Viral: కలలో దేవత కనిపించందని ఆ మహిళ ఏం చేసిందో తెలిస్తే మైండ్ బ్లాంక్.!
కలలో ఒక దేవత కనపడి నరబలి కోరిందంటూ హర్యానాలోని అంబాలాలో ఓ మహిళ.. ఒక వ్యక్తిని మర్డర్ చేసింది. మృతుడు మహేశ్ గుప్తా మృతదేహం.. నిందితురాలి ఇంట్లో గుర్తించారు పోలీసులు. ఇందులో ప్రియ అనే ప్రధాన నిందితురాలిని..
కలలో ఒక దేవత కనపడి నరబలి కోరిందంటూ హర్యానాలోని అంబాలాలో ఓ మహిళ.. ఒక వ్యక్తిని మర్డర్ చేసింది. మృతుడు మహేశ్ గుప్తా మృతదేహం.. నిందితురాలి ఇంట్లో గుర్తించారు పోలీసులు. ఇందులో ప్రియ అనే ప్రధాన నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చనిపోయిన వ్యక్తి ఓ షాపు ఉంది. అందులో ప్రియ కొంతకాలం వర్క్ చేసింది. నరబలిలో భాగంగానే ఈ హత్యను చేశానని విచారణలో ఆమె తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు. ఆమెకు సాయం చేసిన బంధువులు హేమంత్, ప్రీతిలనూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గడిచిన కొద్ది రోజులుగా ఒక దేవత తనకు కలలో కనపడి, నరబలి కోరుతున్నట్లు ప్రియ చెప్పినట్లు తెలిపారు. బుధవారం మహేశ్.. కొన్ని సామాన్లు ఇచ్చేందుకు ప్రియ ఇంటికి వెళ్లాడని చెప్పారు. ఆ తర్వాత అతడు తిరిగి రాలేదని వెల్లడించారు. అతడి కోసం గాలించిన కుటుంబ సభ్యులు.. పోలీసులకు కంప్లైంట్ చేశారు.
మహేశ్ బైక్ ప్రియ ఇంటి వద్ద కనిపించడంతో మృతుడి బంధువులు అక్కడికి వెళ్లారు. తలుపు కొట్టినప్పటికీ రెస్పాన్స్ లేకపోవడంతో.. తలుపులు బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించారు. ఆ సమయంలో ప్రియ, ప్రీతి, హేమంత్‌లు.. అచేతన స్థితిలో ఉన్న మహేశ్‌ను నేలమీద ఈడ్చుకెళ్లడం చూశారు. వెంటనే బాధితుడిని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే అతడు చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. పోలీసులు రంగప్రవేశం చేసి, నిందితులను అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు.