AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Iran: ఇరాన్ అధీనంలో ఇజ్రాయెల్‌ కార్గో నౌక.. నౌకలో 17 మంది భారతీయులు.. అమెరికా వార్నింగ్!

ఇజ్రాయెల్‌తో ఢీ అంటే ఢీ అంటోంది ఇరాన్‌. ఇజ్రాయెల్‌ సంస్థకు చెందిన కార్గోషిప్‌ను ఇరాన్‌ కమెండోలు స్వాధీనం చేసుకోవడం కలకల రేపింది. ఈ నౌకలో 17 మంది భారతీయులు ఉన్నారు. ఇజ్రాయెల్‌పై దాడికి ఇరాన్‌ రెడీ అవుతోందని , దాడి చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ హెచ్చరించారు.

Iran: ఇరాన్ అధీనంలో ఇజ్రాయెల్‌ కార్గో నౌక..  నౌకలో 17 మంది భారతీయులు.. అమెరికా వార్నింగ్!
Iran Ship
Balaraju Goud
|

Updated on: Apr 13, 2024 | 8:17 PM

Share

ఇజ్రాయెల్‌తో ఢీ అంటే ఢీ అంటోంది ఇరాన్‌. ఇజ్రాయెల్‌ సంస్థకు చెందిన కార్గోషిప్‌ను ఇరాన్‌ కమెండోలు స్వాధీనం చేసుకోవడం కలకల రేపింది. ఈ నౌకలో 17 మంది భారతీయులు ఉన్నారు. ఇజ్రాయెల్‌పై దాడికి ఇరాన్‌ రెడీ అవుతోందని , దాడి చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ హెచ్చరించారు.

ఇజ్రాయెల్‌- ఇరాన్‌ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. రెండు దేశాల మధ్య యుద్ద మేఘాలు కమ్ముకున్నాయి. ఇదే సమయంలో ఇజ్రాయెల్ సంస్థకు చెందిన కార్గో షిష్‌ను ఇరాన్‌ స్వాధీనం చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. గల్ఫ్‌లోని జియోనిస్ట్ పాలనకు సంబంధించిన కంటైనర్ షిప్‌ను రివల్యూషనరీ గార్డ్స్ స్వాధీనం చేసుకున్నట్లు ఇరాన్‌ మీడియా ప్రకటించింది. ఎంసీఎస్‌ ఏరీస్ పేరున్న కంటైనర్ షిప్‌ను ఇరాన్‌ నేవీ స్పెషల్ ఫోర్సెస్ అయిన సెపా గార్డ్స్ హెలికాప్టర్‌ ఆపరేషన్ ద్వారా స్వాధీనం చేసుకుంది. ఈ నౌకలో 17 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. వారి విడుదల కోసం ఇరాన్ అధికారులతో భారత్‌ సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.

యూఏఈ తీరంలోని హార్ముజ్ జలసంధి సమీపం నుంచి ఈ కార్గో షిప్‌ను ఇరాన్‌ జలాల వైపు మళ్లిస్తున్నట్లు వెల్లడించింది. ఇరాన్‌ కమాండోలు హెలికాప్టర్‌ నుంచి రోప్‌ ద్వారా కంటైనర్ షిప్‌పైకి దిగిన వీడియోలు బయటకు వచ్చాయి. ఇరాన్‌ తీరుపై ఇజ్రాయెల్‌ సైన్యం మండిపడింది. తమ దేశం భూభాగంపై దాడి చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. కాగా, ఇరాన్‌తో ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో జరిగిన ఈ సంఘటనపై ఇజ్రాయెల్‌ స్పందించింది. ఈ ప్రాంతంలో పరిస్థితులను మరింత తీవ్రం చేస్తున్న ఇరాన్‌ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇజ్రాయెల్‌ ఆర్మీ హెచ్చరించింది.

కొద్దిరోజుల క్రితం సిరియాలోని ఇరాన్‌ రాయబార కార్యాలయంపై దాడిలో రివల్యూషనరీ గార్డ్‌ దళానికి చెందిన కీలక సైనికాధికారులు చనిపోయారు. దీంతో ఇజ్రాయెల్‌పై ఆగ్రహంతో రగులుతోన్న ఇరాన్‌.. ప్రతిదాడి తప్పదని హెచ్చరిస్తోంది. అలాగే తమ మధ్యలో అమెరికా తలదూర్చకూడదని కోరింది. ఇదే జరిగితే.. ఇజ్రాయెల్‌- హమాస్‌ల వరకే పరిమితమైన ప్రస్తుత యుద్ధం.. మొత్తం పశ్చిమాసియాకు విస్తరించే అవకాశం ఉందని అమెరికా ఆందోళన చెందుతోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…