World military budget: ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్.. ఎంత ఖర్చు పెడుతోందంటే..

ఇటీవల కాలంలో ఏర్పడిన అనిశ్చిత పరిస్థితులు సైనిక వ్యయం విపరీతంగా పెరగడానికి కారణమవుతోంది. ప్రతి దేశం తమ బడ్జెట్లో ఎక్కువశాతం సైనిక వ్యయం కోసమే కేటాయిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు 2023లో కేవలం సైనిక సామర్థ్యం కోసం చేసిన ఖర్చు ఏకంగా 2,443 బిలియన్ల డాలర్లకు చేరింది. ఈ జాబితాలో అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతోంది.

World military budget: ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్.. ఎంత ఖర్చు పెడుతోందంటే..
Indian Military
Follow us

|

Updated on: Apr 26, 2024 | 6:16 PM

ప్రతి దేశానికి తమ భూభాగం రక్షణకు సైనిక వ్యవస్థ అత్యవసరం. సైనికులతో పాటు అత్యాధునిక ఆయుధాలను సమకూర్చుకుంటుంటాయి. ఇందుకోసం ఖర్చు కూడా అధికంగా అవుతుంది. ప్రతి దేశానికి ఇది తప్పనిసరి అయినప్పటికీ ఇటీవల కాలంలో ఏర్పడిన అనిశ్చిత పరిస్థితులు సైనిక వ్యయం విపరీతంగా పెరగడానికి కారణమవుతోంది. ప్రతి దేశం తమ బడ్జెట్లో ఎక్కువశాతం సైనిక వ్యయం కోసమే కేటాయిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు 2023లో కేవలం సైనిక సామర్థ్యం కోసం చేసిన ఖర్చు ఏకంగా 2,443 బిలియన్ల డాలర్లకు చేరింది. ఈ జాబితాలో అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతోంది.

తాజా సర్వే ప్రకారం..

ఇటీవల విడుదలైన ఒక తాజా సర్వే లో తెలిపిన వివరాల ప్రకారం మొత్తం ప్రపంచ సైనిక వ్యయం 2023లో 6.8 శాతం పెరిగింది. తమ ఆయుధ సంపత్తిని పెంచుకోవడానికి దేశాలు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. గ్లోబల్ మిలిటరీ వ్యయానికి సంబంధించి యూఎస్ఏ 916 బిలియన్ డాలర్లు, చైనా 296 బిలియన్ డాలర్లు, రష్యా 109 బిలియన్ డాలర్లు, మన దేశం 84 బిలియన్ డాలర్లు, సౌదీ అరేబియా 76 బిలియన్ డాలర్లు, యూకే 75 బిలియన్ డాలర్లు, జర్మనీ 67 బిలియన్ డాలర్లు, ఉక్రెయిన్ 65 బిలియన్ డాలర్లు, ఫ్రాన్స్ 61 బిలియన్లు డాలర్లు, జపాన్ 50 బిలియన్లు డాలర్లు ఖర్చుపెడుతున్నాయి. వీటిలో పాకిస్థాన్ 30వ స్థానంలో నిలిచింది. ఆ దేశం 8.5 బిలియన్ డాలర్లు వ్యయం చేస్తుంది.

నాలుగో స్థానంలో భారత్..

అమెరికా, చైనా, రష్యాల తర్వాత రక్షణ రంగానికి అధిక మొత్తంలో ఖర్చు చేసే నాలుగో దేశంగా భారత్ నిలిచింది. అయితే మన దేశంలో సైనిక పెట్టుబడిని పెంచుకోవడానికి కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తోంది. గణనీయమైన జీతం, పెన్షన్ బాధ్యతలు, సైనిక సామర్థ్యాలను పెంపొందించడానికి దీర్ఘకాలిక వ్యూహాల అమలులో కొన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయి. మన సైనిక శక్తి ఆధునికీకరణ, అలాగే 1.4 మిలియన్ల సాయుధ దళాల సిబ్బందికి భారీ జీతం, పెన్షన్ బిల్లులు, సరైన ఇంటర్ సర్వీస్‌తో సైనిక సామర్థ్యాలను క్రమపద్ధతిలో నిర్మించడానికి దీర్ఘకాలిక ప్రణాళికలు లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.

పకడ్బందీగా చైనా..

పొరుగు దేశం చైనా మాత్రం తన 2 మిలియన్ల సైన్యాన్ని శరవేగంగా ఆధునీకరిస్తోంది. భూమి, గాలి, సముద్రం అలాగే అణు, అంతరిక్షం, సైబర్ రేడిషనల్ డొమైన్‌లలో నూతన టెక్నాలజీతో దూసుకుపోతుంది. దానిలో భాగంగా ఈ ఏడాది సైనిక బడ్జెట్ ను గణనీయంగా పెంచింది. ఇది మన దేశం కంటే దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ. చైనా తమ తూర్పు, దక్షిణ సముద్ర తీరాలతో పాటు తైవాన్ లో యూఎస్ నేతృత్వంలోని కూటమి జోక్యాన్ని నిరోధించడానికి సైనిక వ్యయం ఎక్కువగా ఖర్చు చేస్తుంది. భారత్‌తో 3,488 కిలోమీటర్ల వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి కొన్నిసార్లు దూకుడుగా వ్యవహరించినా వెనక్కు తగ్గుతోంది. కానీ ఉద్రిక్తతలను తగ్గించడానికి నిరాకరిస్తోంది. ఇది హిందూ మహాసముద్ర ప్రాంతంలో నావికాదళ ఉనికిని క్రమంగా పెంచుతుంది.

పెరుగుతున్న సైనిక వ్యయం..

అమెరికా, యూరప్, మధ్యప్రాచ్యం, ఆఫ్రికా, ఆసియా ఓషియానియా అనే ఐదు భౌగోళిక ప్రాంతాలలో సైనిక వ్యయం పెరగడం 2009 తర్వాత ఇదే మొదటిసారి. ప్రపంచంలో శాంతిభద్రతల క్షీణతకు సైనిక వ్యయంలో ఈ పెరుగుదలే ప్రత్యక్ష నిదర్శనమని కొందరు భావిస్తున్నారు. యుద్ధ విమానాలు, జలాంతర్గాములు, హెలికాప్టర్ల తోపాటు ఆధునిక పదాతిదళ ఆయుధాలు, ట్యాంక్ వ్యతిరేక గైడెడ్ క్షిపణులు, రాత్రి పోరాట సామర్థ్యం తదితర వాటిలో మన దేశానికి కొంత కొరత ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
నిద్రలో స్టేషన్‌ మాస్టర్‌.. రైలు సిగ్నల్‌ కోసం అరగంట పాటు..
నిద్రలో స్టేషన్‌ మాస్టర్‌.. రైలు సిగ్నల్‌ కోసం అరగంట పాటు..
మీ సొంతురిలో వ్యాపారం చేయాలని ఉందా.? ఈ ఐడియాలతో భారీ లాభాలు
మీ సొంతురిలో వ్యాపారం చేయాలని ఉందా.? ఈ ఐడియాలతో భారీ లాభాలు
అందుకే దూరమయ్యాం. ప్రవీణ్‌తో బ్రేకప్‌కు అసలు కారణం చెప్పేసిన ఫైమా
అందుకే దూరమయ్యాం. ప్రవీణ్‌తో బ్రేకప్‌కు అసలు కారణం చెప్పేసిన ఫైమా
ఈ అమాయకురాలే.. ఇప్పుడు బోల్డ్ బ్యూటీనా.. ఇంతలా మారిపోయిందేంటీ..
ఈ అమాయకురాలే.. ఇప్పుడు బోల్డ్ బ్యూటీనా.. ఇంతలా మారిపోయిందేంటీ..
కడప విమానాశ్రయానికి రాజదర్పం.. గండికోట తరహాలో టెర్మినల్ భవనం
కడప విమానాశ్రయానికి రాజదర్పం.. గండికోట తరహాలో టెర్మినల్ భవనం
కనురెప్పలు ఒత్తుగా పెరగాలా.. ఈ చిట్కాలు బెస్ట్..
కనురెప్పలు ఒత్తుగా పెరగాలా.. ఈ చిట్కాలు బెస్ట్..
అవినీతిపరుల దగ్గర్నుంచి నల్లధనాన్ని కక్కిస్తాం.. ప్రధాని మోదీ..
అవినీతిపరుల దగ్గర్నుంచి నల్లధనాన్ని కక్కిస్తాం.. ప్రధాని మోదీ..
పళ్ళు తోముకోకుండా ఉదయాన్నే నీళ్లు తాగడం మంచిదేనా?
పళ్ళు తోముకోకుండా ఉదయాన్నే నీళ్లు తాగడం మంచిదేనా?
బరువు తగ్గాలని రాత్రి డిన్నర్‌ చేయడం మానేస్తున్నారా.?
బరువు తగ్గాలని రాత్రి డిన్నర్‌ చేయడం మానేస్తున్నారా.?
క్యాచ్ ఆఫ్ ది సీజన్! కేకేఆర్ ప్లేయర్ ఊహించని విన్యాసం.. వీడియో
క్యాచ్ ఆఫ్ ది సీజన్! కేకేఆర్ ప్లేయర్ ఊహించని విన్యాసం.. వీడియో
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..