Unemployment: 2025 నాటికి పది లక్షల ఉద్యోగాలు వస్తాయి.. ప్రకటించిన రాష్ట్ర మంత్రి..
Unemployment: కర్ణాటక డిజిటల్ ఎకానమీ మిషన్(కేడీఈఎం) 2025 నాటికి రాష్ట్రంలో పది లక్షల ఉద్యోగాల కల్పిస్తుందని కర్ణాటక రాష్ట్ర..
Unemployment: కర్ణాటక డిజిటల్ ఎకానమీ మిషన్(కేడీఈఎం) 2025 నాటికి రాష్ట్రంలో పది లక్షల ఉద్యోగాల కల్పిస్తుందని కర్ణాటక రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఐటీ సిఎన్ అశ్వత్ నారాయణ తెలిపారు. అలాగే శాస్త్ర సాంకేతిక రంగంలో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకువస్తుందని పేర్కొన్నారు. జీఎస్‌డీపీలో డిజిటల్ ఎకనామీ పర్సంటేజీని 30 శాతానికి పెంచడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన కర్ణాటక డిజిటల్ ఎకానమీ మిషన్ కార్యాలయాన్ని మంత్రి సీఎన్ అశ్వత్ నారాయణ ప్రారంభించారు. ఇదే సమయంలో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు ఐటీ పరిశ్రమ విస్తరణకు సంబంధించిన ‘బియాండ్ బెంగళూరు’ నివేదికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి.. కేడీఈఎం పది లక్షల ఉద్యోగాలు కల్కపించడంతో పాటు.. ఐటీ ఎగుమతుల్లో 150 బిలియన్ డాలర్ల లక్ష్యాన్ని చేరడానికి ఉపకరిస్తుందన్నారు. అంతేకాదు.. 150 బిలియన్ డాలర్లు కాస్తా 2025 నాటికి 300 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
డిజిటల్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పనపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందని మంత్రి చెప్పుకొచ్చారు. అలాగే రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు కూడా కనక్టివిటీని మెరుగుపరచడం, నిరంతర విద్యుత్‌ను సరఫరా చేయడం, గ్రామీణ్ర-పట్టణ ప్రాంతాల మధ్య అంతరాన్ని తగ్గించడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు.
ఇక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడంలో కేడీఈఎం కీలక పాత్ర వహిస్తుందన్న ఆయన.. ఐటీ పరిశ్రమల అభివృద్ధి కోసం ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు. దీనిని దృష్టిలో పెట్టుకునే కేడీఈఎంలో పరిశ్రమల సంఘాలకు 51శాతం వాటాకు అవకాశం ఇచ్చామన్నారు. ప్రభుత్వం అధికారం చెలాయించడం కంటే.. సౌకర్యవంతంగా పని చేయాలని కోరుకుంటోందన్నారు. ఆ కారణంగానే కేడీఈఎంలో ప్రభుత్వం వాటాను 49 శాతానికే పరిమితం చేయడం జరిగిందన్నారు.
ఇదిలాఉండగా.. జీఎస్‌డీపీలో ఐటీ రంగం వాటా 25శాతం ఉందని, అందులోనూ 98శాతం వాటా ఒక్క బెంగళూరు సిటీదే అని రాష్ట్ర ఐటీశాఖ అదనపు చీఫ్ సెక్రెటరీ ఇ.వి రమణారెడ్డి వెల్లడించారు. అయితే, ఐటీ రంగం కేవలం బెంగళూరుకు మాత్రమే పరిమితం కాకుండా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ విస్తరింపజేయాలనే ఉద్దేశ్యంతో ‘బియాంగ్ బెంగళూరు’ ప్రాజెక్టును ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో ఏర్పాటు చేసిన కేడీఈఎం రాష్ట్రాభివృద్ధికి దోహదం చేస్తుందని పేర్కొన్నారు. కాగా, ఈ మిషన్‌లో నాస్కోమ్, అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా(అసోచామ్), ఇండియా ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీకండక్టర్ అసిసోయేషన్(ఐఇఎస్ఎ), విజన్ గ్రూప్ ఆన్ స్టార్టప్స్ సంస్థలు ఉన్నాయని, 51శాతం వాటాను అందిస్తున్నాయని తెలిపారు.
Also read:
కొత్త పార్టీ ఏర్పాటు దిశగా వైఎస్ షర్మిళ దూకుడు, ఈనెల 20న ఖమ్మం జిల్లా అభిమానులతో ఆత్మీయ సమ్మేళనం
Mahesh Namrata :16 ఏళ్ల మన ప్రేమకు శుభాకాంక్షలు మై లవ్ అంటూ భార్యకు గ్రీటింగ్ చెప్పిన మహేష్