AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కలిసోచ్చిన సోషల్ మీడియా వైరల్.. డబ్బే డబ్బు.. ఇంట్లో చేసిన వంటకాలతో వ్యాపారం చేస్తున్న గృహిణీ..

Business Idea From Home: లాక్ డౌన్ సమయంలో ఇంట్లో ఖాళీగా ఉన్న ప్రతి ఒక్కరు తమలోని టాలెంట్‏ని వెలికితీశారు. సమయం వృదా చేయకుండా.. ఇన్నిరోజులు తమకు నచ్చి

కలిసోచ్చిన సోషల్ మీడియా వైరల్.. డబ్బే డబ్బు.. ఇంట్లో చేసిన వంటకాలతో వ్యాపారం చేస్తున్న గృహిణీ..
Rajitha Chanti
| Edited By: |

Updated on: Feb 10, 2021 | 2:26 PM

Share

Business Idea From Home: లాక్ డౌన్ సమయంలో ఇంట్లో ఖాళీగా ఉన్న ప్రతి ఒక్కరు తమలోని టాలెంట్‏ని వెలికితీశారు. సమయం వృదా చేయకుండా.. ఇన్నిరోజులు తమకు నచ్చి చేయలేకపోయిన పనులను ఎంతోమంది ఈ లాక్ డౌన్ సమయంలో నెరవెర్చుకున్నారు. ఇక ఎక్కువగా లాక్ డౌన్ సమయంలో అందరు ఇంట్లో పనులు చేస్తూ.. ఇంట్లో స్త్రీలకు సహయకంగా మారారు. అలాగే సెలబ్రెటిలు సైతం వంటింట్లోకి అడుగు పెట్టారు. అయితే ఒక మహిళ మాత్రం లాక్ డౌన్ సమయంలో టైంపాస్ కోసం వంటల్లో రకారకాలు చేసింది. ప్రస్తుతం అవే తన వ్యాపారంగా మారిపోయింది.

రాజస్థాన్‏లోని జోధ్ పూర్ ప్రాంతానికి చెందిన స్వాతి పురోహిత్‎కు వంట చేయడం అంటే చాలా ఇష్టం. కరోనా ప్రభావంతో ఏర్పడిన లాక్ డౌన్ సమయంలో ఆమె ఎక్కువగా కేక్స్ తయారు చేస్తూ గడిపింది. అయితే కేక్ చేయడంతోపాటే ఆ ప్రాసెస్ మొత్తం వీడియోగా చిత్రీకరించి.. యూట్యూబ్‏లో అప్ లోడ్ చేసింది. ఆ వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు స్వాతి పురోహిత్‏కు కాంటాక్ట్ అయ్యారు. ఆమె కేక్ తయారు చేసే విధానం మరియు డిజైన్స్ కూడా చాలా మంది ఇష్టపడుతున్నారు. దీంతో ఆమెకు క్రమంగా కేక్ ఆర్డర్లు రావడం ప్రారంభమయ్యింది. ప్రస్తుతం స్వాతి కేక్ ఆర్డర్లతో ఎక్కువగా సంపాదిస్తుంది.

కేక్ వ్యాపారం ఎలా ప్రారంభమైంది.. దీనిపై స్వాతి మాట్లాడుతూ.. “లాక్ డౌన్ సమయంలో నేను ఇంట్లో అందమైన డిజైన్ కేక్ తయారు చేసాను. ఆ కేక్ ఫోటోను నా స్నేహితులకు, బందువులకు షేర్ చేసాను. అయితే కేక్ చాలా బాగుందని తమకు చేయమని అడిగారు. అలా నేను మొదటి సారి డబ్బు కోసం కేక్ చేసాను. ఆ తర్వాత నా కేక్ ఫోటోలు షేర్ అవుతూ చాలా మందికి చేరాయి. దీంతో నాకు ఆర్డర్లు రావడం పెరిగిందో. ఇలా జరుగుతుందని నేను ఊహించలేదు. ఆర్డర్ల సంఖ్య పెరుగుతుండడంతో కేక్ వ్యాపారాన్ని ప్రారంభించాను” అంటూ చెప్పుకొచ్చాడు.

ప్రచారం ఎలా మొదలైందంటే.. స్వాతి కేకులు తయారు చేయడం ప్రారంబించినప్పుడు.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో లేదా వాట్సప్ స్టేటస్‏లో పెట్టేదని ఆమె తెలిపింది. ఆ ఫోటోలు చూసినవారు తమకు కేక్ చేయమని బలవంతం చేశారు. తర్వాత నా బందువులు, నా స్నేహితుల కోసం కేక్ చేశాను. ఆ కేక్ ఫోటోలను వారు షేర్ చేశారు. సోషల్ మీడియాలో నేను చేసిన కేక్ ఫోటోస్ షేర్ చేయడం వలన నా వ్యాపారం క్రమంగా అభివృద్ధి చెందింది అంటూ స్వాతి చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం ఆదాయం…

మొదట్లో స్వాతి కేక్స్ తయారు చేయడం ఒక పార్ట్ టైంగా ఎంచుకుంది. ఆ తర్వాత తన ఇన్‏స్టాగ్రామ్, ఫేస్ బుక్ పేజీని క్రియేట్ చేసింది. దీంతో చాలా మంది ఆ పేజీలను ఫాలో అయ్యారు. ప్రతిరోజు 2 నుంచి 3 వరకు కేక్ ఆర్డర్లు వస్తున్నాయి. ఒక్క కేక్ ధర రూ.700 మరియు రూ.1500 మధ్య ఉంటుంది. ఇక స్వాతి థీమ్ కేక్ చేసినప్పుడు ఎక్కువగా తీసుకుంటుంది. ప్రస్తుతం స్వాతి ఈ పనిని ఇంటి నుంచే చేస్తుంది. ఈ వ్యాపారంలో స్వాతి బాగా సంపాదిస్తుంది. సోషల్ మీడియాలో ఈ కేక్స్ ఫోటోస్ షేర్ అవుతూ.. వ్యాపారం కూడా అభివృద్ధి చెందుతుంది. అయితే స్వాతి హెచ్ఆర్‏లో పీహెచ్‏డీ చేశారని, బేకింగ్ ఫీల్డ్ గురించి ఆమె ఎప్పుడు ఆలోచించలేదని తెలిపింది. కానీ కేక్ వ్యాపారంలో ఆమెకు తన కుటుంబం మద్దతుగా నిలిచింది.

ఆకట్టుకుంటున్న ‘మాస్టర్’ డిలీటెడ్ సీన్.. మేకర్స్ పై సీరియస్ అవుతున్న నెటిజన్స్..

Viral Video: చావు దారిదాపుల్లోకి వెళ్లొచ్చాడు.. 70 అడుగుల ఎత్తు నుంచి పడి ప్రాణాలతో తిరిగొచ్చాడు..