Khalistan Terror Group Warns: ఇందిరా గాంధీకి పట్టిన గతే నీకు పడుతుంది.. ప్రధాని మోడీకి ఖలిస్తాన్ టెర్రర్ గ్రూప్ వార్నింగ్..

పంజాబ్‌లో ప్రధాని మోడీకి ఎదురైన నిరసనకు కారకులెవరు? దీనివెనక.. దుష్టశక్తుల పన్నాగం ఉందా? అదంతా ఉగ్రవాదులు వేసిన స్కెచ్చేనా? ఈ ఘటన వెనక.. ఆల్‌ఖైదా హస్తం ఉందా? పీఎం భద్రతా వైఫల్యం వెనక.. ఖలిస్తానీల..

Khalistan Terror Group Warns: ఇందిరా గాంధీకి పట్టిన గతే నీకు పడుతుంది.. ప్రధాని మోడీకి ఖలిస్తాన్ టెర్రర్ గ్రూప్ వార్నింగ్..
Khalistan
Follow us
Sanjay Kasula

|

Updated on: Jan 06, 2022 | 1:56 PM

Khalistan Terror Group Warns: పంజాబ్‌లో ప్రధాని మోడీకి ఎదురైన నిరసనకు కారకులెవరు? దీనివెనక.. దుష్టశక్తుల పన్నాగం ఉందా? అదంతా ఉగ్రవాదులు వేసిన స్కెచ్చేనా? ఈ ఘటన వెనక.. ఆల్‌ఖైదా హస్తం ఉందా? పీఎం భద్రతా వైఫల్యం వెనక.. ఖలిస్తానీల భారీ కుట్ర ఉందా? నిన్న పంజాబ్‌లో ప్రధాని టూర్ అర్ధంతరంగా క్యాన్సిల్ కావడంపైనా.. ఆయనకు ఎదురైన అనూహ్య నిరసన‌పైనా.. ఇప్పుడిలాంటి డౌట్లే వస్తున్నాయి. ఇప్పటికే రాజకీయ దుమారం రేపుతున్న ఈ ఘటనపై.. ఇలాంటి అనుమానాలు వస్తుండటం కలకలం రేపుతోంది. ముష్కరులు పక్కా ప్లాన్‌ ప్రకారమే ఇదంతా చేసి ఉంటారనే భావనలో దర్యాప్తు సంస్థలు ఉన్నట్టు తెలుస్తోంది.

అయితే తాజాగా ప్రధాని నరేంద్ర మోడీకి ఖలిస్తాన్ టెర్రర్ గ్రూప్ ఓపెన్ వార్నింగ్ ఇచ్చింది. నరేంద్ర మోడీని చంపుతామంటూ సంకేతాలు ఇచ్చాయి ఖలిస్తాన్ టెర్రర్ గ్రూప్. ఇందిరా గాంధీకి పట్టిన గతే నరేంద్ర మోడీకి అంటూ పేర్కొనడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇందిరాకి ఎమ్ జరిగిందో చూడు అంటూ మోడీకి వార్నింగ్ ఇచ్చాయి. నిన్న పంజాబ్‌లో జరిగిన ఘటన తమ మొదటి అడుగు అంటూ పేర్కొంది టెర్రర్ గ్రూప్.

ఇలా చేయడంద్వారా అంతర్జాతీయంగా దేశ ప్రతిష్టను దిగజార్చేందుకు కుట్ర చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. నిజంగానే ఈ కుట్ర వెనక ఆల్‌ఖైదా హస్తం ఉందా? అనే కోణంలో దర్యాప్తు మొదలైంది. నిరసన తెలిపినవారిలో.. ఉగ్రవాద సంస్థలకు చెందినవారెవరైనా ఉన్నారా? అని ఆరా తీస్తున్నాయి దర్యాప్తు సంస్థలు.

బుధవారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు పంజాబ్‌ వెళ్లిన ప్రధాని మోదీకి.. అనూహ్యరీతిలో నిరసన ఎదురుకావడం భద్రతావర్గాలను సైతం నిర్ఘాంతపోయేలా చేసింది. భటిండా ఎయిర్‌పోర్టు నుంచి ఫిరోజ్‌పూర్‌ సభకు వెళ్తుండగా.. ఫ్లై ఓవర్‌పై ఆందోళన కారులు ప్రధాని మోడీ కాన్వాయ్‌ని అడ్డుకున్నారు. దీంతో, 20 నిమిషాల పాటు అక్కడే వెయిట్‌ చేసిన ప్రధాని మోడీ.. పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకుని ఢిల్లీకి వెళ్లిపోయారు. ఈ ఘటనపై స్పందించిన ప్రధాని.. తాను ప్రాణాలతో ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాననీ.. పంజాబ్‌ సీఎంకు కృతజ్ఞతలంటూ ట్వీట్‌ చేశారు.

పంజాబ్‌లో ప్రధాని మోడీ పర్యటన రద్దు.. రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. కాంగ్రెస్‌, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఐతే ఈ ఘటనకు కారణం పంజాబ్‌ ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఆరోపిస్తోంది బీజేపీ. పక్కా ప్లాన్‌ ప్రకారమే ప్రధాని సభకు వెళ్లకుండా అడ్డుకున్నారని ఆరోపిస్తోంది. ఐతే బీజేపీకి ధీటుగా సమాధానమిచ్చింది కాంగ్రెస్‌. ప్రధాని సభకు జనాలు రాకపోవడంతోనే సభను రద్దు చేసుకున్నారని ఎదురుదాడికి దిగింది.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పంజాబ్ పర్యటనలో భద్రతా వైఫల్యంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సీరియస్సయ్యారు. భద్రతా వైఫల్యంపై పూర్తి నివేదిక అందించాలని పంజాబ్ అధికారులను ఆదేశించారు. బటిండా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నాక హెలికాఫ్టర్ ద్వారా వెళ్లేందుకు వాతావరణం అనుకూలించలేదనీ… దీంతో ప్రధాని రోడ్డు మార్గం గుండా వెళ్లేందుకు ప్రయత్నించారనీ షా చెప్పారు. అయితే, భద్రత విషయంలో రాష్ట్ర డీజీపీ పచ్చజెండా ఊపాకే.. రోడ్డు మార్గంలో ప్రధాని కాన్వాయ్‌ ప్రారంభమైందని షా చెప్పారు.

ప్రధాని పర్యటనను రాజకీయం చేయొద్దన్నారు పంజాబ్‌ సీఎం చరణ్‌జీత్‌సింగ్‌ చన్నీ. ప్రధాని అంటే తమకు గౌరవం ఉందన్నారు. ప్రధాని ఆకస్మికంగా రోడ్డుమార్గాన ప్రయాణించడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని స్పష్టం చేశారు. ప్రతీకూల వాతావరణంతో పాటు భద్రతా కారణాల దృష్ట్యా.. పర్యటనను రద్దు చేసుకోవాలని పీఎంఓకు ముందే సమాచారమిచ్చామనీ చెప్పారు.

అయితే, బీజేపీ మాత్రం ఈ విషయంపై చాలా సీరియస్‌ అవుతోంది. రాజకీయ కోణంలోనే సెక్యూరిటీ ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ.. తీవ్ర స్థాయి ఆరోపణలు చేస్తోంది. దమ్ముంటే ప్రధాని మోదీని ఎన్నికల్లో ఎదుర్కోవాలనీ.. ఇలాంటి చేష్టలతో ఆయననేమీ చేయలేరనీ… కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ స్పష్టం చేశారు.

ఇప్పటికే రాజకీయ దుమారానికి కారణమైన ఈ వ్యవహారంలో.. ఉగ్రవాదుల కుట్ర కూడా ఉందన్న అనుమానాలు.. మరింత సంచలనంగా మారాయి. దీనిపై దర్యాప్తు సంస్థలు ఏం తెలుస్తాయన్నది ఉత్కంఠ రేపుతోంది..

Telangana Bandh: 317 జీవోను పునఃసమీక్షించాలని ఈ నెల 10న తెలంగాణ బంద్‌.. పిలుపునిచ్చిన బీజేపీ

Akkineni Nagarjuna: సినిమా టిక్కెట్ల వివాదంపై హీరో నాగార్జున కీలక వ్యాఖ్యలు..