- Telugu News Photo Gallery Science photos Birds Fly Why Do Birds Fly in V Shape Know the Science Behind it Here is The Details
Birds Fly: ఆకాశంలో ఎగురుతున్నప్పుడు పక్షుల గుంపు ‘V’ ఆకారంలో ఎందుకు పయనిస్తాయి?.. ఆసక్తికర విశేషాలు మీకోసం..
Birds Fly: ఆకాశంలో పక్షి గుంపులు వెళ్లడం మనం రోజూ చూస్తూనే ఉంటాం. అయితే ఈ గుంపు V ఆకారంలో కదులుతున్నట్లు కనిపిస్తుంటుంది. మరి పక్షుల గుంపు ఎందుకు అలా పయనిస్తున్నాయని ఎప్పుడైనా ఆలోచించారా? దీని గురించి ఆలోచించిన శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు చేశారు. పక్షుల గుంపు అలా ఎందుకు వెళ్తుందో కీలక వివరాలు వెల్లడించారు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకోండి.
Updated on: Jan 06, 2022 | 9:52 AM

ఆకాశంలో పక్షి గుంపులు V ఆకారంలో వెళ్లడంపై శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో ముఖ్యమైన విషయాలు తెరపైకి వచ్చాయి. పక్షులు ఎందుకు అలా ఎగురుతాయో ప్రపంచానికి వెల్లడించారు.

పక్షులు ఎగురుతున్నప్పుడు V- ఆకారంలో ఉండటానికి రెండు కారణాలు ఉన్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. మొదటి కారణం.. ఈ ఆకారంలో పక్షులు సులభంగా ఎగరగలవు. ఇతర సహచర పక్షులతో అవి ఢీకొట్టవు. రెండవది.. పక్షుల గుంపులో అందరికీ మార్గనిర్దేశం చేసే నాయకుడు ఉంటాడు. ఎగురుతున్నప్పుడు ఆ నాయకుడు ముందుంటాడు. దాని వెనుకాలే ఇతర పక్షులు ఎగురుతాయి. ఆ కారణంగానే పక్షలు ఎగురుతున్నప్పుడు V ఆకారంలో పయనిస్తాయట. చాలా మంది శాస్త్రవేత్తలు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.

లండన్ లోని రాయల్ వెటర్నరీ కాలేజీకి చెందిన ప్రొఫెసర్ జేమ్స్ అషర్‌వుడ్ ప్రకారం.. ఇలా V ఆకారంలో పయనించడం వల్ల గాలి వేగాన్ని నియంత్రిగలుగుతాయట. ఇలా ఎగరడం వల్ల వాటి శక్తిని ఆదా చేసుకుంటాయట. పుట్టుకతోనే పక్షులకు ఇలా ఎగిరే కళ లేదని పరిశోధకులు చెబుతున్నారు. కాలక్రమేణా ఇతర పక్షులతో కలిసి నివసిస్తున్న క్రమంలో అవి నేర్చుకుంటాయని చెబుతున్నారు.

V ఆకారంలో పక్షలు ఎగరాడానికి వాటిలో ఉండే పోటీ తత్వతే కారణమన్న అభిప్రాయాన్ని శాస్త్రవేత్తలు తోసిపుచ్చారు. పక్షుల మధ్య పోటీ లేదని తేల్చి చెప్పారు. పక్షులు సమానత్వాన్ని పదర్శిస్తాయట. అయితే, ఏదైనా పక్షి ముందుగా ఎగిరితే.. దానిని మిగతా పక్షులు ఫాలో అవుతాయట. ముందున్న పక్షి అలిసిపోయినప్పుడు.. దాని స్థానంలో మరొక పక్షి ముందుకు కదులుతుందట.

ముఖ్యంగా వలస పక్షలు V ఆకారంలో పయనిస్తాయట. అవి పొడవుగా వీ-షేప్‌లో ఎగురటం వలన అన్ని పక్షులకు నాయకుడిగా అవకాశం దక్కుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ముఖ్యంగా, పూర్తిగా ఆరోగ్యకరమైన పక్షులు మాత్రమే ప్రధాన స్థానంలో ముందుకు సాగుతాయని పరిశోధనలు చెబుతున్నాయి.




