Viral Video: చావు దారిదాపుల్లోకి వెళ్లొచ్చాడు.. 70 అడుగుల ఎత్తు నుంచి పడి ప్రాణాలతో తిరిగొచ్చాడు..
Driver Lucky Alive: భూమి మీద నూకలు ఉంటే.. ఏం జరిగినా బ్రతుకుతాడు. ఇందుకు నిదర్శనమే తాజా ఘటన. 70 అడుగుల ఎత్తు నుంచి ఓ ట్రక్...
Driver Lucky Alive: భూమి మీద నూకలు ఉంటే.. ఏం జరిగినా బ్రతుకుతాడు. ఇందుకు నిదర్శనమే తాజా ఘటన. 70 అడుగుల ఎత్తు నుంచి ఓ ట్రక్ కింద పడితే నుజ్జునుజ్జు కావడం ఖాయం. అంతేకాకుండా అందులో ఉన్న మనుషుల ప్రాణాలు సైతం గాల్లోనే కలిసిపోతాయి. అయితే రీసెంట్‌గా అమెరికాలో జరిగిన ఇలాంటి ఘటనలో మాత్రం డ్రైవర్ బతికి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ యాక్సిడెంట్ గత శనివారం అమెరికాలోని విస్కాన్సిస్‌లో చోటు చేసుకుంది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే..
ఫ్లైఓవర్‌పై ట్రక్‌ను మలుపు తిప్పబోయి డ్రైవర్ అదుపు తప్పాడు. దీనితో ఆ ట్రక్ సరాసరి ఫ్లైఓవర్ గోడను ఢీకొట్టి ఇంటర్‌చేంజ్ హైవేపై కూలిపోయింది. అంత పై నుంచి పడటంతో ట్రక్ తుక్కుతుక్కు అయిపోయింది. ఈ ప్రమాదాన్ని కళ్లారా చూసిన ప్రజలు డ్రైవర్ చనిపోయి ఉంటాడని భావించారు.
అయితే అదృష్టవశాత్తు అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ప్రమాదానికి సంబంధించి దృశ్యాలన్నీ కూడా సీసీ కెమెరాలకు చిక్కడంతో అది కాస్తా నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా, ఆ తర్వాత డ్రైవర్ ఈ ప్రమాదం సంభవించడానికి గల కారణాలను వివరించాడు. తాను ట్రక్‌ను సరిగ్గానే నడిపానని.. ఫ్లైఓవర్ రోడ్డుపై అధిక శాతంలో మంచు ఉండటం వల్ల వాహనం అదుపు తప్పి కింద పడిపోయిందని తెలిపాడు.
West Allis, Wis. — A driver is lucky to be alive after he skidded off an interchange ramp and plunged 70 feet to the highway below. The crash happened Saturday morning on I-94 at the Zoo Interchange. It was captured on Wisconsin Department of Transportation camera video. pic.twitter.com/CjsuKWyNDU
— Mr. Wolf (@mole_cola) February 8, 2021