Dog Bites: రెచ్చిపోతున్న వీధికుక్కలు.. నాలుగేళ్ల బాలికపై దాడి, స్పాట్ లోనే..!
దేశంలో రోజురోజుకూ వీధికుక్కల దాడులు పెరిగిపోతున్నాయి తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. ప్రతినిత్యం ఏదో ఒక చోట కుక్క కాటు కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా వీధికుక్కల దాడిలో నాలుగేళ్ల బాలిక మృతి చెందిన ఘటన శనివారం చోటు చేసుకుంది. యూపీలోని కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని అమేథీ మాత ఆలయం సమీపంలో ఈ ఘటన జరిగింది.
దేశంలో రోజురోజుకూ వీధికుక్కల దాడులు పెరిగిపోతున్నాయి తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. ప్రతినిత్యం ఏదో ఒక చోట కుక్క కాటు కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా వీధికుక్కల దాడిలో నాలుగేళ్ల బాలిక మృతి చెందిన ఘటన శనివారం చోటు చేసుకుంది. యూపీలోని కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని అమేథీ మాత ఆలయం సమీపంలో ఈ ఘటన జరిగింది. అందుకు సంబంధించిన వివరాలను తెలియజేశారు ఎస్హెచ్ఓ వేదప్రకాశ్ శర్మ.
ఎస్ హెచ్ వో తెలిపిన వివరాల ప్రకారం.. శంకర్ అనే వ్యక్తి గత కొన్ని నెలలుగా ఆలయం సమీపంలో ఓ తాత్కాలిక గుడిసెలో కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. శనివారం ఉదయం శంకర్, ఇతర కుటుంబ సభ్యులు భిక్షాటన చేయడానికి లేదా పని కోసం బయటకు వెళ్లినప్పుడు పిల్లలు ఇంట్లో ఒంటరిగా ఉంటారు. అయితే ఇంటి బయట ఉన్న కుమార్తెపై వీధి కుక్కలు దాడి చేశాయి. అయితే సమీప కాలనీవాసులు కుక్కలను తరిమికొట్టే సమయానికి బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ మేరకు పోలీసులు తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. వలస కుటుంబానికి చెందిన బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు పోలీస్ అధికారులు.
కాగా గత మంగళవారం ఘజియాబాద్ పరిసరాల్లో 15 ఏళ్ల అల్తాఫ్ పై కుక్కలు దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ ప్రాంతానికి చెందిన కుక్క అల్తాఫ్ ఒక్కసారిగా దాడి చేయడంతో ఏం చేయాలో అర్ధంకాక కిందపడిపోయాడు. అయినా దాడి చేశాయి. అయితే వెంటనే పక్కింటి వ్యక్తి కుక్కపై నీళ్లు చల్లడంతో వెంటనే తేరుకొని ఇంట్లోకి పరుగెత్తాడు. అందుకు సంబంధించిన ఘటన వైరల్ గా మారిన విషయం తెలిసిందే. అయితే ఎండల కారణంగానో, సరైన్ పుడ్ లేకపోవడం వల్లనో కానీ వీధి కుక్కల దాడి రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. కాబట్టి జనాలు అప్రమత్తంగా ఉండాల్సి అవసరం ఎంతైనా ఉంది.