పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా రానున్న అక్కినేని హీరో.. టాలెంటెడ్ డైరెక్టర్‌కు ఓకే చెప్పిన చైతూ..
అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల డైరెక్షన్లో లవ్ స్టోరీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో నాగచైతన్యకు జోడీగా ఫిదా ఫేం సాయి పల్లవి నటిస్తుంది.
Akkineni Nagachaitanya Upcoming Movie Update: అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల డైరెక్షన్లో లవ్ స్టోరీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో నాగచైతన్యకు జోడీగా ఫిదా ఫేం సాయి పల్లవి నటిస్తుంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ చివరిదశకు చేరుకుంది. ఏప్రిల్ 16న ఈ మూవీ థియేటర్లలోకి రానున్నట్లు ఇప్పటికే చిత్రయూనిట్ ప్రకటింది. తాజాగా నాగచైతన్య మరో ప్రాజెక్టుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
‘పెళ్ళి చూపులు’ ఫేం డైరెక్టర్ తరుణ్ భాస్కర్‌తో నాగచైతన్య ఓ సినిమా చేయనున్నట్లుగా సమాచారం. ఈ మేరకు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఓ కథను చైతూకి వినిపించడట. కథ నచ్చడంతో చైతూ కూడా ఓకే చెప్పినట్లుగా సమాచారం. ఇందులో నాగచైతన్య పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడట. ఇప్పటివరకు చైతూ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. ప్రస్తుతం నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. తరుణ్ భాస్కర్ దర్శకుడిగా సినిమాలు చేస్తూ.. మరోవైపు నటుడిగానూ అలరిస్తున్నాడు.
Also Read:
హిట్ ఇచ్చిన డైరెక్టర్‌కే విజయ్ మళ్లీ ఛాన్స్ ఇవ్వనున్నాడా ? మళ్లీ ‘మాస్టర్’ కాంబో రిపీట్..