Kajal Agarwal: తనకున్న వ్యాధిపై క్లారిటీ ఇచ్చి ఎమోషనల్ అయిన కాజల్.. షాక్‌లో ఫ్యాన్స్.!
Kajal Agarwal: టాలీవుడ్ ఇండస్ట్రీలో కాజల్ అగర్వాల్‌కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందం, అభినయంతో...
Kajal Agarwal: టాలీవుడ్ ఇండస్ట్రీలో కాజల్ అగర్వాల్‌కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందం, అభినయంతో ఈ భామ ఎంతోమంది ప్రేక్షకుల మన్ననలు పొందింది. అంతేకాకుండా గత కొన్నేళ్ళుగా తెలుగు చిత్రసీమలో అగ్రనటిగా వెలుగొందింది. ఇదిలా ఉంటే కాజల్ అగర్వాల్ సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్‌గా ఉంటుంది. ఈ క్రమంలోనే కాజల్ తనకున్న వ్యాధి గురించి తాజాగా బహిర్గతం చేయడంతో అభిమానులు ఒకింత షాక్‌కు గురయ్యారు.
ఐదేళ్ల వయస్సు నుంచి తాను బ్రాంకియల్ ఆస్తమా వ్యాధితో బాధపడుతున్నట్లు కాజల్ అగర్వాల్ వెల్లడించింది. దాని వల్ల ఆహారం విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నానని చెప్పుకొచ్చింది. శీతాకాలం వస్తే చాలు.. ఆ వ్యాధి మరింత ఎక్కువైయ్యేదని.. దాని వల్ల చాలా ఇబ్బందులు పడ్డాడని కాజల్ తెలిపింది.
బ్రాంకియల్ ఆస్తమా నుంచి బయటపడేందుకు ఇన్‌హేలర్ వాడినట్లుగా కాజల్ తెలిపింది. అది వాడటం వల్ల కాస్త రిలీఫ్ దక్కిందని పేర్కొంది. ఇప్పటికీ కూడా తన వెంట ఇన్‌హేలర్ ఉంటుందని స్పష్టం చేసింది. కాగా, మన దగ్గర చాలామంది ఇన్‌హేలర్ వాడేందుకు సిగ్గుపడుతుంటారని..ఎవరో ఏదో అంటారని అనుకోకుండా ఇన్‌హేలర్‌లు ఉపయోగించండి అంటూ ట్విట్టర్ వేదికగా కాజల్ అగర్వాల్ పోస్టు పెట్టింది.
బ్రాంకియల్ ఆస్తమా అంటే ఏంటి.? లక్షణాలు.? ఉపశమనం ఎలా?
బ్రాంకియల్ ఆస్తమాను శ్వాసకోస ఉబ్బసం అని పిలుస్తుంటారు. ఈ వ్యాధి ఉన్నవారికి ఛాతీ బరువెక్కడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురుకావడం వంటి లక్షణాలు ఉంటాయి. ఎయిర్ పోల్యుషన్, స్మోకింగ్, డస్ట్, వాతావరణ మార్పుల వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది. కాగా, ఈ వ్యాధికి ఎలాంటి మందు లేదు. అస్తమా పేషెంట్స్ ఇన్‌హేలర్స్ వాడటం ద్వారా దీని నుంచి ఉపశమనం పొందుతారు.
Also Read:
12 ఏళ్ల బుడతడు.. స్టాక్ మార్కెట్‌లో ఏకంగా రూ. 16 లక్షలు ఇన్వెస్ట్ చేశాడు.. ఆ తర్వాత ఏమైందంటే.!
ఫస్ట్ నైట్ రోజు భార్యను పట్టించుకోకుండా.. కంప్యూటర్‌తో.. నెట్టింట్లో రచ్చ.. రచ్చ..
View this post on Instagram