కారులో రూ.80 లక్షలు లభ్యం.. నివ్వెర పోయిన పోలీసులు, అధికారులు.. రంగంలోకి ఆదాయపన్ను శాఖ అధికారులు

చెక్ పోస్టు దగ్గర తనిఖీలు చేస్తున్న అధికారులు ఒక్కసారి నివ్వెరపోయారు. ఎందుకంటే తాము తనిఖీ చేసిన ఓ ఆర్డినరీ కారులో ఏకంగా 80 లక్షల రూపాయలు కనిపించడంతో. హైదరాబాద్ నుంచి ఏపీకి వచ్చిన...

కారులో రూ.80 లక్షలు లభ్యం.. నివ్వెర పోయిన పోలీసులు, అధికారులు.. రంగంలోకి ఆదాయపన్ను శాఖ అధికారులు
Follow us

|

Updated on: Nov 15, 2020 | 2:30 PM

Huge money caught in car: చెక్ పోస్టు దగ్గర తనిఖీలు చేస్తున్న అధికారులు ఒక్కసారి నివ్వెరపోయారు. ఎందుకంటే తాము తనిఖీ చేసిన ఓ ఆర్డినరీ కారులో ఏకంగా 80 లక్షల రూపాయలు కనిపించడంతో. హైదరాబాద్ నుంచి ఏపీకి వచ్చిన ఓ కారును తనిఖీ చేసిన అధికారులు అందులో ఏకంగా 80 లక్షల రూపాయలు కనిపించడంతో షాకయ్యారు. ఆ తర్వాత మెల్లిగా తేరుకుని విచారణ ప్రారంభించారు.

కృష్ణా జిల్లా గరికపాడు చెక్ పోస్ట్ వద్ద చిలకల్లు పోలీసులు రెగ్యులర్ తనిఖీలు చేస్తున్నారు. ఆదివారం ఉదయం హైదరాబాద్ నుంచి వచ్చిన ఓ కారును కూడా అలాగే తనిఖీ చేశారు. అయితే.. కారులో ఎలాంటి పేపర్లు లేని డబ్బు వారికి లభ్యమైంది. పట్టుపడ్డ నగదును అదాయపన్ను శాఖ అధికారులకు అప్పగించారు చిలకల్లు పోలీసులు. కారులో ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న 80 లక్షల నగదు వివరాలను ఆదాయపన్ను శాఖాధికారులు ఆరా తీస్తున్నారు. సికింద్రాబాద్ నుండి కలకత్తాకు నగదు తీసుకెళ్తున్నట్టుగా ఆ కారులో ప్రయాణిస్తున్న బంగారం వ్యాపారి మహ్మద్ బాషా చెబుతున్నట్లు సమాచారం.

చిలకల్లు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేసిన పోలీసులు దాని ప్యారలల్ దర్యాప్తుకు వీలుగా తాము పట్టుకున్న డబ్బును, కారును, అందులో ప్రయాణిస్తున్న వారిని ఆదాయపన్ను శాఖాధికారులకు అప్పగించారు. వారు అనుమానితులతో సహా డబ్బును హైదరాబాద్‌కు తరలించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఆదాయపన్ను శాఖాధికారుల విచారణ కొనసాగుతున్నట్లు సమాచారం.

ALSO READ: ఆన్‌లైన్ జూదానికి మరొకరు బలి

ALSO READ: పెద్దపులి భయంతో జంతు బలి బంద్..

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ