జగన్ హామీలన్నీ నీటి మూటలు.. తిరుపతి ఎన్నికతో టర్న్ అవ్వాలి.. వీడియో కాన్ఫరెన్సులో చంద్రబాబు కామెంట్లు

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు విపక్ష నేత చంద్రబాబు. అమరావతి రాజధాని, పోలవరం నిర్మాణం, ప్రత్యేక హోదా అంశాల ఆధారంగా ముఖ్యమంత్రిపై పలు ఆరోపణలు చేశారు చంద్రబాబు.

  • Rajesh Sharma
  • Publish Date - 5:42 pm, Tue, 17 November 20
జగన్ హామీలన్నీ నీటి మూటలు.. తిరుపతి ఎన్నికతో టర్న్ అవ్వాలి.. వీడియో కాన్ఫరెన్సులో చంద్రబాబు కామెంట్లు

Chandrababu criticizes Jaganmohan Reddy: తిరుపతి లోక్ సభ స్థానానికి జరిగే ఉప ఎన్నికతో ఏపీలో రాజకీయాల్లో మార్పు మొదలవ్వాలన్నారు విపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. తిరుపతి ఉప ఎన్నికను పార్టీ వర్గాలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని టీడీపీ శ్రేణులకు, నేతలకు ఆయన పిలుపునిచ్చారు. మంగళవారంనాడు చంద్రబాబు టీడీపీ నేతలనుద్దేశించి వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రసంగించారు. 175 నియోజకవర్గాలకు చెందిన టీడీపీ ఇంఛార్జీలు, ప్రజాప్రతినిధులు ఈ వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్నారు.

‘‘ తిరుపతి పార్లమెంటు ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి.. జగన్మోహన్ రెడ్డి పతనం తిరుపతి నుంచే ప్రారంభం కావాలి.. వైసీపీ ప్రజా వ్యతిరేక చర్యలకు బాధిత ప్రజలే గుణపాఠం చెప్పాలి.. ముస్లింలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలపై దాడులకు అడ్డుకట్ట వేసేందుకు తిరుపతి నుంచే నాంది పలకాలి.. వైసీపీ అరాచకాలకు గుణపాఠం చెప్పే వేదిక ఈ ఉప ఎన్నిక.. టీడీపీ గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలి.. ’’ అని పార్టీ వర్గాల్లో ఉత్సాహం నింపారు చంద్రబాబు.

అధికారంలోకి వచ్చినప్పట్నించి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. అమరావతిలో పనులుల ఆపేయడం, పోలవరాన్ని నిర్లక్ష్యం చేయడం, ప్రత్యేక హోదా ఊసెత్తకపోవడం వంటివి జగన్ ఏపీకి చేసిన ద్రోహాలని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

‘‘ జగన్ హామీలన్నీ నీటి మూటలుగా తేలిపోయింది.. పోలవరం కింద పునరావాసానికి ఒక్కో కుటుంబానికి రూ10 లక్షలు పరిహారం ఇస్తానని ముంపు బాధితులను నమ్మించారు.. ఇప్పుడు ఆర్ అండ్ ఆర్ ఇవ్వకపోయినా పర్వాలేదంటున్నారు.. పోలవరం ఎత్తు తగ్గించినా పర్వాలేదని అనడం జగన్ నమ్మక ద్రోహం.. అప్పుడే మిగులు విద్యుత్ ఉంటే 30వేల మెగావాట్ల పీపీఏలు ఏమిటని ప్రశ్నించి.. ఇప్పుడు మళ్లీ మరో 10వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పాదనకు టెండర్లు పిలవడం ఏమిటి..? ’’ అని ప్రశ్నించారు చంద్రబాబు.

ALSO READ: జీహెచ్ఎంసీ బరిలో జనసేన.. బీజేపీకి సంకటమేనా?

ALSO READ: అళగిరికి బీజేపీ గాలం.. త్వరలో అమిత్‌షాతో అళగిరి భేటీ!

ALSO READ: గుంటూరులో గోవా లిక్కర్.. ధరలు తగ్గినా ఆగని