చనిపోయిన వ్యక్తి తిరిగి బతికాడు, అమెరికాలో జరిగిన అద్భుతం

చచ్చి బతకడమన్నది ఎలా ఉంటుందో మైఖేల్ నాపిన్క్సిని అడిగితే మాబాగా చెబుతాడు.. ఎందుకంటే అది ఆయనకు అనుభవపూర్వకం కాబట్టి…! ఆయనకు ఎదురైన అనుభవం ఎట్టిదనిన…. అమెరికాకు చెందిన సదరు మైఖేల్‌ నాపిన్క్సికి కాలినడకన దేశం చుట్టిరావడం అలవాటు. 45 ఏళ్ల వయసున్న ఆయన తన స్నేహితుడితో కలిసి అమెరికాలోని మౌంట్‌ రైనర్‌ నేషనల్‌ పార్క్‌లోని మంచుకొండపై పర్యటనకు వెళ్లాడు.. ఇద్దరూ చెరో దిక్కుకు వెళ్లారు.. కాసేపు తిరిగిన తర్వాత ఓ చోట కలుసుకుందామని చెప్పుకున్నారిద్దరు.. కానీ నాపిన్క్సి […]

చనిపోయిన వ్యక్తి తిరిగి బతికాడు, అమెరికాలో జరిగిన అద్భుతం
Follow us

|

Updated on: Nov 17, 2020 | 5:47 PM

చచ్చి బతకడమన్నది ఎలా ఉంటుందో మైఖేల్ నాపిన్క్సిని అడిగితే మాబాగా చెబుతాడు.. ఎందుకంటే అది ఆయనకు అనుభవపూర్వకం కాబట్టి…! ఆయనకు ఎదురైన అనుభవం ఎట్టిదనిన…. అమెరికాకు చెందిన సదరు మైఖేల్‌ నాపిన్క్సికి కాలినడకన దేశం చుట్టిరావడం అలవాటు. 45 ఏళ్ల వయసున్న ఆయన తన స్నేహితుడితో కలిసి అమెరికాలోని మౌంట్‌ రైనర్‌ నేషనల్‌ పార్క్‌లోని మంచుకొండపై పర్యటనకు వెళ్లాడు.. ఇద్దరూ చెరో దిక్కుకు వెళ్లారు.. కాసేపు తిరిగిన తర్వాత ఓ చోట కలుసుకుందామని చెప్పుకున్నారిద్దరు.. కానీ నాపిన్క్సి ఓ చోట మంచులో కూరుకుపోయాడు.. రక్షించడానికి చుట్టూ ఎవరూ ఉండరు కాబట్టి ఆయన ఎంత అరచినా ప్రయోజనం లేకపోయింది.. టైముకు వస్తానన్న నాపిన్క్సి రాకపోయేసరికి ఫ్రెండ్‌కు కంగారుపుట్టింది.. వెంటనే సహాయక బృందానికి సమాచారం ఇచ్చాడు.. అమెరికా కాబట్టి రెస్క్యూ టీమ్‌ వెంటనే వచ్చేసింది.. హెలికాఫ్టర్‌ వేసుకుని వెతకడం మొదలుపెట్టింది.. కాసేపటికి నాపిన్క్సి ఉన్న ప్లేస్‌ను కనిపెట్టి.. అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించింది.. అప్పటికే అతడి గుండె కొట్టుకోవడం ఆగిపోయింది.. ఆశ్చర్యంగా పల్స్‌ మాత్రం ఉన్నాయి.. వెంటనే డాక్టర్లు సీపీఆర్‌ చేశారు.. అంటే శరీరం నుంచి రక్తాన్ని గుండెకు పంప్‌ చేయడమన్నమాట! అలా 45 నిమిషాలు చికిత్స అందించిన తర్వాత అతడి గుండె తిరిగి కొట్టుకోవడం ప్రారంభించింది..ఇప్పుడతను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాడు..