నెల్లూరులో రెచ్చిపోయిన అల్లరిమూక.. నడిరోడ్డుపై యువకుడిని చావబాదిన రౌడీలు.. సోషల్ మీడియా వైరల్ తో కదిలిన పోలీసులు

నెల్లూరు ఓ అల్లరిమూక రెచ్చిపోయింది. ఓ వ్యక్తిని పబ్లిక్ గా విచక్షణారహితంగా చితకబాదారు. కర్రతో అంత్యంత దారుణంగా.. పశువును బాదినట్లు బాదాడు ఓ వ్యక్తి.

నెల్లూరులో రెచ్చిపోయిన అల్లరిమూక.. నడిరోడ్డుపై యువకుడిని చావబాదిన రౌడీలు.. సోషల్ మీడియా వైరల్ తో కదిలిన పోలీసులు
Balaraju Goud

|

Nov 17, 2020 | 5:59 PM

నెల్లూరు ఓ అల్లరిమూక రెచ్చిపోయింది. ఓ వ్యక్తిని పబ్లిక్ గా విచక్షణారహితంగా చితకబాదారు. కర్రతో అంత్యంత దారుణంగా.. పశువును బాదినట్లు బాదాడు ఓ వ్యక్తి.. నెల్లూరులో జరిగిన ఈ దాడి.. సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. నెల్లూరులోనే ఈ రౌడీ మూకలు వీరంగం సృష్టిస్తున్నారు. బెదిరింపులకు దిగడం యువకులపై దాడులు చేయడం లాంటి ఘటనలు ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువయ్యాయి. నెల్లూరులో ఎక్కడ చూసినా ఈ రౌడీ గ్యాంగ్‌ల హడావుడే కన్పిస్తోంది. ఈ దాడులకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి.

నెల్లూరు ప్రాంతానికి చెందిన యుగంధర్ అనే యువకుడిని అదే ప్రాంతానికి చెందిన రాజశేఖర్‌ చావబాదాడు. ఓ కారు యాక్సిడెంట్ వ్యవహారం.. ఇలా గొడవకు కారణం. కిశోర్ అనే యువకుడి కారును తీసుకెళ్లిన యుగంధర్‌… ఓ యాక్సిడెంట్ చేశాడు. డ్యామేజ్ ఖర్చులు చెల్లించాలంటూ అడిగిన కిశోర్‌కు.. రేపు మాపు అంటూ తిప్పించుకుంటున్నాడు. దీంతో.. రాజశేఖర్‌ను ఆశ్రయించాడు కిశోర్‌. యుగంధర్‌ను పట్టుకున్న రాజశేఖర్‌.. పిచ్చపిచ్చగా చితకబాదాడు. ఈ సంఘటన గురించి ఆరా తీసిన టీవీ9 టీమ్‌కు మరికొన్ని విషయాలు తెలిశాయి. ఈ దాడి ఇప్పుడు జరిగింది కాదు.. మూడు నెలల క్రితం జరిగినట్లు తేలింది. అప్పుడు తీసిన వీడియోను.. ఇప్పుడు లేటెస్టుగా వైరల్‌ చేశారు.

నెల్లూరు నగరంలో రౌడీ మూకలు నానా బీభత్సం సృష్టిస్తున్నాయి. ప్రధానంగా యువకులపైనే దాడులుకు దిగుతున్నాయి. ఓవైపు ఈ దాడి వీడియోలన్నీ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నా… అటు బాధితులు మాత్రం పోలీసులను ఆశ్రయించడం లేదు. ఈ దాడులకు సంబంధించి ఒక్క ఫిర్యాదు కూడా పోలీసులకు అందలేదు. ఇవి బెట్టింగ్‌ మాఫియా ఆగడాలుగా స్థానికులు చెబుతున్నాయి. రీసెంట్‌గా జరిగిన ఐపీఎల్‌లో బెట్టింగ్‌లు వేసి ఆ డబ్బులు ఇవ్వని యువకులపై రౌడీ గ్యాంగ్‌లు ఇలా దాడులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. వీడియో వైరల్ కావడంతో.. రాజశేఖర్‌ కోసం పోలీసులు గాలింపు మొదలుపెట్టారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu