలయిక అని.. ఇందులో రంగు, రూపు ఆస్తులు అంతస్తులు ఎంచరని చెబుతారు. అయితే కొంతమంది మాత్రం ఇందుకు మినహాయింపు.. కేవలం అందాన్ని చూసే పెళ్లి చేసుకునేవారు ఉంటే .. మరికొందరు డబ్బులు, ఆస్తులు అంతస్తులు చూసి పెళ్లి చేసుకునే వారుంటారు. ఇలాంటి వారికి తమ జీవిత భాగస్వామి ఎంత మంచివాడు అయినా ఎంత ప్రేమగా చూస్తున్నా లెక్క ఉండదు. తమ మనసుకు నచ్చిన నిర్ణయం తీసుకుని కుటుంబాన్ని వీధిన పడేస్తారు. తాజాగా ఇలాంటి ఘటనే మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో వెలుగుచూసింది. ఇక్కడ ఒక వివాహిత స్త్రీకి తన భర్త నచ్చలేదు.. నల్లగా ఉన్నాడంటూ భర్తను.. నెల చిన్నారిని విడిపెట్టింది. అంతేకాదు తన ప్రియుడితో పారిపోయింది. ఇప్పుడు ఆమె ప్రియుడితో కలిసి లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో జీవిస్తోంది.

భర్త నచ్చలేదు సరే.. కనీసం తన ప్రేగు తెంచుకుని పుట్టిన తన నెలన్నర కుమార్తెపై కనికరం కూడా చూపలేదు ఆ స్త్రీ. తల్లి ప్రేమ కోసం ఏడుస్తున్నా సరే ఆ చిన్నారిని వదిలేసి తన జీవితాన్ని తాను ఎంచుకుంది. ఇప్పుడు ఆ మహిళ భర్త విశాల్ తనకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాడు. మరోవైపు నెలన్నర వయసున్న కూతురు తల్లి కోసం ఏడుస్తూనే ఉంది. గురువారం ఎస్పీ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం జరుగుతోంది. విశాల్ మోగియా అనే యువకుడు తన ఏడాదిన్నర కుమార్తె, తల్లిదండ్రులతో కలిసి అక్కడికి రావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. గ్వాలియర్ఝాన్సీ రోడ్‌లోని విక్కీ ఫ్యాక్టరీ ప్రాంతంలో నివాసం ఉంటున్న 24 ఏళ్ల విశాల్ మోంగియాకు 13 నెలల క్రితం 8 ఏప్రిల్ 2023న నాకా చంద్రవద్నీలోని పార్డి మొహల్లాలో నివాసం ఉండే రాఖీతో వివాహం జరిగింది

విశాల్ కన్నీరు పెడుతూ మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీకి జరిగిన కథంతా చెప్పాడు. ఏడాది క్రితమే తనకు ఓ అమ్మాయితో వివాహమైందని చెప్పాడు. పెద్దలు కుదిర్చిన పెళ్లి అని.. ఇరు కుటుంబాలు అంగీకారంతోనే తమ వివాహం జరిగిందని.. అయితే పెళ్ళైనప్పటి నుంచి తనతో ఎప్పుడూ భార్య నేరుగా మాట్లాడలేదని వెల్లడించాడు. అంతేకాదు తాను నల్లగా ఉన్నానంటూ ఎప్పుడూ ఏదోకటి అంటూ వెక్కిరిస్తూనే ఉంది. అయినా తన కుటుంబం కోసం భార్యలో ఎప్పటికైనా మార్పు వస్తుందని ఆశాభావంతో ఆమె ఎన్ని అన్నా కూడా పట్టించుకోకుండా ఉన్నట్లు తెలిపాడు. తమకు నెలన్నర క్రితం ఓ అందమైన కూతురు జన్మించిందని పోలీసులకు చెప్పాడు విశాల్.

ఇవి కూడా చదవండి

‘చచ్చిపోతానని బెదిరించేది’

బాధిత భర్త మాట్లాడుతూ 10 రోజుల క్రితం తన భార్య హఠాత్తుగా అదృశ్యమైంది. ఆమె కోసం ఎంత వెతికినా దొరకలేదు. చివరకు తన భార్య తన ప్రేమికుడితో కలిసి పారిపోయిందని తేలింది. ఇప్పుడు అతనితో లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో జీవిస్తోందని చెప్పాడు. అతను ఇంకా మాట్లాడుతూ.. తన భార్య తన కుటుంబ సభ్యులను కూడా వేధించేదని.. అంతేకాదు ఆమె తల్లిదండ్రులతో కూడా గొడవపడేది. చనిపోతానని కూడా బెదిరించిందని చెప్పాడు.

అత్తగారు, మామగారు ఏం చెప్పారంటే

కోడలు కూడా చాలాసార్లు ఆత్మహత్యకు ప్రయత్నించిందని విశాల్ తండ్రి చెప్పారు. అయితే తాము కోడలని అడ్డుకున్నామని చెప్పారు. ఒకసారి ఆమె రైలు నుంచి దూకబోతుంటే ఆమెని కాపాడే ప్రయత్నంలో తాను ప్రమాదానికి గురయ్యానని వెల్లడించాడు. విశాల్ తల్లి మాట్లాడుతూ- పెళ్లయినప్పటి నుంచి మా అబ్బాయితో గొడవపడేది. మేము ఆమెకు చాలాసార్లు సర్దుకు పోవాలని చెప్పమని.. అయినా తమ కోడలు ఒప్పుకోలేదని అంది. కారణం అడిగితే మీ అబ్బాయి నల్లగా ఉన్నాడని, అతనితో కలిసి జీవించడం నాకు ఇష్టం లేదని చెప్పింది. మా మనవరాలు 10 రోజులుగా అమ్మ కోసం తహతహలాడుతోంది. అయితే ఆమె ఇంటికి తిరిగి రావడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది విశాల్ తల్లి.

డీఎస్పీ ఏం చెప్పారు?

బాధిత కుటుంబీకుల మాటలు విన్న తర్వాత డీఎస్పీ కిరణ్ మాట్లాడుతూ – మహిళా పోలీస్ స్టేషన్‌లో కుటుంబసభ్యుల దరఖాస్తు కూడా పెట్టారు. త్వరలో ఇద్దరినీ పిలిపించి కౌన్సెలింగ్ చేయనున్నామని .. ఈ విషయంపై క్షుణ్ణంగా విచారణ జరుపుతామని చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...