Delhi: తిహార్ జైలులో కవితను కలవనున్న కేటీఆర్.. వీరికి మాత్రమే కోర్టు అనుమతి..
సీబీఐ కస్టడీలో ఉన్న కవితను ఆదివారం సాయంత్రం ఆమె సోదరుడు కేటీఆర్ కలవనున్నారు. ఢిల్లీ మద్యం పాలసీ స్కామ్ కేసులో సీబీఐ కస్టడీలో ఉన్నారు కవిత. ఆమెను ప్రతి రోజూ సాయంత్రం గంట పాటు కుటుంబ సభ్యులతోపాటు న్యాయవాదిని కలిసేందుకు అనుమతి ఇచ్చింది కోర్టు. ఈ నేపథ్యంలోనే ఆదివారం సాయంత్రం గం. 6.00 నుంచి గం. 7.00 మధ్యలో కేటీఆర్ కలవడానికి అనుమతి లభించింది. కుటుంబ సభ్యుల్లో భర్త అనిల్, సోదరుడు కేటీఆర్‌తో పాటు పీఏ శరత్, న్యాయవాది మోహిత్‌కు మాత్రమే కలిసేందుకు అనుమతి ఇచ్చింది కోర్టు.
సీబీఐ కస్టడీలో ఉన్న కవితను ఆదివారం సాయంత్రం ఆమె సోదరుడు కేటీఆర్ కలవనున్నారు. ఢిల్లీ మద్యం పాలసీ స్కామ్ కేసులో సీబీఐ కస్టడీలో ఉన్నారు కవిత. ఆమెను ప్రతి రోజూ సాయంత్రం గంట పాటు కుటుంబ సభ్యులతోపాటు న్యాయవాదిని కలిసేందుకు అనుమతి ఇచ్చింది కోర్టు. ఈ నేపథ్యంలోనే ఆదివారం సాయంత్రం గం. 6.00 నుంచి గం. 7.00 మధ్యలో కేటీఆర్ కలవడానికి అనుమతి లభించింది. కుటుంబ సభ్యుల్లో భర్త అనిల్, సోదరుడు కేటీఆర్‌తో పాటు పీఏ శరత్, న్యాయవాది మోహిత్‌కు మాత్రమే కలిసేందుకు అనుమతి ఇచ్చింది కోర్టు. ఈ క్రమంలో శనివారం కవితను ఆమె భర్త అనిల్‌తోపాటు లాయర్లు శరత్, మోహిత్ రావు కలిసి మాట్లాడారు. గతంలో ఈడీ కవితను అరెస్ట్ చేసి ఢిల్లీ తిహార్ జైలుకు పంపించింది. ఆ తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో సీబీఐ కూడా విచారణ చేపట్టేందుకు కోర్టును అనుమతి కోరింది. ఈ తరుణంలోనే కవితను అరెస్ట్ చేసి విచారించేందుకు సిద్దమైంది సీబీఐ.
గతంలో కోర్టు మూడు రోజులు విచారించవచ్చని సీబీఐకి ఇచ్చిన ఆదేశాల ప్రకారం రేపటితో కవిత సీబీఐ కస్టడీ ముగియనుంది. సోమవారం ఉదయం 10 గంటలకు కవితను ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టుకు హాజరుపర్చనన్నారు సీబీఐ అధికారులు. గతంలో ఇచ్చిన మూడు రోజుల కస్టడీ కాకుండా మరిన్ని రోజులు ఆమెను విచారించేందుకు కస్టడీ పొడిగించాలని లేదా జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపాలని న్యాయమూర్తిని సీబీఐ అధికారులు కోరనున్నట్లు సమాచారం. మద్యం పాలసీ కేసులో మార్చి 15న ఈడీ అధికారులు హైదరాబాద్‌లో కవితను అరెస్ట్ చేశారు. ఆమె కస్టడీని ఇప్పటికే మూడు సార్లు పొడిగించింది కోర్టు. కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై ఈనెల 16వ తేదీన విచారణ జరగనుంది. ఈ క్రమంలో కవితను సీబీఐ అరెస్ట్ చేయడం మూడు రోజులు విచారణకు కోరడం సంచలనంగా మారింది. ఒకవైపు ఈడీ, మరోవైపు సీబీఐ ఇద్దరు కవిత కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఈ పరిణామాల క్రమంలో ఆమె బయటకు రావాలంటే ఈడీ కేసులోనే కాదు సీబీఐ కేసులోనూ బెయిల్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఢిల్లీ లిక్కర్ కేసు..కవితను గట్టిగానే పట్టుకున్నట్టు కనిపిస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..