12 ఏళ్ల బుడతడు.. స్టాక్ మార్కెట్‌లో ఏకంగా రూ. 16 లక్షలు ఇన్వెస్ట్ చేశాడు.. ఆ తర్వాత ఏమైందంటే.!

Stoke Markets: Scam 1992 వెబ్ సిరీస్ చూశాడో.. లేక హర్షద్ మెహతాను ఆదర్శంగా తీసుకున్నాడో తెలియదు గానీ.. షేర్ మార్కెట్‌లో ఓ 12 ఏళ్ల బుడతడు..

12 ఏళ్ల బుడతడు.. స్టాక్ మార్కెట్‌లో ఏకంగా రూ. 16 లక్షలు ఇన్వెస్ట్ చేశాడు.. ఆ తర్వాత ఏమైందంటే.!
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 10, 2021 | 7:20 PM

Stock Markets: Scam 1992 వెబ్ సిరీస్ చూశాడో.. లేక హర్షద్ మెహతాను ఆదర్శంగా తీసుకున్నాడో తెలియదు గానీ.. షేర్ మార్కెట్‌లో ఓ 12 ఏళ్ల బుడతడు రూ. 16 లక్షలు పెట్టుబడి పెట్టాడు. ఇంకేముంది అదృష్టం తలుపు తట్టి ఏకంగా 43 శాతం ప్రాఫిట్స్ సంపాదించాడు. వివరాల్లోకి వెళ్తే..

షేర్ మార్కెట్‌లోని హెచ్చుతగ్గులు కొందరిని గందరగోళంలో పడేస్తాయి. కానీ దక్షిణ కొరియాకు చెందిన క్వాన్ జూన్ అనే 12 ఏళ్ల బుడతడుని మాత్రం కాదు. అతడు షేర్ మార్కెట్ అంచనాలు ఖచ్చితమైనవి. అందుకే 43 శాతం ప్రాఫిట్స్ సంపాదించాడు. గత సంవత్సరం క్వాన్ జూన్ తన తల్లి అడుగులు జాడల్లో నడుస్తూ సొంతంగా ట్రేడింగ్ అకౌంట్‌ను తీసుకున్నాడు. తల్లిదండ్రుల నుంచి రూ. 16 లక్షలు అడిగి తీసుకుని వాటిని మూలధనంగా పెట్టుకుని స్టాక్ మార్కెట్‌లో అడుగులు వేశాడు. ఇంకేముందు సరిగ్గా ఒక సంవత్సరం గడిచేసరికి 43 శాతం ప్రాఫిట్స్ వచ్చి పడ్డాయని అక్కడి మీడియా వెల్లడించింది. కాగా, క్వాన్ జూన్‌కు వారెన్ బఫెట్ కావాలని కల. క్యాపిటల్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసేవారు వారెన్ బఫెట్‌ను ఆదర్శంగా తీసుకుంటారు.

క్వాన్ జూన్ సాధించిన కంపెనీల షేర్స్ ఇవే..

ప్రపంచంలోనే లీడింగ్ సంస్థలైన కోకాకోలా, శాంసంగ్, హ్యుండాయ్ షేర్‌లను క్వాన్ జూన్ పొందగలిగాడు. ఈ బుడతడు దీర్ఘకాలిక పెట్టుబడులపై ఫోకస్ చేయగా.. దక్షిణ కొరియాలో చాలామంది పిల్లలు లాక్ డౌన్ వేళ స్టాక్ మార్కెట్‌లోకి ఇన్వెస్ట్ చేయడం ఎక్కువగా పెరిగిందని తెలుస్తోంది.

Also Read:

ఫస్ట్ నైట్ రోజు భార్యను పట్టించుకోకుండా.. కంప్యూటర్‌తో.. నెట్టింట్లో రచ్చ.. రచ్చ..

Viral Video: చావు దారిదాపుల్లోకి వెళ్లొచ్చాడు.. 70 అడుగుల ఎత్తు నుంచి పడి ప్రాణాలతో తిరిగొచ్చాడు..

తనకున్న వ్యాధిపై క్లారిటీ ఇచ్చి ఎమోషనల్ అయిన కాజల్.. షాక్‌లో ఫ్యాన్స్.!