- Telugu News Photo Gallery Science photos Sleeping Tips Why you should sleep on your side according to sleep experts
Good Heart: మీ ‘గుండె’ పదికాలాల పాటు పదిలంగా ఉండాలంటే ఈ భంగిమలో నిద్రపోండి..!
Good Heart: మనిషి ఆరోగ్యానికి, నిద్రకు చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయి. సరిగా నిద్రపోతే ఆరోగ్యం కూడా పదిలంగా ఉంటుంది. అయితే, నిద్రించే భంగిమ కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందట. ఈ విషయాన్ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. స్లీప్ స్పెషలిస్ట్ అలెగ్జాండర్ బ్లౌ చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి.
Updated on: Jan 06, 2022 | 1:26 PM

మనిషి ఆరోగ్యానికి, నిద్రకు ప్రత్యక్ష సంబంధం ఉంది. అయితే, నిద్రపోయే విధానం, భంగిమ కూడా శరీరంపై, వ్యక్తి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందట. ఒక వ్యక్తి ఏ వైపున పడుకుంటాడనే అంశంపై అతని శరీరంపై ప్రభావం చూపుతుందట. బెర్లిన్‌కు చెందిన స్లీప్ స్పెషలిస్ట్ అలెగ్జాండ్.. ఈ స్లీపింగ్ భంగిమలకు సంబంధించి కీలక వివరాలు వెల్లడించారు. స్లీపింగ్ పొజిషన్.. వ్యక్తుల ఊపిరితిత్తులు, గుండె, మెదడు వంటి శరీర భాగాలపై ప్రభావం చూపుతుందట. మరి ఆరోగ్యంగా ఉండాలంటే ఏవైపునకు నిద్రపోవాలో ఇప్పుడే తెలుసుకోండి.

అలెగ్జాండర్ బ్లౌ ప్రకారం.. మీరు ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నట్లయితే, శ్వాస తీసుకోవడంలో ఏదైనా ఇబ్బంది కలిగినట్లయితే.. బోర్లా పడుకోవడం ఉత్తమం. శ్వాస సమస్య ఏర్పడినప్పుడు అలా పడుకోవడం వలన ఊపిరితిత్తులు మెరుగ్గా పని చేస్తాయట. ఇంకా తీవ్రమైన సమస్య ఉన్నట్లయితే.. వెంటనే వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది.

బ్రిటీష్ మెడికల్ జర్నల్‌లో ప్రచురించిన పరిశోధన ప్రకారం.. గర్భధారణ సమయంలో మహిళలు ఎడమ వైపునకు పడుకోవాలి. అలా పడకోవడం వలన కడుపులోని బిడ్డకు ప్రమాదం తక్కువగా ఉంటుందట. గర్భిణీ స్త్రీలు ఎప్పుడూ వెల్లకిలా నిద్రపోకూడదని వైద్యులు సలహా ఇస్తున్నారు.

మెదడు ఆరోగ్యంగా, చురుగ్గా ఉండాలంటే ఏదైనా ఒకవైపు పడుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. అలాంటి భంగిమలో పడుకోవడం వల్ల నరాల సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం తగ్గుతుందని పరిశోధనలు కూడా చెబుతున్నాయి.

బెర్లిన్‌కు చెందిన కార్డియాలజిస్ట్, ఎమర్జెన్సీ స్పెషలిస్ట్ డాక్టర్ డైట్రిచ్ ఆండ్రేసెన్ మాట్లాడుతూ.. ఒక వ్యక్తి గుండె జబ్బులతో బాధపడుతున్నట్లయితే వారు కుడి వైపునకు తిరిగి నిద్రించాలి. ఇలా చేయడం వల్ల గుండె, పొట్టపై ఒత్తిడి తగ్గుతుంది. అంతేకాకుండా, గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లెక్స్ ప్రమాదం కూడా తక్కువగా ఉంటుంది.




