Rajya Sabha: ది మేజర్ పోర్ట్ అథారిటీస్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం.. ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి మాండవీయ
The Major Port Authorities Bill: రాజ్యసభలో ‘ది మేజర్ పోర్ట్ అథారిటీస్ బిల్లు-2020’కి ఆమోద ముద్ర పడింది. దేశంలోని ప్రధాన ఓడరేవులకు ఎక్కువ స్వయం ప్రతిపత్తినిచ్చే మేజర్ పోర్ట్ అథారిటీస్ బిల్లుకు ఇప్పటికే లోక్‌సభలో ఆమోదించగా..
The Major Port Authorities Bill: రాజ్యసభలో ‘ది మేజర్ పోర్ట్ అథారిటీస్ బిల్లు-2020’కి ఆమోద ముద్ర పడింది. దేశంలోని ప్రధాన ఓడరేవులకు ఎక్కువ స్వయం ప్రతిపత్తినిచ్చే మేజర్ పోర్ట్ అథారిటీస్ బిల్లుకు ఇప్పటికే లోక్‌సభలో ఆమోదించగా.. బుధవారం రాజ్యసభ కూడా ఆమోద ముద్ర వేసింది. కాగా, ఈ ఉదయం సభలో ప్రశ్నోత్తరాల సమయం ముగియగానే రాజ్యసభ మాజీ సభ్యుడు మహేంద్ర బహదూర్ మృతికి సభ్యులు నివాళులర్పించారు. అనంతరం ఓడ రేవులు, షిప్పింగ్ శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ.. ది మేజర్ పోర్ట్ అథారిటీస్ బిల్లు-2020ని సభలో ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో 84 మంది సభ్యులు ఈ బిల్లుకు మద్దతునివ్వగా.. 44 మంది దీనికి వ్యతిరేకంగా ఓటు వేశారు.
దేశంలోని ప్రధాన ఓడరేవుల నియంత్రణ, ఆపరేషన్, ప్రణాళిక కోసం స్వయం ప్రతిపత్తి కల్పించేందుకు ఈ బిల్లును కేంద్రప్రభుత్వం తీసుకువచ్చినట్లు మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ఓడరేవులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలు కల్పించేందుకు ఈ బిల్లు ఉపయోగపడుతుందని వెల్లడించారు. ఈ బిల్లుకు సభ ఆమోదం తెలిపిన అనంతరం రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ 2021-2022 బడ్జెట్‌పై సాధారణ చర్చను ప్రారంభించారు.
Also Read: