తుక్కుగా మారనున్న ఐ ఎన్ ఎస్ విరాట్ యుధ్ధ నౌక, అభ్యంతరం చెప్పిన సుప్రీంకోర్టు

ఒకప్పుడు దేశానికే గర్వకారణమైన ఐ ఎన్ ఎస్ విరాట్ యుధ్ధ నౌకను క్రమంగా నాశనం చేసి తుక్కుగా మార్చాలన్న ప్రయత్నాలకు సుప్రీంకోర్టు అభ్యంతరం చెప్పింది.

తుక్కుగా మారనున్న ఐ ఎన్ ఎస్ విరాట్ యుధ్ధ నౌక, అభ్యంతరం చెప్పిన సుప్రీంకోర్టు
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Feb 10, 2021 | 2:26 PM

ఒకప్పుడు దేశానికే గర్వకారణమైన ఐ ఎన్ ఎస్ విరాట్ యుధ్ధ నౌకను క్రమంగా నాశనం చేసి తుక్కుగా మార్చాలన్న ప్రయత్నాలకు సుప్రీంకోర్టు అభ్యంతరం చెప్పింది. ప్రస్తుతం వీటిని చేపట్టరాదని ఆదేశించింది.  ఈ నౌకను స్క్రాప్ గా మార్చేందుకు యత్నిస్తున్న కంపెనీకి కోర్టు నోటీసును కూడా జారీ చేసింది. బ్రహ్మాండమైన ఈ షిప్ ను 100 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసి దీన్ని మెరైన్ మ్యూజియంగా మారుస్తామని, అందువల్ల దీన్ని నాశనం చేయకుండా చూడాలని కోరుతూ  ఓ కంపెనీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఇప్పటికే విరాట్ నౌకలో చాలాభాగాన్ని డిస్ మాంటిల్ చేశారు. నౌక ముందు భాగంలోని మెటల్ భాగాలను  ధ్వంసం చేశారు.

గుజరాత్ కు చెందిన శ్రీరామ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ సంస్థ దీన్ని తుక్కుగా మార్చేందుకు అనుమతించాలని కోరగా గత ఏడాది డిసెంబరులో రక్షణ మంత్రిత్వ శాఖ లాంఛనంగా తిరస్కరించింది. కానీ  ఈ వార్ షిప్ ను మ్యూజియంగా మారుస్తామని ఎన్విటెక్ మెరైన్ కన్సల్టెంట్స్ కంపెనీ కోరుతోంది. ఈ మేరకు ఈ సంస్థ కోర్టులో పిటిషన్ వేసినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఈ నౌక గోవా సముద్ర తీరంలో ఉంది.

1986 లో బ్రిటన్ నుంచి విరాట్ నౌకను ప్రభుత్వం సేకరించింది. సీహరియర్ విమానాలను సైతం ఈ షిప్ నుంచి ప్రయోగించ వచ్ఛు. 2017 లో దీని వాడకాన్ని నిలిపివేశారు.

Read More:Odisha Rice Mill Owner : టీచర్ జాబ్ ని వదిలి వ్యాపారంగలోకి అడుగు.. సరికొత్త ఆలోచనతో.. వరిపొట్టు బిజినెస్ తో లక్షల్లో ఆదాయం

Read More:అలసి..సొలసి..సింఘు బోర్డర్లో..వయసు మళ్ళిన రైతులకోసం మాసేజ్ సెంటర్, యువ అన్నదాతల సేవానిరతి