హైదరాబాద్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో సోనూసూద్ సందడి.. చెప్పకుండానే అభిమాని ఇంటికి వచ్చిన రియల్ హీరో..!

Sonu Sood Surprises Food Stall Owner: లాక్‏డౌన్ సమయంలో కష్టాల్లో ఉన్నవారికి సహయం చేసిన రియల్ హీరో సోనూసూద్‎ కృష్ణావతారం ఎత్తాడు.

హైదరాబాద్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో సోనూసూద్ సందడి.. చెప్పకుండానే అభిమాని ఇంటికి వచ్చిన రియల్ హీరో..!
Follow us
Ravi Kiran

|

Updated on: Dec 25, 2020 | 10:08 PM

Sonu Sood Surprises Food Stall Owner: లాక్‏డౌన్ సమయంలో కష్టాల్లో ఉన్నవారికి సహయం చేసిన రియల్ హీరో సోనూసూద్‎ కృష్ణావతారం ఎత్తాడు. తన నిరుపేద అభిమాని కోసం షూటింగ్‌లన్నీ పక్కనపెట్టి తరలివెళ్లాడు. హైదరాబాద్‌లో తన అభిమాని నడుపుతున్న ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌కి వెళ్లి అతడికి సూపర్ సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. వివరాల్లోకి వెళ్తే..

హైదరాబాద్‌కు చెందిన అనిల్ బేగంపేటలో ‘లక్ష్మి సోనూసూద్’ పేరుతో ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌ను నడుపుతున్నాడు. అతడికి సోనూసూద్ అంటే ఎంతో అభిమానం. ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చినప్పుడు ఓసారి తన ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌కు రావాలని ట్విట్టర్‌ ద్వారా రియల్ హీరోకు ఆహ్వానం పంపాడు. అంతే ఇంకేముంది అభిమాని అంత ప్రేమగా పిలవడంతో షూటింగ్‌లన్నీ పక్కనపెట్టి క్రిస్మస్‌ ఈవ్‌నింగ్‌లో సదరు అభిమానికి సూపర్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు.

దేవుడైనా భక్తుడు అడిగిన వరాన్ని తీర్చడంలో కాస్త లేటు చేస్తాడేమో గానీ.. తాను మాత్రం అభిమాని కోరికను తీర్చడంలో లేటు ఉండదని సోనూసూద్ మరోసారి నిరూపించాడు. షూటింగ్‌ కోసం హైదరాబాద్‌కు వచ్చిన సోనూ.. అనిల్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌ను సందర్శించి.. ఫ్రైడ్‌ రైస్‌ టేస్ట్‌ చేశాడు. కాగా, సోనూసూద్‌ లాంటి స్టార్‌ హీరో తన చిన్న ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌కు వస్తాడని కలలో కూడా ఊహించలేదంటూ ఆ అభిమాని తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.

Also Read:

Bigg Boss 4: మెహబూబ్ సైగలపై స్పందించిన అభిజిత్.. ‘స్టార్ మా’ తేల్చాలంటూ ఆసక్తికర కామెంట్స్.!

కేంద్రం కీలక నిర్ణయం.. జనవరి 1 నుంచి అన్ని వాహనాలకూ ఫాస్టాగ్ తప్పనిసరి.!

ఏపీ మందుబాబులకు గుడ్ న్యూస్.. మద్యం దుకాణాలు, బార్లపై నిషేధం లేదంటూ..!

షాకింగ్ న్యూస్: కరోనా లక్షణాలు లేవని ఆఫీస్‌కు వచ్చిన ఉద్యోగి.. ఏడుగురు మృతి, 300 మంది క్వారంటైన్.!