Odisha Rice Mill Owner : టీచర్ జాబ్ ని వదిలి వ్యాపారంగలోకి అడుగు.. సరికొత్త ఆలోచనతో.. వరిపొట్టు బిజినెస్ తో లక్షల్లో ఆదాయం

: కొంతమంది దొరికినదానితో తృప్తి పడతారు.. మరికొందరు ఎంత ఉన్నా సరిపోలేదంటూ నిత్య అసంతృప్తవాదులుగా నిరాశతో బతికేస్తారు.. ఇంకొందరు.. తాము బతుకుతూ.. నలుగురికి బతికేందుకు దారిచూపాలి అనుకుంటారు.. అటువంటి వారు సరికొత్తగా ఆలోచిస్తూ.. తాను ఆర్ధికంగా ఎదగడమే కాదు..

Odisha Rice Mill Owner : టీచర్ జాబ్ ని వదిలి వ్యాపారంగలోకి అడుగు.. సరికొత్త ఆలోచనతో.. వరిపొట్టు బిజినెస్ తో లక్షల్లో ఆదాయం
Follow us
Surya Kala

|

Updated on: Feb 10, 2021 | 2:25 PM

Odisha Rice Mill Owner : కొంతమంది దొరికినదానితో తృప్తి పడతారు.. మరికొందరు ఎంత ఉన్నా సరిపోలేదంటూ నిత్య అసంతృప్తవాదులుగా నిరాశతో బతికేస్తారు.. ఇంకొందరు.. తాము బతుకుతూ.. నలుగురికి బతికేందుకు దారిచూపాలి అనుకుంటారు.. అటువంటి వారు సరికొత్తగా ఆలోచిస్తూ.. తాను ఆర్ధికంగా ఎదగడమే కాదు.. పదిమందికి జీవనోపాధిని కలిగిస్తారు. డబ్బు సంపాదించడానికి చాలా అప్షన్లున్నాయి. ఉద్యోగం , వ్యాపారం, ఇన్వెస్ట్ చేయడం ఇలా రకరకాలుగా డబ్బులను సంపాదిస్తూ వెనకేస్తుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న ఓ వ్యక్తి మాత్రం సరికొత్తగా అలోచించి పనికిరాదు అన్న వస్తువుతో లక్షల్లో డబ్బులు ఆర్జిస్తున్నాడు. ఆ కొత్త ఆవిష్కరణ ఏమిటో తెలుసుకుందాం..!

ఒడిశా లోని కలహంది కి చెందిన బిభు సాహు అనే ఒక వ్యక్తి టీచర్ గా ఉద్యోగం చేస్తూ ఉండేవారు. అయితే ఆ జాబ్ కి 2007లో గుడ్ బై చెప్పేశారు. అనంతరం వ్యాపార రంగంలోకి అడుగు పెట్టారు. రైస్ మిల్లు బిసినెస్ లోకి వచ్చారు. రైస్ మిల్లు వ్యాపారంతో ఏటా దాదాపు 3 టన్నుల పొట్టు వచ్చేది. ఒకప్పుడు ఈ పొట్టుతో హోటల్స్ లో పొయ్యలు.. ఇటుకలను మండించడానికి ఉపయోగించేవారు.. అయితే ఇప్పుడు సరికొత్త టెక్నాలజీ వచ్చిన తర్వాత ఈ బియ్యం పొట్టుకు విలువలేకుండా పోయింది. దీంతో బిభు సాహుకి ఆ పొట్టుని ఏం చేయాలో ఆయనకు అర్థం కాలేదు. దాన్ని ఊరి బయట కాల్చేసేవారు. దీంతో వాతావారణ కాల్యుష్యం పెరిగేది. అదీ కాకుండా చుట్టుపక్కల చాలా మంది వచ్చి ఫిర్యాదు చేసేవారు దీంతో దీన్ని ఏమైనా చేయాలని ఆలోచించారు. దీంతో ఒక వేర్‌హౌస్‌లో ఈ పొట్టును పెట్టేవారు. కానీ అది కూడా ఫుల్ అయిపోయేది. దీంతో సాహు రీసెర్చ్ చేశాడు.

వరి పొట్టును స్టీల్ పరిశ్రమలో థర్మల్ ఇన్సులేటర్‌గా వాడొచ్చనే ఐడియాకు వచ్చారు. అయితే దీన్ని ఎలా అమలు చేయాలో అర్థం కాలేదు. దీంతో సాహు నిపుణులను కలిశాడు. వారు కూడా సరైన పరిష్కారం చూపించలేకపోయారు. దీంతో బిభు సాహు తన ఆలోచనలకూ పదును పెట్టాడు. ఇంతలో అతని స్నేహితుడు ఒకరు కొంత సమయం కావాలని అడిగి ఊరెళ్లి నలుగురు వ్యక్తులను తీసుకువచ్చాడు. వీరందరూ కలిసి పని చేశారు. చివరకు సాధించారు.

వరి పొట్టును చిన్న చిన్న గుండ్ల లేదా గుళికలుగా తయారు చేశారు. దీంతో సాహు విదేశాల్లోని కంపెనీలను కలిశాడు. వాటికి ఇమెయిల్ పంపాడు. 2019లో తొలి లోడ్‌ను సౌదీ అరేబియాకు పంపాడు. ఆ ఏడాది 100 టన్నుల గుళికల ద్వారా ఏకంగా రూ.20 లక్షలు సంపాదించాడు. వరి పొట్టు గుళికల ప్రపంచవ్యాప్తంగా ఉక్కు కంపెనీలకు ఎగుమతి చేయడం ప్రారంభించాడు మరియు ఇప్పుడు దాని నుండి లక్షలు సంపాదిస్తున్నాడు. వరి పొట్టును బంగారంగా మార్చుకున్నాడు. చాలా మందికి ఉపాధి కూడా కల్పిస్తున్నాడు. హరిప్రియా అగ్రో ఇండస్ట్రీస్ నడుపుతున్న భీభు సాహు ఒడిశా లో సక్సెస్ ఫుల్ బిజినెస్ మెన్ గా ఖ్యాతి గాంచాడు.

Also Read:

కలిసోచ్చిన సోషల్ మీడియా వైరల్.. డబ్బే డబ్బు.. ఇంట్లో చేసిన వంటకాలతో వ్యాపారం చేస్తున్న గృహిణీ..

చావు దారిదాపుల్లోకి వెళ్లొచ్చాడు.. 70 అడుగుల ఎత్తు నుంచి పడి ప్రాణాలతో తిరిగొచ్చాడు..

ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..