ఆన్‌లైన్ జూదానికి మరొకరు బలి.. జూదంలో లక్షలు కోల్పోయిన డా‌క్‌యార్డు ఉద్యోగి.. రైలు కింద పడి ఆత్మహత్య

ఆన్‌లైన్ జూదం మరొకరిని బలి తీసుకుంది. ఆన్‌లైన్ జూదానికి అలవాటు పడి.. లాక్ డౌన్ కాలంలో లక్షలు నష్టపోయిన ఓ డాక్‌యార్డు ఉద్యోగి చివరికి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడిన దారుణం...

ఆన్‌లైన్ జూదానికి మరొకరు బలి.. జూదంలో లక్షలు కోల్పోయిన డా‌క్‌యార్డు ఉద్యోగి.. రైలు కింద పడి ఆత్మహత్య
Follow us

|

Updated on: Nov 15, 2020 | 1:58 PM

One died due to lose in online gaming: ఆన్‌లైన్ జూదం మరొకరిని బలి తీసుకుంది. ఆన్‌లైన్ జూదానికి అలవాటు పడి.. లాక్ డౌన్ కాలంలో లక్షలు నష్టపోయిన ఓ డాక్‌యార్డు ఉద్యోగి చివరికి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడిన దారుణం విశాఖపట్నంలో చోటుచేసుకుంది. భార్యతో విభేదాల కారణంగా ఒంటరిగా వుంటున్న డాక్‌యార్డు ఉద్యోగి గత ఎనిమిది నెలలుగా ఆన్‌లైన్ జూదానికి అలవాటు పడ్డాడు. లక్షల్లో నష్టపోయాడు.

విశాఖపట్నం జిల్లాలోని గోపాల పట్నం మండలం కొత్తపాలెంలో నివాసముండే సతీష్ కుమార్ అనే వ్యక్తి డాక్ యార్డులో పని చేసేవాడు. లాక్ డౌన్ కారణంగా ఎటూ వెళ్ళలేని పరిస్థితి. ఇంట్లోనే ఒంటరిగా వుంటున్న సతీష్ ఆన్‌లైన్ జూదానికి అలవాటు పడ్డాడు. వ్యక్తిగత విభేదాల కారణంగా సతీష్ తన భార్యకు దూరంగా ఒంటరిగా వుంటున్నాడు. ఒంటరితనానికి తోడు లాక్ డౌన్ పరిస్థితుల కారణంగా సతీష్ ఎక్కువ సమయం ఆన్‌లైన్ జూదంపై గడిపేవాడు.

వరుసగా ఆన్‌లైన్ జూదమాడడం వల్ల సతీష్ లక్షల్లో డబ్బు నష్టపోయాడు. తన వద్ద డబ్బు లేకపోయినా.. అప్పు తీసుకుని మరీ జూదమాడేవాడు సతీష్. ఈ క్రమంలో లక్షల్లో అప్పుల పాలైన సతీష్ అవి తీర్చే దారి లేకపోవడంతో శనివారం రాత్రి మేఘాద్రిగడ్డ డామ్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సతీష్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ALSO READ: పెద్దపులి భయంతో జంతు బలి బంద్..

టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
పవన్‎కు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్న వరుణ్ తేజ్.. ఎప్పుడంటే..
పవన్‎కు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్న వరుణ్ తేజ్.. ఎప్పుడంటే..
ఇంట్లో సాలీడ్లు గూడు కట్టాయా.. ఇది శుభమా? అశుభమా?
ఇంట్లో సాలీడ్లు గూడు కట్టాయా.. ఇది శుభమా? అశుభమా?
ఏపీలోని ఈ ప్రాంతాలకు ఉరుములు, మెరుపులతో వర్షం..
ఏపీలోని ఈ ప్రాంతాలకు ఉరుములు, మెరుపులతో వర్షం..
ప్రపంచంలోనే అతి చిన్న ఎస్కలేటర్.. గిన్నిస్‌ బుక్‌లో స్థానం
ప్రపంచంలోనే అతి చిన్న ఎస్కలేటర్.. గిన్నిస్‌ బుక్‌లో స్థానం
నిద్రకు ముందు ఈ చిన్న పని చేస్తే.. మందుల అవసరమే ఉండదు
నిద్రకు ముందు ఈ చిన్న పని చేస్తే.. మందుల అవసరమే ఉండదు