AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓరి దేవుడా.. యువతి ప్రాణాలను మింగేసిన పువ్వు.. ఇంతకీ ఏంజరిగిందంటే..

సూర్య మరణించే ముందు వైద్యులు, కుటుంబసభ్యులకు ఆదివారం విమానాశ్రయానికి వచ్చే ముందు బంధువులు, స్నేహితులతో ఫోన్‌లో మాట్లాడుతున్నానని చెప్పింది. ఈ సమయంలో పొరపాటున కరివేరు పువ్వుని నమిలినట్లు.. ఈ విషయం గుర్తించిన వెంటనే.. తాను వెంటనే దానిని ఉమ్మివేసినట్లు చెప్పింది.  అయితే అప్పటికే పువ్వులోని విషం ఆ యువతి కడుపులోకి చేరింది.

ఓరి దేవుడా.. యువతి ప్రాణాలను మింగేసిన పువ్వు.. ఇంతకీ  ఏంజరిగిందంటే..
Kerala Girl Died After Chewing Arali Flower
Surya Kala
|

Updated on: May 08, 2024 | 1:43 PM

Share

స్మార్ట్ ఫోన్ ఇంటర్నెట్ ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా కొంతమంది ఫోన్‌లో మాట్లాడటం మొదలు పెడితే.. దానిలో  మునిగిపోతారు. తాము ఏమి చేస్తున్నామో గుర్తించరు. ఎదుటి వారు ఏమనుకుంటున్నారో కూడా పట్టించుకోరు. కొంతమందికి నడుస్తూ ఫోన్ మాట్లాడే అలవాటు ఉంది. అలా కొందరు ఫోన్ మాట్లాడుతూ తమకు తెలియకుండానే దూరంగా నడుచుకుంటూ వెళ్తూ… తమకు అవసరం లేని ప్రదేశానికి చేరుకుంటారు. అదే సమయంలో కొందరు వ్యక్తులు చుట్టూ ఉన్న వస్తువులను ఎంచుకొని వాటిని తాకడం..వాటితో ఆడడం, లేదా నోటిలో పెట్టుకోవడం వంటి పనులు చేస్తారు. అయితే అలా చేసే సమయంలో కూడా వారి దృష్టి అప్పటికీ  ఫోన్‌పైనే ఉంటుంది. అలా సెల్ ఫోన్ మాట్లాడుతూ యాక్సిడెంట్స్ అయిన యువతీ యువకుల గురించి వార్తలువింటునే ఉన్నాం.. అయితే తాజాగా ఓ యువతి తన కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడుతూ  దానిలో మునిగిపోయింది.. అలా తోటలో నడుచుకుంటూ వెళ్తూ కరివేరు మొక్క నుంచి పువ్వుని తెంచి దానిని నోట్లో పెట్టుకుని తినేసింది. అప్పుడు కూడా ఆ యువతి తాను చేసిన పనిని గుర్తించలేదు.. చివరికి గురించే పువ్వుని ఉమ్మేసింది. అయినప్పటికీ ఆ యువతి మర్నాడు మరణించింది. ఈ విషాద ఘటన కేరళలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం రాష్ట్రంలోని అలప్పుజా జిల్లాకు చెందిన 24 ఏళ్ల సూర్య సురేంద్రన్ కు UKలో నర్సుగా ఉద్యోగం వచ్చింది. దీంతో యూకే వెళ్లేందుకు ఆదివారం కొచ్చి విమానాశ్రయానికి చేరుకుంది. అయితే ఎయిర్‌పోర్టులో సూర్య ఒక్కసారిగా స్పృహతప్పి పడిపోయింది. వెంటనే స్పందించిన సిబ్బంది సూర్యను వెంటనే ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమె ప్రాణాలను కాపాడలేకపోయారు. సోమవారం మరణించింది. గుండెపోటు వలన యువతి మరణించిందని వైద్యులు వెల్లడించారు.

సూర్య మరణించే ముందు వైద్యులు, కుటుంబసభ్యులకు ఆదివారం విమానాశ్రయానికి వచ్చే ముందు బంధువులు, స్నేహితులతో ఫోన్‌లో మాట్లాడుతున్నానని చెప్పింది. ఈ సమయంలో పొరపాటున కరివేరు పువ్వుని నమిలినట్లు.. ఈ విషయం గుర్తించిన వెంటనే.. తాను వెంటనే దానిని ఉమ్మివేసినట్లు చెప్పింది.  అయితే అప్పటికే పువ్వులోని విషం ఆ యువతి కడుపులోకి చేరింది. పోస్ట్‌మార్టం నివేదికలో కూడా కరివేరు పువ్వు మరణానికి కారణమని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

సూర్య కడుపులో పువ్వులో భాగం కనిపించలేదని.. అయితే రక్తంలో కొన్ని విషపూరిత పదార్థాలు ఉన్నాయని వైద్యులు కుటుంబ సభ్యులకు తెలిపారు. వివరణాత్మక పోస్టుమార్టం నివేదిక ఇంకా రావాల్సి ఉంది. కరివేరు పువ్వుపై అధ్యయనం చేసిన డాక్టర్ బెనిల్ కొట్టక్కల్ మాట్లాడుతూ ఈ పువ్వులో ఆల్కలాయిడ్స్ ఉన్నాయని.. అవి మానవ హృదయాన్ని ప్రభావితం చేస్తాయని చెప్పారు.

సూర్య సురేంద్రన్ ఒక బ్రైట్ స్టూడెంట్. BSc నర్సింగ్‌లో మంచి స్కోర్ సాధించింది. ఆమె తండ్రి సురేంద్రన్ భవన నిర్మాణ కార్మికుడు. తల్లి అనిత టీ స్టాల్ నడుపుతోంది. తమ కుమార్తె అకాల మరణంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..