హిట్ ఇచ్చిన డైరెక్టర్‏కే విజయ్ మళ్లీ ఛాన్స్ ఇవ్వనున్నాడా ? మళ్లీ ‘మాస్టర్’ కాంబో రిపీట్..

లాక్‏డౌన్ తర్వాత విడుదలైన 'మాస్టర్' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్‏ను సొంతం చేసుకున్నాడు తమిళ స్టార్ హీరో విజయ్. లోకేష్ కనగరాజ్ దర్వకత్వం

హిట్ ఇచ్చిన డైరెక్టర్‏కే విజయ్ మళ్లీ ఛాన్స్ ఇవ్వనున్నాడా ? మళ్లీ 'మాస్టర్' కాంబో రిపీట్..
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 09, 2021 | 8:04 AM

లాక్‏డౌన్ తర్వాత విడుదలైన ‘మాస్టర్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్‏ను సొంతం చేసుకున్నాడు తమిళ స్టార్ హీరో విజయ్. లోకేష్ కనగరాజ్ దర్వకత్వం వహించిన ఈ సినిమా కలెక్షన్ల పరంగా బాక్సాఫీసు దగ్గర దూసుకుపోతుంది. తాజాగా వీరిద్దరి కాంబోలో మరో ప్రాజెక్ట్ రాబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. అలాగే ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్నట్లుగా తెలుస్తోంది.

మాస్టర్ సినిమా కంటే ముందు లోకేష్ కనగరాజన్ తెరకెక్కించిన ‘ఖైదీ’, ‘మానగరం’ వంటి సినిమా మంచి టాక్ తెచ్చుకున్నాయి. తమిళ సినిమా ఇండస్ట్రీలో లోకేష్ కనగరాజ్ టేకింగ్ విభిన్నంగా ఉంటుంది. అద్బుతమైన స్క్రీన్ ప్లేతో ఆసక్తికరంగా ఉంటుంది. ఈ కారణంతోనే మైత్రి మూవీ మేకర్స్ కోలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు.. అక్కడ కూడా విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబోలో సినిమా తీయనున్నట్లుగా సమాచారం. ఇందుకు సంబంధించిన వార్తలపై ఇప్పటి వరకు అటు దర్శకుడు గానీ.. విజయ్ గానీ ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు.

Also Read:

డిజిటల్ మీడియాలోకి మరో స్టార్ కమెడియన్.. వెబ్ సిరీస్‏లో లీడ్ రోల్ చేయనున్న హస్యనటుడు ?