AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వావ్ అమేజింగ్.. ఆర్మీ జవాన్ల ఫీట్స్ అదుర్స్.. వీడియో చూస్తే సెల్యూట్ కొడతారంతే..!

Viral Video: ఆర్మీ అంటే ధైర్యానికి, సాహసాలకు ప్రతీక. ఆర్మీలో చేరిన వారికి ఇచ్చే శిక్షణ కఠినాతికఠినంగా ఉంటుంది. ఉదయాన్నే నిద్ర లేవడం, పరుగెత్తడం, కొండలు గుట్టలు ఎక్కడం..

Viral Video: వావ్ అమేజింగ్.. ఆర్మీ జవాన్ల ఫీట్స్ అదుర్స్.. వీడియో చూస్తే సెల్యూట్ కొడతారంతే..!
Shiva Prajapati
|

Updated on: Jan 06, 2022 | 1:26 PM

Share

Viral Video: ఆర్మీ అంటే ధైర్యానికి, సాహసాలకు ప్రతీక. ఆర్మీలో చేరిన వారికి ఇచ్చే శిక్షణ కఠినాతికఠినంగా ఉంటుంది. ఉదయాన్నే నిద్ర లేవడం, పరుగెత్తడం, కొండలు గుట్టలు ఎక్కడం, నేలపై పాకడం వంటి కార్యక్రమాలు ఉంటాయి. ఎండ, చలి, వర్షం తీవ్రతలను తట్టుకుని.. అన్ని పరిస్థితులను ఎదుర్కొనేలా ఆ శిక్షణ ఉంటుంది. అందుకే ఇండియన్ ఆర్మీకి చెందిన జవాన్లు చాలా స్ట్రాంగ్‌, ఫిట్‌గా ఉంటారు. వారు తినే ఆహారం కూడా అంతే హెల్తీగా ఉంటుంది. సాధారణంగా ఆర్మీ సిబ్బంది సాహసాలను స్వాతంత్ర్య దినోత్సవం రోజునో, గణతంత్ర దినోత్సవం రోజు, మరేదైనా ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే చూస్తాం. వాటి ఆయుద పరమైన, యుద్ధ కళా నైపుణ్యాలను ప్రదర్శిస్తుంటారు. అయితే, ఇటీవలికాలంలో ఆర్మీ జవాన్లకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియో ఆర్మీ జవాన్ల ఫిట్‌నెస్‌కు అద్దం పట్టేలా ఉంది. దాన్ని చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. వారి ఫిట్‌నెస్‌కు, సాహసాలకు, ఫీట్లకు సవాల్ కొడుతున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ వైరల్ వీడియోలో ఆర్మీ జవాన్లు అనేక విన్యాసాలు చేయడం మనం చూడొచ్చు. అది చూస్తే కచ్చితంగా ఆశ్చర్యపోతారు. తొలుత ఓ జవాన్.. ఎలాంటి పట్టు లేకుండానే కర్ర సహాయంతో తన పాదాలను బ్యాలెన్స్ చేస్తూ గాలిలో నిలబడతాడు. ఆ తరువాత మరో జవాన్.. చేసిన డిప్స్ చూస్తే వావ్ అంటారు. రెండు పాదాలను రెండు గాజు సీసాలపై ఉంచి.. బాటిల్‌పై ఒక చేతిని సపోర్ట్‌గా పెట్టి మరో చేయించి వెనక్కి మడిచాడు. అలా ఒక్క చేతితోనే బాటిల్స్‌పై డిప్స్ తీసి ఔరా అనిపించాడు. ఇలా చేయాలంటే చాలా సాధన చేయాల్సి ఉంటుంది. మరో సైనికుడు నీటితో నింపిన బకెట్స్‌పై కేవలం నీటిని టచ్ చేస్తూ దాటడం హైలెట్ అని చెప్పాలి. ఆర్మీ జవాన్ల ఫీట్స్‌కు సంబంధించిన వీడియోను ఐపీఎస్ అధికారి దీపాంశు కబ్రా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ‘‘అద్భుతమైన ఫిట్‌నెస్! శ్రమకు మించిన ప్రత్యామ్నాయం లేదు. కష్టపడే మార్గాన్ని ఎంచుకున్నవారు చరిత్ర సృష్టిస్తారు.’’ అని ఆయన క్యాప్షన్ పెట్టారు.

కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో సెన్షేన్ క్రియేట్ చేస్తుంది. నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ వీడియోను బుధవారం నాడు పోస్ట్ చేయగా.. ఒక్క రోజులోనే లక్షకు పైగా వ్యూస్ వచ్చాయి. నెటిజన్లు ఆ వీడియోకు ఫిదా అయిపోతున్నారు. సైనికుల ఫీట్స్‌కి, ఫిట్‌నెస్‌కి ఫిదా అయిపోతున్నారు. సెల్యూట్ చేస్తున్నారు.

Also read:

ICC Women World Cup 2022: ప్రపంచ కప్‌ జట్టులో ఆ కీలక ప్లేయర్లకు హ్యాండిచ్చిన సెలక్టర్లు.. కారణం ఏంటంటే?

First Sunrise of 2022: అంతరిక్షంలో సూర్యోదయం.. వావ్ అంటోన్న నెటిజన్లు.. మీరూ ఓ లెక్కేయండి..!

Touching Video: చిరకాల స్నేహితుడికి.. నెమలి తుది వీడ్కోలు.. హార్ట్ టచింగ్ వీడియో వైరల్

పీఎం మోడీకి భద్రత కల్పించకపోవడంపై మండిపడిన కంగనా.. ఇది ప్రజాస్వామ్యంపై దాడి అంటూ విమర్శలు