- Telugu News Photo Gallery Onion Health Benefts: Onion Has Many Health Benefits Its Fulfill Vitamin B12 Deficiency
B12 Deficiency: విటమిన్ బి12 లోపంతో రక్తహీనత, అలసటతో ఇబ్బంది పడుతున్నారా..! తినే ఆహారంతో ఉల్లిని చేర్చుకోండి..
ప్రస్తుత క్రమరహిత జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు అనేక రకాల వ్యాధుల బారిన పడుతున్నారు. కొంతమంది రకరకాల విటమిన్ల లోపంతో బాధపడుతున్నారు. అంతేకాదు కాదు ఎక్కువ మంది రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఐరెన్ లోపంతో పాటు, విటమిన్ B-12 లోపం రక్తహీనతకు కారణాలలో ఒకటి. ఈ నేపధ్యంలో విటమిన్-బి12 లోపాన్ని పూరించడానికి ఉల్లిపాయ మంచి మెడిసిన్. రోజువారీ తినే ఆహారంలో ఉల్లిపాయలను చేర్చుకోవడం వల్ల విటమిన్ బి12 లోపాన్ని చాలా వరకు భర్తీ చేసుకోవచ్చు.
Updated on: Jul 12, 2024 | 10:28 AM

విటమిన్-బి12 ఎర్రరక్తకణాలు, కణాల జన్యు పదార్ధం తయారు చేయడానికి సహాయపడుతుంది. అదనంగా ఈ విటమిన్ ఎముకలు, కండరాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. కనుక శరీరానికి అవసరమైన పోషకాలలో విటమిన్ బి12 ఒకటి

విటమిన్-బి12 లోపం వల్ల రక్తహీనత, ఎముకలు, కండరాలు బలహీనపడడం వంటి రకరకాల వ్యాధులు వస్తాయి. అందువల్ల ఈ విటమిన్ లోపాన్ని భర్తీ చేయడానికి తినే ఆహారంలో జాగ్రత్త తీసుకోవాలి. విటమిన్-బి 12 అధికంగా ఉండే ఆహారం చేర్చుకోవాలి.

ఉల్లిపాయల్లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ నుంచి కణాలను రక్షిస్తాయి. అంతే కాదు ఇందులో ఫోలేట్, విటమిన్-బి6, విటమిన్-బి2 వంటి అనేక పోషకాలు ఉన్నాయి

ఉల్లిపాయ జీవక్రియను కూడా మెరుగుపరుస్తుంది. అదనంగా ఇందులో సోడియం, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ఇనుము, భాస్వరం వంటి వివిధ ఖనిజాలు ఉన్నాయి. కనుక మీ శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ ఉల్లిపాయలను తినండి

నిపుణుల అభిప్రాయం ప్రకారం రోజూ తినే ఆహారంలో కనీసం 1 ఉల్లిపాయను చేర్చుకోండి. అప్పుడు శరీరంలో విటమిన్ బి12 లోపాన్ని తీర్చడం సాధ్యమవుతుంది. ఫలితంగా అలసట తగ్గుతుంది

యాంటీ-ఆక్సిడెంట్లు, వివిధ ఖనిజాలతో సమృద్ధిగా ఉన్న ఉల్లిపాయలు వేసవిలో డీహైడ్రేషన్, హీట్ స్ట్రోక్ నుండి కూడా రక్షిస్తాయి. అంతేకాదు ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. అనేక వ్యాధులను నివారిస్తుంది. వండిన ఉల్లిపాయల కంటే పచ్చి ఉల్లి తినడం వల్ల మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు




